Hindu marriage act law

Hindu Marriage Act Law, second marriage

Hindu Marriage Act Law

రెండో వివాహం - ఆస్తిలో వాటా

Posted: 06/27/2013 01:48 PM IST
Hindu marriage act law

మా ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా... నేను మేజర్‌ను అన్న ధీమాతో 2008లో పెద్దలను ఎదిరించి ఒకతన్ని ప్రముఖ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాను. తరు వాత మాకు ఒక అమ్మాయి పుట్టింది. అయితే నా భర్తకు ముందే పెళ్లైందని తరువాత తెలిసింది. ఆమె కొన్ని గొడ వల కారణంగా ఆమె పుట్టింటికి వెళ్లి పోయిందని తెలిసింది. అమె నా భర్త పై గృహహింస చట్టం, వరకట్న నిషే ధం, పోషణ, రక్షణ చట్టం క్రింద కేసు పెట్టిందని తెలిసింది. దీని నుం డి నాకు ఏమైనా ఇబ్బందులు ఎదు రవుతాయా? అయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉం టుంది. అతని ద్వారా నాకు ఎలాం టి హక్కులు ప్రాప్తిస్తాయి లాంటి విషయా లను దయ చేసి చెప్పగల రు.

ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతని పూర్తి వివరాలు సేక రించిన పిమ్మట మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కానీ, అతని మాటలకు మీరు మోసపోయారు. అయితే, అతని నిజంగానే పెళ్లైందా? లేదా అది మిమ్మ ల్ని వదులుకోవడానికి చేసే ప్రయత్నమా? తెలుసుకోండి. ఒకవేళ మొద టి భార్య విషయం నిజమే అయి..ఆమె కేసు పెట్టినట్లయితే అందులో మీ పేరు ఉందేమో చూసుకోండి. పూర్తి వివ రాలు తెలుసుకొని వెంటనే మీ భర్త మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకొన్నట్లు మీ దగ్గరలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి దాని రశీదు తీసుకోగలరు. లేదంటే.. మీ భర్తపై మొదటి భార్య పెట్టే కేసులో మీరు ఉన్నట్లయితే.. మీరు నేరం చేసినవా రవుతారు. ముందు దాని నుండి తప్పిం చుకోవడానికి మీ భర్తపై మో సం క్రింద కేసు నమోదు చేయండి. మీ భర్త మొదటి భార్యకే సర్వ హక్కులు ఉంటాయి. మీకు పోషణ, రక్షణ, నివాసం గురించి మాత్రమే హక్కు ఉంటుంది గానీ ఆస్తిలో హక్కు లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh