Prohibition of Child Marriage Act is a Secular law and would prevail over Personal Laws of Parties : Gujarat HC

Child marriage prevention act secular in nature hc

muslim marriage,child marriage,prevention of child marriage act,prohibition of child marriage act,gujarat high court,muslim personal law,hindu marriage act,ngo independent thought,gujarat high court news,legal news india,indian legal news,indian courts news

Gujarat High Court on Wednesday ruled that the Prohibition of Child Marriage Act, 2006 is a secular law which specifically deals with the problem of child marriages.

నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..?

Posted: 10/03/2015 04:27 PM IST
Child marriage prevention act secular in nature hc

నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ చట్టం దేశంలో జరుగుతున్న బాల్యవివాహాలన్నింటికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దేశంలో అన్ని వర్గాల, మతాల వారికీ ఈ చట్టం వర్తిస్తుందని వెల్లడించింది. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రత్యేక చట్టమని, కాబట్టి ఇది ముస్లింలకు కూడా సమానంగా వర్తిస్తుందని తీర్పు వెలువరించింది. ముస్లిం, హిందూ లేదా ఇతర మతాల వ్యక్తిగత చట్టాల్లోని కొన్ని అంశాలను సైతం ఈ చట్టం తిరస్కరిస్తుందని జస్టిస్ జేబి పర్దివాలా స్పష్టం చేశారు. గుజరాత్ కు చెందిన యూనుస్ షేక్ అనే ముస్లిం దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఈ విధంగా స్పందించింది.

16 ఏళ్ల బాలికను ఎత్తుకుపోయి అతను పెళ్లి చేసుకున్నాడు. తాను ముస్లింననీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాల్య వివాహ నిరోధక చట్టం తనకు వర్తించదని వాదించాడు. ఈ వాదనలను తిరస్కరించిన కోర్టు చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పలు మతాల పర్సనల్ లా లోని అంశాలకు అతీతంగా బాల్య వివాహ నిరోధక చట్టం పని చేస్తుందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అయితే మార్పులు, చేర్పులకు అనుమతించని ముస్లిం పర్సనల్ లా చట్టం వల్ల ముస్లింలకు తీరని నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles