మా తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోమన్నాడు.. ఇంటిపై నాకు హక్కు లేదా..? how to own fathers property without his concern

How to own fathers property without his concern

son, sons right, parents house, son parental house, high court, delhi high court, son parents house. ancestral property, parents earned property

Reaffirming that sons do not have any legal rights over the self-acquired property of parents, the Delhi High Court has dismissed a plea filed by a man who had approached the court to be allowed to stay in his parents’ house.

మా తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోమన్నాడు.. ఇంటిపై నాకు హక్కు లేదా..?

Posted: 11/30/2016 05:20 PM IST
How to own fathers property without his concern

మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని తెలిసినప్పుడు కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్లిపోమ్మని అనరు. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్లి తెలియక జరిగింది క్షమించమని వారే మీ కన్నా ముందు చర్యలు తీసుకుంటారు.

ఇక తల్లిదండ్రులు కొడుకులు ఎంత వెదవ పని చేసినా.. ఇంటి పట్టునే వుండు.. ఇంట్లోంచి ఎక్కడికీ వెళ్లకు అని అంటారు.. కానీ వెళ్లిపోమ్మని చెప్పేదాక పరిస్థితి వచ్చిందంటే.. కారణాలను అర్థం చేసుకోగలం. దీనికి తోడు మీ ప్రశ్నలోని రెండో భాగంలో వింటూనే అర్థమవుతుంది. అయితే వారు నివాసముంటున్న ఇళ్లు ఎవరిది..? వారికెలా సంక్రమించింది. వారి తాత, తండ్రుల ద్వారా వచ్చిందా.? లేక వారి స్వార్జితమా..? అన్నది కూడా మీరు స్పష్టం చేయలేదు.

మొదటిది వారికి ఒకవేల తాత, తండ్రుల నుంచి సంక్రమించిన అస్తి అయినా అది మీకు చెందదు. తాతా ఆస్తిపై మనుమళ్లకు మాత్రమే హక్కు వుంటుంది కాబట్టి.. మనమళ్లు మేజర్లుగా మారిన తరువాతే అస్తి లభిస్తుంది. ఇక రెండో అంశానికి వస్తే మీరు తెలిపిన ఆస్తి వారి స్వార్జితమైతే.. ఏ కోశానా అది మీకు మీ పిల్లలకు చెందదు. అది పూర్తిగా వారి ఇష్టంపైనే అధారపడి వుంటుంది. తాజాగా ఢి్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తల్లిదండ్రుల ఇంట్లో ఉండేందుకు కుమారులకు ఎలాంటి చట్టపరమైన హక్కూ లేదని తీర్పును వెలువరించింది.

అమ్మానాన్నల దయతో మాత్రమే వారింట్లో బిడ్డలు ఉండవచ్చని, అలాగని కొడుకును జీవితాంతం భరించాల్సిన అవసరం కూడా లేదని జస్టిస్ ప్రతిభా రాణి తీర్పును వెలువరించారు. ఇక స్వార్జితంతో సంపాదించిన ఇల్లయితే... కుమారుడు అవివాహితుడా, వివాహితుడా అన్న మీమాంస కూడా అవసరం లేదని తెలిపారు.

ఢిల్లీలోని నాగోలి ప్రాంతానికి చెందిన సచిన్ అనే వ్యక్తి.. తన తల్లిదండ్రులకు సానుకూలంగా కింది కోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో దానిని సవాల్ చేస్తూ.. ఢిల్లీ న్యాయస్థానాన్ని అశ్రయించాడు. తల్లిదండ్రులకు అనుకూలంగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ కొడుకు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కోట్టివేసింది. తాము కష్టపడి సంపాదించి రెండు అంతస్థులు నిర్మించుకున్న ఇంటిని తమ కోడుకులు అక్రమించి.. తమను హింసిస్తున్నారని, ఇంటి విద్యుత్ చార్జీలు, పన్నులను సైతం కట్టకుండా వేదిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు

తమ కొడుకులను తక్షణం తమ ఇల్లు ఖాళీ చేయించాల్సిందిగా కోరడంతో కిందికోర్టు తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీనిన హైకోర్టులో సవాల్ చేసిన కొడుకులకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తల్లిదండ్రుల అనుమతి, దయతో మాత్రమే మీరు ఇంట్లో వుండే అవకాశం వుంది.కన ఇంటినళ్లలో ఉంటున్న ఇద్దరు కొడుకులు, కోడళ్లను ఖాళీ చేయించాలని, వారు తమను హింసిస్తున్నారంటూ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : delhi high court  parents  sons  parents earned property  ancestral property  

Other Articles