Madras HC raps railways for denying job to diabetic woman, says she is eligible

Madras high court says diabetics eligible for govt jobs

Diabetics eligible for appointment in govt posts, diabetic, appointment, government posts, scientific proof, Madras High Court, diabetics eligible for govt jobs,,scientific proof, liability, employer, india, National News,Court,India,Railways , Diabetic eligible for appointment in govt posts,news, India news

Making it clear that a diabetic is eligible for appointment in government posts as there is no scientific proof to show such a person would not be able to discharge his duties, the Madras High Court has directed Southern Railways to appoint an applicant within eight weeks.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త.. వాటికి మీరు అర్హులే..!

Posted: 07/15/2015 06:10 PM IST
Madras high court says diabetics eligible for govt jobs

నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు మేరకు మీరు షుగర్ పేషంట్లు అయినా ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్హులే. ఈ మేరకు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. షుగర్‌తో బాధపడుతున్నవారు విధులు సక్రమంగా నిర్వహించలేరనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది.

తనకు షుగర్ వ్యాది వుందని తనను ఉద్యోగంలోకి తీసుకోవడం లేదని దక్షిణ రైల్వేపై పోరాడిన పుష్పమ్ అనే మహిళను 8 వారాల్లోగా ఉద్యోగంలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆమె అపాయింట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ రైల్వే సిపిఆర్‌‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు రామసుబ్రహ్మణ్యం, టి.మైత్రివన్‌లతో కూడిన ధర్మాసనం డిస్మిస్ చేసింది. అదే సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియన్ డయాబెటిక్ రీసర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం భారత్‌‌లో 40.9 మిలియన్ల మంది మధుమేహవ్యాధి గ్రస్తులని చెబుతూ వీరిని ఉద్యోగాల్లోకి తీసుకోబోమంటే కుదరదని తేల్చి చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : diabetic  appointment  government posts  scientific proof  Madras High Court  

Other Articles