నాకు 1999లో పెద్దల సమక్షములో వివాహము జరిగినది. ఆ తరువాత నాకు ఒక కుమారుడు జన్మించాడు. అతని వయస్సు 14 సంవత్సరాలు. నాకు, నా భర్తకు మధ్య చాలా కాలం నుండి గొడవలు జరుగుతున్నా యి. ఇదిలావుండగా... ఈ మధ్యకాలంలో ఒకతనితో పరిచయం ఏర్పడినది. ఈ విషయం గురించి నా భర్తకు పూర్తి వివరాలతో తెలియజేయడం జరిగింది. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు. దానికి కారణం లేకపోలేదు. నా భర్తకు నాతో పెళ్ళి కావడానికి ముందు ఒక ముస్లిం యువతితో పరిచయం ఉన్నది. ఆ విషయం నాకు ఆయనే చెప్పారు. తరువాత మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. తరువాత నా భర్తకు ప్రభుత్వ ఉద్యోగము వచ్చినది. అక్కడ సర్వీస్బుక్లో ఇతర వ్యవహరము అనగా పాలసీలతో సహా ‘నామినీ ’ క్రింద పేరు నమోదు చేసినాడు. ఇప్పుడు నా కొడుకు ఆరోగ్యం బాగా లేదు, నాకు సంపాదన లేదు. చాలా కష్టముగా ఉన్నది ఈ విషయంలో మా దగ్గరలో న్యాయవాదిని కలువగా అతను విడాకులు తీసుకోమని సలహ ఇస్తున్నాడు. అయితే అలా చేయవచ్చో లేదో అర్థం కావడం లేదు. కావున నాయందు దయతలచి ఉత్తమమైన న్యాయ సలహా ఇవ్వవలసిందిగా మనవి.
మీకు మీ భర్తకు మధ్యలో ఎలాంటి గొడవ లు ఉన్నది పూర్తి వివరాలు తెలియజేయలేదు. మీ పెళ్ళికి ముందు ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధము ఉన్నట్లు మీ భర్త మీకు చెప్పినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొన్నారో చెప్పలేదు. అదే విధముగా మీరు కూడా మీ భర్త అనుమతితో మరో వ్యక్తితో వివా హేతర సంబంధం ఏర్పరుచుకున్నాను అని చెప్పారు. అయితే అతన్ని పెళ్ళి చేసుకున్నారా లేదా చెప్పలేదు. ఒకవేళ అతన్ని పెళ్ళి చేసుకుంటే దానికి ఏమైనా సాక్ష్యాదారాలు ఉన్నాయా ? ఏదేమైనా మీరిద్దరు కలిసి మీ కొడుకు జీవితాన్ని పాడుచేస్తున్నారు. ఇప్పుడైనా మించి పోయింది లేదు. మీకు రెండవ వ్యక్తితో పెళ్ళి కాని ఎడల, ఎలాంటి ఆధారములు లేని ఎడ ల మీ భర్తతో తిరిగి కలిసి కాపురం చేయుటకు హిందూ వివాహ చట్టము లోని సెక్షన్ 9 ప్రకారము కోర్టులో కేసు వేయగలరు.
అదే విధముగా మీకు గాని మీ భర్తకు గాని సంబంధించిన బంధు, మిత్రుల ద్వారా ఇద్దరు తప్పులను గురించి చర్చించి దాని ద్వారా సమస్య పరిష్కారము చేసుకోగలరు, లేనిచో కోర్టు ద్వారా, రక్షణ, పోషణ, నివాసము, పిల్లవాడి ఆరోగ్య ఖర్చులు, నష్ట పరిహరము అడుగవచ్చును, అదే విధముగా మీరు ముం దు చేసుకొన్న వివాహ ఆధారములు అనగా కలిసి దిగిన ఫొటోలు, ప్రభుత్వం తరుపున రేషన్కార్డుగాని పెళ్ళికార్డు, ఇవి ఏమి లేనిచో మీ యొక్క మండల రెవెన్యూ కార్యాలయము నుండి మీ భర్త యొక్క హక్కు సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలోని మరో న్యాయవాదిని సంప్రదించి అతని ద్వారా మీ భర్త పనిచేస్తున్న పై అధికారికి, మీ భర్తకు, మీ భర్తకు గల అక్రమ భార్యను ఈ ముగ్గురిని పార్టీ చేసి కోర్టులో డిక్లరేషన్ దావా వేసినచో తప్పక మీ భర్త ఉద్యోగము చేస్తున్న ఆఫీసులో అదే విధముగా ఇతర సంపాదనలో హక్కు అనగా ‘నామినీగా ’ న్యాయం జరుగును, కావున ఇవి అన్నీ జాగ్రత్తగా సాక్ష్యాదారాలతో సహా కోర్టుకు సమర్పిం చండి. తప్పక న్యాయము జరుగును.
(And get your daily news straight to your inbox)
Mar 16 | తన భర్తకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని.. అతడి మరణం తరువాత తమ కుటుంబంలోని వ్యక్తులకు అందించవచ్చునని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. కుటుంబం అంటే కేవలం భర్త తరపు వారు మాత్రమే కాదని..... Read more
Nov 30 | మీ త్లలిదండ్రుల ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్లిపోమని అన్నారంటే అందుకు గల కారణాలను తెలిపాలి. మంచి పనులు చేస్తే వెళ్లిమన్నారా..? లేక దేని గురించి వెళ్లిపోమన్నారన్నది మీరు తెలియజేయలేదు. ఇక మంచి పనులతో ఇబ్బందులు వస్తాయని... Read more
Oct 03 | నేను ముస్లిం.. నాకు బాల్యవివాహాల చట్టం వర్తిస్తుందా..? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మద్రాసు కోర్టు తరువాత గుజరాత్ హైకోర్టు కూడా బాల్య వివాహ నిరోధక చట్టంపై స్పష్టమైన అదేశాలను జారీ చేసింది. ఈ... Read more
Jul 15 | నాకు డయాబిటిస్ వుంది..? నాకు వారసత్వంగా షుగర్ వ్యాధి సంక్రమించింది. అయితే నేను ప్రభుత్వ ఉద్యోగానికి పనికిరానా..? అన్న ప్రశ్న సాధరణంగా చాలా మందిలో తలెత్తుతుంది. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు వెల్లడించిన తీర్పు... Read more
Jul 02 | నేను నా భర్తకు రెండో భార్యను, ఆయన మొదటి భార్య 2005లోనే కన్నమూసింది. ఆయన కూడా 2011లో మరణించారు. ఈ నేపథ్యంలో నాకు నా భర్త పించను లభిస్తుందా..? అన్న సందేహాలు చాలా మంది... Read more