Discuss problems in land

discuss-problems-in-land.png

Posted: 09/28/2012 06:02 PM IST
Discuss problems in land

Legal_Adviseనేను 1990 సంవత్సరంలో విశాఖపట్టణంలో 150 గజాల భూమిని కొను గోలుచేసి అక్కడి రిజిస్టర్‌ ఆఫీస్‌లోనే సంబంధిత భూమిని రిజి స్ట్రార్‌ చేయించాను. ప్రస్తుతం నేను హైదరా బాద్‌లో ఉంటున్నాను. అప్పుడప్పుడు ల్యాండ్‌ ప్రాపర్టీని చూసుకుని వస్తుంటాను. కాగా ఒక సారి రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్లినప్పుడు ఆ స్థలా న్ని ప్రభుత్వ అసైన్డ్‌ భూమిగా మార్చబడిందని అన్నారు. నాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం దానిని అసైన్డ్‌ భూమిగా ఎలా మా రుస్తుంది. అది కేవలం నా కష్టార్జితం. ఇలా ప్రభుత్వమే సామాన్య ప్రజలనుండి అన్యా యంగా అసైన్డ్‌ భూమి అని చెప్పి ఎటువంటి సూచన చేయకుండా దానిని అన్యాక్రాంతం చేసుకుంటే పరిస్థితి ఏమిటి? ఆ భూమి తిరిగి నా పేరు మీద రాయించు కోవాలంటే నేను ఏ మి చేయాలి? ఏం చేస్తే తిరిగి ఆ భూమి నాకు వస్తుందో తెలియ జేయ గలరు. నాలాంటి ఎం దరో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దయచేసి సూర్య పత్రిక ద్వారా ఇలాంటి సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు.

మీరు స్థలం కొని రిజిస్ట్రేషన్‌ చేయించడం తెలివైన పనే. కానీ అసైన్డ్‌ భూములు అన్యా క్రాంతమై పేదలకు దక్కడం లేదు. వాటిని ప్రైవేట్‌ భూములుగా చూపిస్తూ క్రయవి క్రయాలు రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటనలు రోజూ నిత్యకృ త్యమైపోయాయి. ఇటువంటి దురాక్రమణలు అన్నీ ప్రభుత్వం దృష్టికి రావ డంతో వాటిమీద సీరియస్‌గా చర్య తీసుకో వాలనుకుంటోంది ప్రభుత్వం. అందుకే ప్రభు త్వం ప్రతి జిల్లా రి జిస్ట్రేషన్‌ కార్యాలయానికీ అసైన్డ్‌ భూముల వి వరాలతో ఉన్న పట్టికను పంపించినా... వాటిని కాసుల కోసం కక్కుర్తి పడి సంబంధిత కా ర్యాలయంలో డిస్‌ప్లే చేయడంలేదు. దీంతో మీలాంటి అమాయ కులు ఇలాంటి అసైన్డ్‌ భూమిని కొనుగోలు చేసి మోసపోతున్నారు.కొందరు అవినీతి దళారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని సిబ్బందిని మచ్చిక చేసుకుని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మసిపూసి మారే డుకాయ చేసేస్తున్నారు.

ఇకముం దైనా ఏదైనా స్థలం కొనుగోలు చేసే ముందు మీకు దగ్గర లో ఉన్న న్యాయవాదిని సంప్రదించి తగిన రికార్డ్‌ భూమి యొక్క పత్రాలు పరిశీలించిన పిదపనే తీసుకోవాలి. ఈ అసైన్డ్‌ భూములు ప్రభుత్వం తిరిగి తీసుకునే ముందు మీకు నోటీసు ఇవ్వవ లసిన అవసరం వారికి లేదు. మీరు భూమి పన్ను కట్టినట్లుగానీ, రెవెన్యూ రికార్డ్‌లో మీ పేరు మార్చుకున్నట్లుగానీ ఎక్కడా చెప్పలేదు.ఆ భూమి ప్రభుత్వానికి చెంది నదే కాబట్టి దానిపై సర్వహక్కులూ ప్రభుత్వాని కే ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై మనం చర్య తీసుకోలేము. మీకు అటువంటి భూమి ని అంటగట్టిన వారిపై మీరు క్రిమినల్‌ కేసు పెట్టండి. ఇలా ఎవరికి వారు వదిలేసేయ బట్టే ఇటువంటి మోసాలు చాలా సులభంగా కొందరు దళారీలు చేయగలుగుతున్నారు. ఎ వరో ఒకరు పూనుకోకపోతే... నాకెందుకులే అని వదిలేస్తే... ఇటువంటి అన్యాయాలు జరు గుతునే ఉంటాయి. ఇకనైనా మీరు మేలుకొని అటువంటి దళారీలపై చర్య తీసుకోవడానికి ప్రయత్నించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Divorce husband and wife
How to dividing joint family properties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles