How to get an immediate divorce

immediate divorce, Need immediate divorce, divorce information, husband and wife, law advice.

How to Get an Immediate Divorce

How to Get an Immediate Divorce.png

Posted: 11/06/2012 05:56 PM IST
How to get an immediate divorce

divorceమాకు పెళ్లయి 15 ఏళ్లు. ఇద్దరు మైనర్ పిల్లలు. నేను బాగా చదువుకున్నాను. అయితే నా భర్త ఒప్పుకోకపోవడం వల్ల, సంసార బాధ్యతలు, పిల్లల పెంపకం బాధ్యతలతో ఉద్యోగం చేయలేక కొన్నేళ్లు ఊరుకున్నాను. కానీ నా భర్త బాధ్యతారాహిత్యం, కుటుంబ బాధ్యతలు చూసుకోకపోవడం, తాగుడు, వ్యసనాలు, పిల్లలపై, నాపై ప్రేమ చూపకపోవడం వంటి కారణాలతో విసిగిపోయి ఐదేళ్ల క్రితం నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశాను. నేను ఒక్కతెనే కూతుర్నవ్వడం వల్ల గత్యంతరం లేక నన్ను, నా పిల్లలను నా తల్లిదండ్రులు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. రెండేళ్లక్రితం విడాకుల కోసం కోర్టులో క్రూయల్టీ గ్రౌండ్ కింద కేసు ఫైల్ చేశాను. కనీస బాధ్యత లేని అతడితో కలిసి జీవించడం దుర్భరం. కానీ విచిత్రంగా అతడు ‘విడాకులు ఇష్టం లేదు. కలిసి బతుకుతాన’ని జడ్జి ముందు, లోక్ అదాలత్ ముందు చెప్పాడు. ఇన్ని రోజులు వాయిదాలు కోరుతూ, కోర్టు బయట మాతో మాత్రం ‘‘మీరు పది లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తాన’ని అంటూ చెబుతూ కాలం గడిపాడు. పెద్దమనుషులు కల్పించుకుని మధ్యవర్తిత్వం చేశాక విడాకులకు ఒప్పుకున్నాడు. ఇప్పుడు త్వరగా విడాకులు పొందడానికి నేనేం చేయాలి?

ఇద్దరూ విడాకులకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆర్డర్ 6 రూల్ 17 సీపీసీ కింద సెక్షన్ అమెండ్ చేయమని అనగా మీరు క్రూయల్టీ గ్రౌండ్ కింద మీరు వేసిన డైవోర్సు పిటీషన్‌ను 13 (బి) మ్యూచువల్ డైవోర్సు కిందకు అమెండ్ చేయమని కోర్టులో ఒక ఐ.ఏ. దాఖలు చేయండి. కోర్టువారు ఆ పిటిషన్‌ను ఆమోదించాక మీరు 13 (బి) మ్యూచువల్ డైవోర్సు కింద మళ్లీ ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేసి, పాత పిటిషన్‌లో అలిగేషన్స్ అన్నీ విత్‌డ్రా చేసుకుంటూ అమెండ్‌మెంట్ చేసుకోవాలి.మ్యూచువల్ డైవోర్సు తీసుకుంటున్నప్పుడు, మీకు భర్త నుంచి రావాల్సిన భరణం, రిటర్న్ ఆఫ్ ఆర్టికిల్స్ (నగలు, బంగారం, వెండి, డబ్బు... తదితరాల)తో పాటు పిల్లల కస్టడీ వంటి అంశాలను ముందే ఇద్దరూ నిర్ణయించుకుని సంతకాలు పెట్టి కోర్టులో ఫైల్ చేయండి. డైవోర్సు అయ్యాక పిల్లల కస్టడీ, భరణం వంటి వాటి గురించి మాట్లాడుకోవడం కుదరదు కాబట్టి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh forest act
Divorce husband and wife  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles