మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహరెడ్డి చిత్ర ఘూటింగ్లో బిజీగా వున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం కూడా పాఠకులకు, మెగా అభిమానులకు తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో కథానాయిక ఎవరో తెలియాల్సి ఉంది.
కాగా కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పనులు ఆగిపోయాయని ఇటీవల వార్తలు వచ్చాయి. స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాలని కొరటాలను చిరు అడిగినట్లు రాశారు. ఈ వార్తల్ని నిర్మాణ సంస్థలు సోమవారం ఖండించాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తీసేందుకు చిరు, కొరటాల సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాయి.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాను నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర నిర్మాణ యూనిట్ ప్రయత్నిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more