Bandla to produce Pawan’s comeback film పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

Bandla ganesh to produce pawan kalyan s comeback film

Bandla Ganesh, Power Star, Pawan Kalyan, Mythri Movie Makers, Boyapati Srinu, Janasena, AP General Elections, politics, movies, entertainment, tollwood

The latest buzz reveals that Bandla Ganesh is planning to produce Pawan’s comeback flick. Apparently, the comedian turned producer has told Boyapati Srinu to come up with a solid script.

పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

Posted: 05/28/2019 07:01 PM IST
Bandla ganesh to produce pawan kalyan s comeback film

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల తరుణంలో సభలు .. సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యనే వున్నారు. మార్పు కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆయన పంథాను రాష్ట్రంలోని ఏడున్నర శాతం మంది ఫాలో అయ్యారు. దీంతో రానున్న కాలంలో ఆయన మార్గంలో నడిచేందుకు అనేక మంది కలసివస్తారన్న ధీమాకు ఇదే నాంది.

ఓటర్లకు గిప్టులు, ఏసీలు, కూలర్లు, మురికివాడల్లోని ప్రజలకు ఓటుకు మూడేసి వేల రూపాయలు.. ఇవి కాకుండా ఎన్నికల నామినేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు వీటన్నింటికీ కోట్ల రూపాయలు హరతి కర్పూరంలా అయిపోతున్నాయి. అయితే కోట్ల రూపాయలను వెచ్చించి గెలిచిన అభ్యర్థులు వాటిని సంపాదించడానికే తన పదవిని వినియోగిస్తారే తప్ప.. ప్రజల సంక్షేమం అసలు పట్టదని కూడా చెబుతూనే.. ఎన్నికలలో తమ వెంట తిరిగిన కార్యకర్తల బోజన, వాహనాల ఇందనపు ఖర్చులు మినహా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జనసేన పార్టీ ఒక నూతన ఒరవడిని తీసుకువచ్చిందన్న విషయం చెప్పక తప్పదు.

ఈ విషయాలను పక్కనబెడితే పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం చేయడానికి బండ్ల గణేశ్ సిద్ధమవుతున్నాడట. ఆల్రెడీ పవన్ తో సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. పారితోషికంగా 40 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా సమాచారం. ఇక దర్శకుడిగా బోయపాటిని సెట్ చేసే ప్రయత్నం కూడా చేశాడనీ, ఆయనకి 10 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేశాడని అంటున్నారు. మిగతా ఆర్టిస్టుల పారితోషికాలు.. ఇతర ఖర్చులన్నీ కలుపుకుని మరో 50 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది వేచిచూడాలి మరి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bandla Ganesh  Power Star  Pawan Kalyan  Mythri Movie Makers  Boyapati Srinu  Janasena  tollywood  

Other Articles