Sardaar Gabbar Singh | Audio Release Date | Pawan Kalyan | Teaser

Sardaar gabbarsingh audio release details

Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Audio Release Details: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

భారీ బడ్జెట్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల?

Posted: 02/16/2016 10:25 AM IST
Sardaar gabbarsingh audio release details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ఆడియో విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్-దేవిశ్రీప్రసాద్ ల కాంబినేషన్లో ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఈ హ్యట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో మరో సంచలనం కానుందని అభిమానులు ధీమాతో వున్నారు. అయితే ఈ చిత్ర ఆడియోను మార్చి 12న గ్రాండ్ గా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.

ఈ ఆడియో వేడుక కోసం కోటి పాతిక లక్షలు బడ్జెట్ కేటాయించినట్లుగా తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడటం, పైగా ఓవర్సీస్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీగా పోటీ ఏర్పడటంతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దీంతో ఆడియో వేడుకకు ఆ మాత్రం గ్రాండ్ గా వుండాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలిసింది. ఈ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, రాంచరణ్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, నిహారికలు పాల్గొననున్నట్లుగా తెలిసింది.

పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Audio Release Date  posters  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more