nagarjuna venkatesh multi starrer movie to go floors soon | tollywood gossips | telugu movies

Nagarjuna venkatesh multi starrer movie gossips

nagarjuna news, venkatesh news, venkatesh multi starrer movies, nagarjuna multi starrer movie, tollywood gossips, telugu movie updates, telugu controversies

nagarjuna venkatesh multi starrer movie gossips : the multistarrer movie of nagarjuna and venkatesh will go on floors soon.

కలిసి స్టెప్పులేయనున్న బావబామ్మర్దులు

Posted: 10/26/2015 04:16 PM IST
Nagarjuna venkatesh multi starrer movie gossips

టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. పైగా.. ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం వల్ల వారిరువురికీ సంబంధించిన అభిమానులు థియేటర్లకు తరలిరావడంతో కలెక్షన్ల వర్షం కురుస్తుందనే భావనతో దర్శకనిర్మాతలు ఆ తరహా చిత్రాలు తీయడానికే మొగ్గుచూపుతున్నారు. ఇక.. సోలోగా విజయాలు సాధించలేకపోతున్న హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సుముఖతం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో వెంకటేష్ వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేసుకుంటూ దూసుకపోతుండగా.. తాజాగా నాగార్జున కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం తమిళ హీరో కార్తీతో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న నాగ్... తన బావ వెంకటేష్ తో కలిసి మరో మల్టీస్టారర్ సినిమాలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

వ్యక్తిగత జీవితంలో బావబామ్మర్దులుగా వున్న వెంకటేష్, నాగార్జున ఇద్దరూ కలిసి ఇంతవరకు ఒకేసారి వెండితెరపై కనిపించలేదు. అప్పుడప్పుడు కెమెరాలకు క్లిక్ మనిపించారే తప్ప.. వెండితెరను షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా తీర్చబోతున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి నాగ్, వెంకీ ద్దరూ ఒకేసారి కథానాయకులుగా తమ కెరీర్ ప్రారంభించారు. ఇద్దరూ కూడా తమదైన శైలిలో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పిస్తూ వరుస హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ.. ఈమధ్య కొత్త హీరోల హవా బాగానే కొనసాగుతుండటంతో వీరిద్దరి క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని త్వరగా తెలుసుకున్న వెంకటేష్.. తన కెరీర్ గ్రాఫ్ క్రింద పడిపోకముందే మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వరుసగా దూసుకుపోతున్నారు. ఇప్పుడు నాగార్జున సినమాలు సైతం వరుసగా ఫ్లాపులు అవుతుండటంతో.. మల్టీస్టారర్ చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తీతో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ తరుణంలోనే వెంకీ, నాగ్ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపందే సమయం వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ మల్టీస్టారర్ సినిమాకి సంబంధించిన కథను కూడా విన్నట్లు తెలుస్తోంది. స్టోరీలైన్ బాగా వుండటంతో అందులో నటించేందుకు ఇద్దరూ సుముఖంగా వున్నారని చెప్పుకుంటున్నారు. స్టోరీ ఫైనల్ అయిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ వుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వీరి కాంబినేషన్లో నిజంగానే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కితే.. అభిమానులకు పండగే పండగ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna news  venkatesh multi starrer movie  tollywood gossips  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more