Anushka | Baahubali 2 | weight loss

Anushka on weight loss for baahubali 2

Anushka Shetty on weight loss for Baahubali 2, Anushka Baahubali 2 movie news, Anushka Baahubali 2 movie updates, Anushka Baahubali 2 stills, Anushka Baahubali 2, Anushka, Baahubali 2

Anushka on weight loss for Baahubali 2: South indian star heroine Anushka Shetty upcoming film Baahubali 2. Anushka ready to weight loss for this film. SS Rajamouli direction. Prabhas, Rana, Ramyakrishna, Tamannah acts in lead roles.

బాహుబలి2 కోసం అనుష్కకు ఆపరేషన్?

Posted: 10/28/2015 11:48 AM IST
Anushka on weight loss for baahubali 2

సౌత్ ఇండియన్ టాప్ స్టార్ హీరోయిన్ అనుష్కపై తాజాగా ఓ కొత్త వార్త హల్చల్ చేస్తోంది. అనుష్క నటించిన ‘బాహుబలి’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయం సాధించింది. అలాగే ‘రుద్రమదేవి’ చిత్రానికి కూడా మంచి టాక్ లభించింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తాజా చిత్రం ‘జీరో సైజ్’.

ఇందులో అనుష్క సుమారు 100 కిలోల భారీకాయంతో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ‘సైజ్ జీరో’ తర్వాత అనుష్క మళ్లీ ‘బాహుబలి2’ చిత్ర షూటింగ్ లో పాల్గొననుంది. అయితే ‘సైజ్ జీరో’ కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క మళ్లీ తన బరువును తగ్గించేందుకు తెగ ప్రయత్నిస్తోంది. అయితే నార్మల్ ఫిట్ నెస్ తో బరువు తగ్గుదల కుదరకపోవడంతో శస్త్ర చికిత్స చేయించుకునే ఆలోచనలో అనుష్క వుందని తెలిసింది.

కానీ ఈ శస్త్ర చికిత్స తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలియడంతో అనుష్క మళ్లీ ఆలోచనలో పడ్డట్లుగా తెలిసింది. ప్రస్తుతం అనుష్క మాత్రం ఫిట్ నెస్ ట్రైనర్ల సహాయంతో తన బరువును నార్మల్ గా తగ్గించుకునే ప్రయత్నంలో బిజీగా వుంది. త్వరలోనే ‘బాహుబలి2’ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మరి అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Baahubali 2  weight loss  Movie News  Prabhas  Rajamouli  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more