బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ‘ఖాన్ త్రయం’ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. షారుక్, సల్మాన్ ల మధ్య గతకొద్ది రోజుల ముందు వరకు విభేదాలు వచ్చి విడిపోయినప్పటికీ మళ్లీ వీరిద్దరూ ఇటీవలే కలిసిపోయారు. అయితే ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం సల్మాన్ తో విభేదాలు తెచ్చుకున్నట్లుగా తెలిసింది.
ప్రస్తుతం సల్మాన్, అమీర్ ల మధ్య విభేదాలు వచ్చాయని బాలీవుడ్ జనాలు గుసగుసలు పెడుతున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం... ఇటీవలే అమీర్ బాంద్రాలోని తన స్వగృహంలో ఓ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి సల్మాన్ ను కూడా ఆహ్వానించాడు. అయితే ఆ సంధర్భంలో సల్మాన్ నటించిన ‘భజరంగీ భైజాన్’ సినిమా గురించి అమీర్ ప్రశంసలు కురిపించాడు. గతంలో కంటే చాలా మెచ్యూర్డ్ గా సినిమా తీశారని, ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలంటూ అమీర్ ప్రశంసించాడు.
అంతటితో ఆగకుండా సల్మాన్ పై అమీర్ ఓ సెటైర్ వేసాడట. అదేంటంటే.. కథ, కథనాల గురించి సల్మాన్ అస్సలు పట్టించుకోడంటూ వ్యాఖ్యానించాడట. దీంతో అక్కడే వున్న సల్మాన్.. అమీర్ పై కామెంట్ చేసాడట. అమీర్ అంతా మాత్రం తాను కష్టపడి పనిచేయకపోయినప్పటికీ, ఇతరుల శ్రమను, గొప్పతనాన్ని మాత్రం గుర్తిస్తానంటూ సల్మాన్ సెటైర్ వేసాడట. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా ఈ ఇద్దరు హీరోలు ఏ విధంగా కూడా స్పందించలేదు. మరి నిజంగా వీరి మధ్య విభేదాలు వచ్చాయో లేక వీరి స్నేహం సజావుగానే వుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more