ఎప్పుడు హర్రర్, దెయ్యాలు, మాఫియా, రౌడీయిజం చిత్రాలను తీస్తూ భయపెట్టే వర్మ... ప్రస్తుతం రొమాంటిక్ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ చిత్రం ‘365 days’. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను U సర్టిఫికెట్ ను దక్కించుకొని, అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నందు, అనైక హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల కాస్త ఆలస్యం అయ్యేలా వుంది.
ఈ సినిమాను మే 15న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ కొద్ది రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ తాజాగా ఈ చిత్ర విడుదలను వాయిదా వేసినట్లుగా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం మే 22న ‘365 days’ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. నిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ విలక్షణ – రామ్ గోపాల్ వర్మ కలిసి ఈ సినిమాని నిర్మించారు.
నిజ జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి జీవితాలు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎలా వుంటున్నాయో వర్మ ‘365 డేస్’ సినిమా ద్వారా చూపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో హీరోహీరోయిన్ల హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు వున్నప్పటికీ కూడా ఈ సినిమాకు U సర్టిఫికెట్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more