Maa president elections rajendra prasad jayasudha mega dasari cold war

maa president elections, dasari narayana rao, rajendra prasad, jayasudha, megabrother nagababu, murali mohan, maa elections news, maa elections controversy, maa elections updates, rajendra prasad updates, jayasudha updates, nagababu updates

maa president elections rajendra prasad jayasudha mega dasari cold war : In maa president elections.. there is a cold war going inside this between mega camp and dasari narayana rao.

‘మా’ ఎన్నికల్లో మెగా-దాసరి ఇన్ సైడ్ కోల్డ్-వార్

Posted: 03/20/2015 11:30 AM IST
Maa president elections rajendra prasad jayasudha mega dasari cold war

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) అధ్యక్ష పదవికి ఈనెల 29వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నానంటూ తెలపడంతో.. ఆ పదవిని చేపట్టేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రకటించిన సంగతి విదితమే! దీంతో ఈ అధ్యక్ష పదవి ఎన్నికలు ఏకగ్రీవంగా జరగవచ్చునని అందరూ భావించారు. కానీ.. ఇంతలోనే తాను కూడా ఈ పోటీబరిలో పాల్గొంటున్నానంటూ సహజనటి జయసుధ ముందుకొచ్చారు. దీంతో ఈ పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. వీరిమధ్య పోటీ విషయం కాస్త పక్కనపెడితే.. వీరిద్దరికీ మద్దతు ప్రకటించిన వారిమధ్యే గట్టిపోటీ జరుగుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

విషయం ఏమిటంటే.. ఈ ఎన్నికల్లో భాగంగా రాజేంద్రప్రసాద్ కు మెగాబ్రదర్ నాగబాబు మద్దతు పలికారు. ఆయన తరఫున మరికొంతమంది కలిసి తాము ప్రసాద్ గారికి ఈ ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించారు. మరోవైపు.. సహజనటి జయసుధకు మురళీమోహన్ మద్దతు పలికారు. రాజేంద్రప్రసాద్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, యువ కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను జయసుధకు మద్దతు ఇస్తున్నానని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఇక ఈమె ఎంపిక వెనుక దాసరి నారాయణరావు హస్తం కూడా వుందని తెలుస్తోంది. ప్రసాద్ కు మద్దతు పలుకుతున్న మెగాక్యాంప్ కు ధీటుగా సమాధానం ఇవ్వడం కోసమే దాసరి రంగంలోకి దిగి జయసుధకు మద్దతు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. వారిమధ్య గతకొన్నాళ్ల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే! తెరముందు బాగానే పలకరించుకున్నా.. తెరవెనుక మాత్రం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఎప్పటినుంచో జరుగుతూనే వుంది. ఇప్పుడు కూడా అలాగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో వీరిమధ్య తెరవెనుక యుద్ధం జరుగుతోందని అనుకుంటున్నారు.

అంతేకాదు.. ఈ ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నారు. రాజకీయంగా చూస్తే.. నిజానికి జయసుధ కాంగ్రెస్‌ పార్టీలో మెంబర్ గా కొనసాగుతున్నారు. ఒక దశలో వైకాపాకు కూడా దగ్గరయ్యారయ్యారు కానీ.. అది వేరే విషయం! అయితే టీడీపీకి చెందిన మురళీమోహన్ ఆమెను బరిలోకి దింపడం ‘మా’లోనూ రాజకీయాలు దిగాయనడానికి నిదర్శనంగా కనిపిస్తోందని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి జరగబోయే ‘మా’ అధ్యక్ష పోటీలో ఈ రెండు వర్గాల మధ్య గట్టిపోటీ జరగనుంది. మరి.. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో..? వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more