ఇండస్ట్రీలో హీరోయిన్ గా కాస్త ఇమేజ్ వస్తే చాలు.. కొందరు తారలు పొగరుగా వ్యవహరిస్తుంటారు. తమ రెమ్యునరేషన్ స్థాయిని పెంచేయడం, డేట్స్ విషయంలో దర్శకనిర్మాతలను ముప్పతిప్పలు పెట్టడం, చిన్నహీరోలతో సినిమాలంటే వాటికి మెలికలు పెట్టడం.. ఇలా ఈ విధంగా తమ ఇగోని ప్రదర్శిస్తారు. ప్రస్తుతం శ్రీదివ్య వ్యవహారశైలి గమనిస్తుంటే.. ఆమె కూడా అదే కోవలోకి చేరిపోయినట్లు కనిపిస్తోంది.
‘బస్టాప్’ అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన శ్రీదివ్య.. తెలుగులో ఆఫర్లు రాకపోవడంతో పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమెకు అదృష్టం బాగానే కలిసిరావడంతో వరుసగా సినిమాలు వచ్చిపడ్డాయి. పైగా అవన్నీ విజయం సాధించడంతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచింది. దాంతో ఈమెకు మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ విధంగా తనకు డిమాండ్ పెరిగిపోవడంతో ఈ అమ్మడు తన పారితోషికాన్ని 50 లక్షలకు పెంచేసింది. అంతేకాదు.. ఒక చిన్న సినిమా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ.. ఇప్పుడు చిన్నహీరోలతో జతకట్టేందుకు మెలికలు పెడుతోందట!
చిన్నహీరోల సినిమాలకు పెద్ద దర్శకులు వుంటే నటిస్తాననీ, ఒకవేళ పెద్ద హీరోలైతే వారి మూవీలకు కొత్త దర్శకులైనా ఫర్వాలేదనీ శ్రీదివ్య కండీషన్లు పెడుతోందని కోలీవుడ్ లో ప్రచారం కొనసాగుతోంది. మరి.. ఈ వార్తలపై దివ్య ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే! ఇదిలావుండగా.. ‘బెంగుళూర్ డేస్’ తెలుగు, తమిళ రీమేక్ లో శ్రీదివ్య కథానాయికగా నటిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more