డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రాంచరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. ప్రముఖ తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించనున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు కోనవెంకట్, గోపి మోహన్ లు కలిసి కథ, మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ పరిశీలనలో వుంది.
ఈ సినిమా మార్చి 5న లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. అలాగే మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో ‘తీన్ మార్’ హీరోయిన్ కృతి కర్భందా చరణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించనుందంట్లు గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కృతి గురించి మరో వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం...ఈ సినిమాలో కృతి హీరోయిన్ గా నటించడం లేదని తెలిసింది.
రాంచరణ్ కు అక్క పాత్రలో కృతి నటించనుందని తెలిసింది. కుటుంబ కథా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్ తల్లి పాత్రలో నటి జీవితరాజశేఖర్ నటించనుందని సమాచారం. అయితే ఈ విషయాలపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరిన్ని వివరాలు మార్చి 5న తెలియనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more