Shruti hassan remuneration guest role anushka shetty size zero movie

shruti hassan latest news, shruti hassan hot news, shruti hassan hot photos, shruti hassan remuneration, shruti hassan photo shoot, shruti hassan anushka movie, anushka size zero movie, anushka shetty hot photos, anushka gallery, prakash kovelamudi news, raghavendra rao news, tollywood gossips

shruti hassan remuneration guest role anushka shetty size zero movie : According to the tollywood sources the rumours going on about shruti hassan that she is demanding more remuneration for only guest role in anushka's size zero movie.

ఓలమ్మో.. శృతి ముందుకంటే బాగానే పెంచేసిందే!

Posted: 02/24/2015 11:38 AM IST
Shruti hassan remuneration guest role anushka shetty size zero movie

ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో వరుస ఫ్లాపులు ఎదుర్కొని ఐరెన్ లెగ్ గా పేరుగాంచిన శృతిహాసన్... ఆ తర్వాత పవన్ సినిమాతో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. పవన్ సరసన ఈమె నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అప్పటినుంచి ఈమె దశ పూర్తిగా మారిపోయింది. వరుసగా ఈమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి.

దీంతో ఇండస్ట్రీలో ఈమె డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్నే గ్రహించిన శృతి.. ఇదే అదునుగా భావించి తన రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ వస్తోంది. హీరోయిన్ పాత్రలో నటించేందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయొచ్చుగానీ.. గెస్ట్ రోల్ కే భారీ మొత్తంలో డిమాండ్ చేయడం చూసి సదరు మూవీ యూనిట్ తోపాటు టాలీవుడ్ మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. అనుష్క ప్రధాన పాత్రలో ‘సైజ్ జీరో’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ సోమవారం (23-02-2015) ఈ మూవీ షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. పీవీపీ సినిమాస్ పతాకంపై పొట్లూరి వి.ప్రసాద్ భారీ బడ్జెట్ వెచ్చించిమరీ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలోనే శృతి హాసన్ గెస్ట్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఇందుకుగాను ఈమె భారీ మొత్తం తీసుకుంటోందట! ఆ గెస్ట్ రోల్ పాత్ర ఎంతో కీలకమైంది కాబట్టి.. అందుకు శృతియే సూటవుతుందన్న ఉద్దేశంతో మూవీ యూనిట్ ఆమెని తీసుకోవడం జరిగింది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమ్మడు.. భారీ మొత్తం ఇస్తేగానీ నటించనంటూ మొండికేస్తోందట! దీంతో చేసేదిలేక ఆమె అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాత అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.

నిజానికి శృతిహాసన్ ఓ సినిమాకు 80 లక్షల నుంచి ఒక కోటిరూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ.. ఈమె డిమాండ్ పెరిగిపోవడంతో కేవలం ఐటమ్ సాంగులకే ఆమధ్య 80 లక్షలు తీసుకుంది. ఇప్పుడు ఈమెకు బాగా క్రేజ్ వుండటంతో.. మరింతగా రెమ్యునరేషన్ స్థాయిని పెంచేసింది. ఇప్పుడు ఈమె నటిస్తున్న ఆ గెస్ట్ రోల్ కోసం దాదాపు 90 లక్షలమేర డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti hassan  anushka shetty  size zero telugu movie  raghavendra rao  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more