ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ ప్రస్తుతం ఉన్న సమాజం మీద, ప్రభుత్వాల మీద చాలా కోపంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉత్తేజ్ కు ఇప్పటికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నటుడిగా, మాటల రచయితగా ఉత్తేజ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటి ఉత్తేజ్ తన పని తాను చేసుకోకుండా తాను బ్రతుకుతున్న ఈ సమాజం చెడిపోతుందని చాలా బాధపడుతున్నాడు. ఈ సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మార్పు రావాలని ఉత్తేజ్ చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇటీవలే ఉత్తేజ్ ఓ అద్భుతమైన కవితను కూడా రాసాడు. ఆ కవిత విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఉత్తేజ్ మరోసారి సమాజంపై తనకున్న బాధను వ్యక్తం చేసారు.
ఇటీవలే ఉత్తేజ్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘వావ్ 2’ కార్యక్రమంలో పార్టిసిపెంట్ గా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వాళ్లు మాములుగా మాట్లాడుకుంటూ... ఉత్తేజ్ ను ఏదైనా కవిత చెప్పమని యాంకర్ సాయికుమార్ అడగడంతో... అపుడు ఉత్తేజ్... ‘ధర్మం, సత్యం, న్యాయం వీటన్నిటి.. మన రామాయణ, మహాభారత, భాగవతాలు... ఇవి చెప్పే నాధుడేడి... వినే మనిషేడి. ఇవి చెప్పే తాతయ్యేమో ఓల్డేజు హోముల్లో... వినే మనవడేమో కాన్వెంటు బంధిఖానాలో’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు విన్న తర్వాత అనుమానం వచ్చిన సాయికుమార్.... ‘నీకు సమాజం మీద కోపం ఉందా?’ అని అడగడంతో వెంటనే ఉత్తేజ్ కూడా స్పందించాడు.
‘‘సమాజం మీద చాలా కోపం ఉంది. ఎందుకంటే మనం ఇప్పటికీ ‘ప్రతి విషయాన్ని పట్టించుకుంటే... ప్రతివాడొక నక్సలైటవుతాడు’. ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా కూడా ఏదైనా ప్రతి విషయాన్ని గనుక పట్టించుకుంటే... ప్రతివాడొక నక్సలైటవుతాడు. అస్సలు డిసిప్లేన్ లేని కంట్రీ అంటే కేవలం ఇండియా. అమెరికా వాళ్లని మనమేదో టీవిల్లో వాళ్ల పద్దతి చూసి ఏంటీ ఈ కల్చర్ ఛీ ఛీ అని అంటామేమో కానీ... వాళ్లంత డిసిప్లేన్ గా ఉంటే మన ఇండియా ఎప్పుడో బాగుపడేది. అస్సలు మన దగ్గర ఒక ప్రొఫెషనలిసం కానీ, ఒక డిసిప్లేన్ కానీ ఏమి లేవు. దీనికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వం అలాంటి వాతావరణాన్ని ఏర్పరిస్తే మనం బాగుపడతం. మన ప్రభుత్వం అలాంటి వాతావరణాన్ని తయారు చేయట్లేదు కాబట్టే మనం ఇలా ఉన్నాం’’ అంటూ ఉత్తేజ్ తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేసాడు.
మరి ఉత్తేజ్ చెప్పినట్లుగా నక్సలైట్ గా మారకపోయిన కూడా కనీసం సమాజం గురించి పట్టించుకుంటే బాగుంటుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మనకు తోచినంత వరకు అరికట్టితే మన సమాజం ఎంతో బాగుంటుంది. మరి ఇప్పటికీ మన దేశం ఇలా ఇంకా బాగుపడకపోవడానికి కారణం సమాజంలో ఉన్న ప్రజలది తప్పా లేక సమాజాన్ని సరైన విధంగా బాగుపరచడానికి ప్రయత్నించని ప్రభుత్వానిదా? మీరే ఆలోచించండి.
Sandy
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more