Ramcharan denies pregnancy of upasana

Ramcharan denies pregnancy of Upasana, Telugu Cine hero Ramacharan, Amitabh bachchan, Aishwarya Rai, Abhishekh bachchan

Ramcharan denies pregnancy of Upasana

సెలబ్రిటీలకు వ్యక్తిగతమనేది ఉండదా?

Posted: 05/07/2014 10:30 AM IST
Ramcharan denies pregnancy of upasana

పూర్వకాలం రాజ్యాలేలే రాజుల అంతపురంలో పనిచేసేవాళ్ళు కోటలోని విషయాలను చేరవేస్తే బయట ప్రజలు చెవులు రిక్కించుకుని వినేవారట.  ఇప్పటికీ రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలు బయటకు వస్తుంటాయి.  వాళ్ళ ప్రేమాయణాలైతే మరీ.  అయితే సినిమా రంగంలోని సెలబ్రిటీల విషయంలో ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ భార్య గర్భవతా కాదా అన్నదాని మీద కూడా చర్చలు జరుగుతుంటాయి.  

రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భందాల్చిందా అన్న వదంతులకు తెరదించుతూ ఆ దంపతులిద్దరూ బయట కనిపించారు.  దానితో వదంతులకు ప్రస్తుతానికి ఫల్ స్టాపైతే పడింది.  

కానీ కాదు అని చెప్పవలసిన అవసరాన్ని కల్పించినవారు వదంతులను లేవదీసినవారే.  ఏమైనా వార్త ఉండి, దాన్ని చెప్పదలచుకుంటే వాళ్ళే చెప్తారు కదా అని వూరుకోరు, స్పష్టంగా వాళ్ళని అడగరు కాని ఊహించుకుని ప్రచారాలు సాగిస్తుంటారు.  ఎందుకంటే సెలబ్రిటీల విషయంలో వార్తలను వినేవాళ్ళు దొరుకుతారు కాబట్టి.  చెప్పే వాళ్ళకి ఒరిగేదేమీ ఉండదు.  కేవలం తను చెప్పేదాన్ని నలుగురు శ్రద్ధగా వింటే అంతే చాలు వాళ్ళకి.  చెప్పగానే వార్త పాతపడిపోతుంది.  కానీ చెప్తున్నప్పుడు అవునా అని వినేవారిని చూస్తే వాళ్ళకి కలిగే కిక్కే వేరు.

సెలబ్రిటీలకున్న ఓపికే వేరు కానీ, వ్యక్తిగతంగా ఎవరైనా ప్రశ్న వేస్తే చాలామందికి చికాకు వేస్తుంది.  బయట వస్తువులు అమ్మేవాళ్ళు అరుచుకుంటూ వెళ్తారు.  కావాలంటే కొంటాం లేదంటే మాట్లాడకుండా ఇంట్లో ఉండిపోతాం కానీ, తలుపు కొట్టి మరీ ఫలానా వస్తువు కొంటారా అని అడిగే సేల్స్ పర్సన్స్ ని చూస్తే మంటెక్కుతుంది- వద్దు అన్నది కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి!

అభిషేక్ ఐశ్వర్యలకు పుట్టిన బిడ్డ విషయంలో అమితాభ్ బచ్చన్ మొదట్లో వదంతులను చూసి కుటుంబసభ్యులంతా కడుపుబ్బ నవ్వుకుంటున్నాం అని ప్రకటించినా, ప్రసవం సమయంలో హాస్పిటల్ దరిదాపుల్లోకి ఎవరూ రావొద్దని, ఫొటోలు తీసుకోవద్దని, పెట్టే పేరు గురించి కానీ ఇతర విషయాలు కానీ ఎవరూ రాయవద్దని, ఏమైనా చెప్పదలచుకుంటే మేమే ప్రకటిస్తాం కానీ అప్రకటిత వార్తలను ప్రచురించినవారిమీద న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించటంతో అన్నీ ఆగిపోయాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more