Bimbisara Movie Review Rating Story Cast and Crew 'బింబిసార' మూవీ రివ్యూ

Teluguwishesh 'బింబిసార' 'బింబిసార' Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 98391 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  'బింబిసార'

 • బ్యానర్  :

  ఎన్టీఆర్ ఆర్ట్స్‌

 • దర్శకుడు  :

  వ‌శిష్ఠ్

 • నిర్మాత  :

  కె.హరికృష్ణ

 • సంగీతం  :

  చిరంత‌న్ భ‌ట్‌, ఎం.ఎం.కీర‌వాణి

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  ఛోటా కె.నాయుడు

 • ఎడిటర్  :

  తమ్మిరాజు

 • నటినటులు  :

  నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రెసా, సంయుక్త మేనన్, శ్రీనివాసరెడ్డి, వరిన హుస్సేన్, వివాన్ భ‌టేనా, ప్ర‌కాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అయ్యప్ప పి.శర్మ తదితరులు

Bimbisara Movie Review A Fantasy Film Saved By Kalyan Ram’s Performance

విడుదల తేది :

2022-08-05

Cinema Story

కథ

విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. తన ప్రతీ చిత్రానికి వారు ఎలా తీసుకుంటున్నారని పరిశీలన చేస్తూ.. జయాపజయాలను పట్టించుకోకుండా ఎంతో సహనం పాటిస్తూ మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నందమూరి నటవారసుడు.. నందమూరి కళ్యాణ్ రామ్. తన పేరును ఒక బ్రాండుగా మార్చుకునే ప్రయత్నంలో.. ఆయన తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బింబిసార. తన సోంత బ్యానర్లో కొత్త దర్శకులను నమ్మి భారీ ప్రయత్నాలు చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసార కూడా ఆ కోవలోనిదే. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడి మీద భరోసాతో అతను చేసిన ఈ ఫాంటసీ మూవీ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. దీంతో కళ్యాణ్ రామ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడా.? అన్న వివరాల్లోకి వెళ్దామా.

క్రీస్తు పూర్వం 500లో బింబిసారుడు (కళ్యాణ్ రామ్) అనే మహా క్రూరుడు.. అహంకారి అయిన రాజు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. తన కన్ను పడ్డ ప్రతి రాజ్యాన్ని ఆక్రమిస్తూ.. తనకు ఎదురొచ్చిన ప్రతి వ్యక్తిని మట్టుబెడుతూ సాగిపోతుంటాడు. చివరికి తన సొంత తమ్ముడైన దేవదత్తుడిని కూడా అధికారం కోసం చంపేయాలని చూస్తాడు. అతడి నుంచి తప్పించుకుని బయట పడ్డ దేవదత్తుడు.. తనకు అనుకోకుండా దొరికిన మాయా అద్దం సాయంతో తన సోదరుడి అడ్డు తొలగించుకుని తండ్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాన్ని ప్రజల సంక్షేమం కోరి పరిపాలించడం మొదలుపెడతాడు. మాయా అద్దం కారణంగా ఆ కాలం నుంచి ప్రయాణం సాగించి వర్తమానంలోకి వచ్చి పడతాడు బింబిసారుడు. ఇక్కడ అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. తిరిగి అతను తన రాజ్యానికి వెళ్లగలిగాడా.. బింబిసారుడి సాయంతో రహస్య ప్రాంతంలో ఉన్న వైద్య గ్రంథం ధన్వంతరిని దక్కించుకోవడానికి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం ఫలించిందా.. ఈ ప్రశ్నలకు సమాధానం తెర మీదే తెలుసుకోవాలి.

cinima-reviews
'బింబిసార'

విశ్లేషణ

టైమ్ ట్రావెల్ చిత్రాలు తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఈ త‌ర‌హా సినిమాల్లో హీరో ప్ర‌స్తుతం నుంచి చ‌రిత్ర‌లోకి లేదంటే భ‌విష్య‌త్తులోకి వెళ్ల‌డం చూశాం. ఇందులో మాత్రం చ‌రిత్ర‌లో ఉన్న ఓ రాజు వ‌ర్త‌మానంలోకి రావ‌డం చూస్తాం. అలా ఎందుకు రావాల్సి వ‌చ్చింది.. ఈ క్ర‌మంలో అత‌నికెదురైన స‌వాళ్లేంటి.. గ‌తానికి స‌మాంత‌రంగా న‌డిచే వ‌ర్త‌మానలో అత‌ను చేసిన సాహ‌సాలేంటి? అన్న‌వి క‌థ‌లో ఆస‌క్తిరేకెత్తించే అంశాలు. వీట‌న్నింటినీ చ‌క్క‌గా ముడిపెడుతూ.. ప్రేక్ష‌కులు మెచ్చేలా ద‌ర్శ‌కుడు క‌థ రాసుకున్న విధానం మెప్పిస్తుంది.

అయితే ఈ త‌ర‌హా పీరియాడిక్ ట‌చ్ ఉన్న చిత్రాల‌కు గ్రాఫిక్స్‌, ఆర్ట్ వ‌ర్క్ ఎంత అద్భుతంగా కుదిరితే.. సినిమా అంత అద్భుతంగా ప్రేక్ష‌కుల్ని రంజింపజేస్తుంది. బడ్జెట్‌ పరిమితుల నేపథ్యంలో ఆ రెండూ కుద‌ర‌లేద‌నిపిస్తుంది. ‘మ‌గ‌ధీర’, ‘బాహుబ‌లి’ చిత్రాలు చూసిన క‌ళ్ల‌కు ‘బింబిసార‌’లోని గ్రాఫిక్స్ హంగులు అంత ఇంపుగా అనిపించ‌క‌పోవ‌చ్చు. సాధార‌ణంగా టైమ్ ట్రావెల్ క‌థ‌ల్లో హీరో స్టోరీని వ‌ర్త‌మానం నుంచి మొద‌లు పెట్టి.. గ‌తంలోకి తీసుకెళ్లి తిరిగి వ‌ర్త‌మానంలోకి తీసుకొస్తుంటారు.

అయితే ఈ చిత్రంలో క‌థ బింబిసారుడి కాలం నుంచే మొద‌ల‌వుతుంది. సినిమా ఆరంభ స‌న్నివేశాలు ఆస‌క్తిరేకెత్తించేలా ఉన్నా.. బింబి పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు చాలా చ‌ప్ప‌గా ఉంటుంది. అత‌నిలోని క్రూర‌త్వాన్ని.. రాజ్య కాంక్ష‌ను తెలియ‌జేస్తూ సాగే స‌న్నివేశాల్లో బ‌ల‌మైన‌ సంఘ‌ర్ష‌ణ క‌నిపించ‌దు. ఆ వెంట‌నే వ‌చ్చే ప్ర‌త్యేక గీతం క‌థలో ఇరికించిన‌ట్లుగా ఉంటుంది. బింబిసారుడు సైనికుల‌పై ధ‌న్వంత‌రి ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టం.. వాళ్ల‌కు బుద్ధి చెప్పేందుకు బింబి స్వ‌యంగా రంగంలోకి దిగ‌డం.. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఓ ఎమోష‌న‌ల్ ఎపిసోడ్‌తో క‌థలో కాస్త వేగం పెరుగుతుంది.

వ‌ర్త‌మానంలోకి వ‌చ్చాక బింబికి ఎదుర‌య్యే ప‌రిస్థితులు అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయిస్తాయి. మ‌ధ్య‌లో కొన్ని స‌న్నివేశాలు మ‌రీ అతిగా అనిపించినా.. విరామానికి ముందొచ్చే ఫైట్ ఎపిసోడ్ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో గ‌తాన్ని.. వ‌ర్త‌మానాన్ని స‌మాంత‌రంగా న‌డిపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్లిన విధానం మెప్పిస్తుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ప్ర‌తి ఎపిసోడ్ ప్రేక్ష‌కుల్ని రంజింప‌జేస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఆక‌ట్టుకుంటాయి.  సినిమాని ముగించిన తీరు సంతృప్తిక‌రంగా ఉంటుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

బింబిసారుడి పాత్రలోకి నందమూరి కళ్యాణ్ రామ్ పరకాయ ప్రవేశం చేశాడంటే అతిశయోక్తి కాదు. తాను సోంతం చేసుకున్న ఈ పాత్రలో ఎంతో శ్రద్ధతో కళ్యాణ్ రామ్ జీవించాడనే చెప్పాలి. ఆహార్యంపరంగా ఉన్న పరిమితులతో రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ కు అలవాటు పడడానికి ప్రేక్షకులకు కొంత సమయం పట్టినా.. తన దగ్దధ స్వరం.. అలాగే హావభావాలతో బింబిసారలో నెగెటివ్ షేడ్స్ ను అతను తెరమీద బాగా చూపించి.. ప్రేక్షకుల ఆమోదం పోందగలిగాడు. తన శరీరాకృతిని మార్చుకుని అతను పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా కళ్యాణ్ రామ్ కు ఈ చిత్రం కెరీర్ బెస్ట్ అనడంలో సందేహం లేదు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో.

హీరోయిన్లలో కేథరిన్ థ్రెసా కనిపించిన తక్కువ సన్నివేశాల్లోనే ఆకట్టుకుంది. సంయుక్త మేనన్ మాత్రం తేలిపోయింది. ఆమె పాత్ర నామమాత్రం. తన లుక్స్ కూడా ఏమంత బాగా లేవు. విలన్ పాత్రలో కనిపించిన వరిన హుస్సేన్ ఓకే అనిపించాడు. ఆ స్థానంలో కాస్త పేరున్న నటుడిని పెడితే విలన్ పాత్ర ఎలివేట్ అయ్యేదేమో అనిపిస్తుంది. అయ్యప్ప పి.శర్మ తనకు అలవాటైన మాంత్రికుడి తరహా పాత్రలో మెప్పించాడు. ప్రకాష్ రాజ్ పాత్ర.. నటన మామూలుగా అనిపిస్తాయి. జుబేదా క్యారెక్టర్లో శ్రీనివాసరెడ్డి మెప్పించాడు.. నవ్వించాడు. బ్రహ్మాజీ.. వైవా హర్ష.. చమ్మక్ చంద్ర.. అంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

టైమ్ ట్రావెల్ చిత్రాలకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసేది నేపథ్య సంగీతం అని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందించడానికి కీరవాణి కంటే బెటర్ ఛాయిస్ మరొకరు కనిపించరు. ఆయన తనదైన శైలిలో నేపథ్య సంగీతం అందించి సినిమాను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే ఆర్ఆర్ లో ఎక్కువగా బాహుబలి అనుకరణ కనిపిస్తుంది. అయినా సరే.. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో నేపథ్య సంగీతం ముఖ్య పాత్ర పోషించింది. కీరవాణి.. చిరంతన్ భట్ కలిసి అందించిన పాటలు బాగానే సాగాయి. కానీ సినిమాలో చాలా వరకు పాటలు స్పీడ్ బ్రేకర్లలా అనిపిస్తాయి.

ఛోటా కే నాయుడు చాన్నాళ్ల తర్వాత తన కెమెరా పనితనాన్ని చాటాడు. చిత్ర పరిమితుల్లో తెరపై భారీతనాన్ని ఆవిష్కరించాడు. ప్రొడక్షన్ డిజైన్.. విజువల్ ఎఫెక్ట్స్ టీం కష్టం తెరపై కనిపిస్తుంది. వాసుదేవ్ మునెప్ప సంభాషణలు బాగున్నాయి. ఇక కథా రచయిత.. దర్శకుడు వశిష్ఠ తొలి చిత్రంతో తన ప్రతిభ చాటాడు. అతడి బలం స్క్రిప్టులోనే ఉంది. పైపై మెరుగులతో సరిపెట్టకుండా అతను ఒక కాన్సెప్ట్ తో కథను చెప్పే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్లే కూడా కొంచెం భిన్నంగానే చేసుకున్నాడు. సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉంటే.. ద్వితీయార్ధాన్ని ఇంకొంచెం మెరుగ్గా తీర్చిదిద్దుకుని ఉంటే బింబిసార మరో స్థాయికి వెళ్లేది. అయినా సరే.. తొలి చిత్రంలో వశిష్ఠ చూపించిన ప్రతిభ అభినందనీయం.

తీర్పు: విభిన్నమైన ట్రైమ్ ట్రావెల్ కథతో వచ్చి ప్రేక్షకులను మెప్పించి.. బాక్సాఫీసు వద్ద సవ్వడి చేస్తున్న.. 'బింబిసార'.!

చివరగా.. ప్రేక్షకులకు నచ్చిన 'బింబిసార'!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh