Ghani Movie Review Rating Story Cast and Crew 'గని‌' మూవీ రివ్యూ

Teluguwishesh 'గని‌' 'గని‌' Get information about Ghani Telugu Movie Review, Varun Tej Ghani Movie Review, Ghani Movie Review and Rating, Ghani Review, Ghani Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 97551 2.50 stars, based on 1 reviews
  • చిత్రం  :

    'గని‌'

  • బ్యానర్  :

    రినాయసెన్స్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    కిరణ్‌ కొర్రపాటి

  • నిర్మాత  :

    అల్లు బాబీ, సిద్దు ముద్ద

  • సంగీతం  :

    ఎస్ తమన్

  • సినిమా రేటింగ్  :

    2.502.50  2.50

  • ఛాయాగ్రహణం  :

    జార్జ్ సి. విలియమ్స్

  • ఎడిటర్  :

    మార్తాండ్‌ కె.వెంకటేష్‌

  • నటినటులు  :

    వరుణ్‌ తేజ్‌, సాయి మంజ్రేకర్‌, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్‌ చంద్ర, నరేశ్‌ తదితరులు

Varun Tej ‘ghani’ Movie Review A Muddle Of A Narrative

విడుదల తేది :

2022-04-08

Cinema Story

మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ తనదైన స్టైల్లో నటిస్తూ.. టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చుకున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్‌ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్‌ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఈ సారి వ‌రుణ్‌ తేజ్ బాక్సింగ్‌పై ప్రేమ‌ని ప్రద‌ర్శిస్తూ గ‌ని క‌థ‌ని సిద్ధం చేయించారు. మూడేళ్ల కింద‌ట ఈ సినిమా క‌రోనా కారణంగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఆటంకాలు ఎదుర్కొంది. సినిమా సిద్ధమ‌య్యాక కూడా ప‌లుమార్లు విడుద‌ల తేదీలు వాయిదా ప‌డింది. మ‌రి గని పంచ్ ఎలా ఉంది.. తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్న వరుణ్ తేజ్ మెప్పించాడా.? అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు కథలోకి ఎంటర్ అవుదాం.

బాక్సింగ్ జోలికి వెళ్లన‌ని త‌ల్లి మాధురి(నదియా)కి మాటిచ్చి కూడా... బాక్సర్‌గా రాణించే ప్రయ‌త్నంలో ఉంటాడు గ‌ని (వ‌రుణ్‌తేజ్‌). గ‌నికి ఘ‌న‌మైన వార‌స‌త్వమే ఉంది. త‌ను ఎవ‌రో కాదు, ఒకప్పటి రాష్ట్ర ఛాంపియ‌న్ బాక్సరైన విక్రమాదిత్య (ఉపేంద్ర‌) త‌న‌యుడు. విక్రమాదిత్య జాతీయ ఛాంపియ‌న్‌గా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు సొంత మ‌నుషైన ఈశ్వర్ నాథ్( జగపతిబాబు) చేతుల్లోనే దారుణంగా మోస‌పోతాడు. దానికితోడు స్టెరాయిడ్స్ వినియోగించాడ‌నే మ‌చ్చ కూడా ప‌డుతుంది. అయితే త‌న తండ్రి విష‌యంలో ఏం జ‌రిగిందో తెలియ‌ని గని మొద‌ట ఓ అభిప్రాయంతో ఉంటాడు. త‌న‌దైన ల‌క్ష్యంతో త‌ల్లికిచ్చిన మాట‌ని కూడా ప‌క్కన‌పెట్టి బాక్సింగ్రిం గ్‌లోకి దిగిన గ‌నికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? త‌ను అనుకున్నది ఎలా సాధించాడు? అత‌ని త‌న తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏమిటి? నిజం తెలిశాక ఏం చేశాడు? ఈ క‌థ‌లో విజేంద్రసిన్హా (సునీల్‌శెట్టి) ఎవ‌రన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

cinima-reviews
'గని‌'

విశ్లేషణ

సాధారణంగా స్పోర్ట్స్‌ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్‌. కానీ ‘గని’ క్యారెక్టర్‌ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు.

ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్‌, తల్లి కొడుకుల సెంటిమెంట్‌ అంతగా వర్కౌట్‌ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్‌ కాలేడు. కమర్షియల్‌ సినిమా అన్నాక ఓ హీరోయిన్‌ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి.

ఎలాంటి సర్‌ప్రైజ్‌ లేకుండా ఫస్టాఫ్‌ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్‌ సీన్‌తో సెకండాఫ్‌ స్టార్ట్‌ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌(ఐబీఎల్‌) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్‌ గతంలో స్టోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి  తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్‌ ఉంటుందో, గ‌నిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్‌ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది.

నటీనటుల విషాయానికి వస్తే..

బాక్సర్‌ గనిగా వరుణ్‌ తేజ్‌ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సర్‌గా క‌నిపించేందుకు త‌న‌ని తాను తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది. క్రీడాకారుడిగా చ‌క్కటి భావోద్వేగాల్ని పండించాడు. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్‌లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేక‌ర్ పరిధి మేరకు చక్కగానే నటించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్‌ పాత్రకు సునీల్‌ శెట్టి న్యాయం చేశాడు. ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, జ‌గ‌ప‌తిబాబు పాత్రలు సినిమాకి కీల‌కం. ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి బాక్సర్ల పాత్రల‌కి స‌రైన ఎంపిక అనిపిస్తుంది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈశ్వర్‌ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. న‌వీన్​చంద్ర ఆక‌ట్టుకున్నాడు. హీరో తల్లిగా నదియాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.



టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్‌ ఎలా ఉంటుందో ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది.

తీర్పు: భావోద్వేగాలు బాగా పండించి.. గెలుపు కోసం అర్రలు చాచే క్రీడాకారుడి అవేదనను ప్రేక్షకుడిలో రక్తికట్టించని ’గని‘

చివరగా.. మరింత పవర్ పంచ్ పెంచాల్సింది ’గని‘..!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh