Priya Varrier's film Lover’s Day a youth entertainer ‘లవర్స్‌ డే’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘లవర్స్‌ డే’ ‘లవర్స్‌ డే’ Wink sensation Priya Prakash Varrier‘s debut film Lover’s Day, has opened on about 2,000 screens worldwide today. Apart from lead pair Priya Prakash Varrier, Roshan Abdul Rahoof, Lover’s day has other star Noorin Shereef. Product #: 89757 2 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘లవర్స్‌ డే’

 • బ్యానర్  :

  ఊసేపచ్చన్ మూవీ హౌజ్

 • దర్శకుడు  :

  ఒమర్ లులు

 • నిర్మాత  :

  గురురాజ్, వినోద్ రెడ్డి

 • సంగీతం  :

  షాన్ రహ్మాన్

 • సినిమా రేటింగ్  :

  22  2

 • ఛాయాగ్రహణం  :

  శ్రీను సిద్దార్థ్

 • ఎడిటర్  :

  అచ్చు విజయన్

 • నటినటులు  :

  రోషన్ అబ్దుల్ రవూఫ్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌, సియ్యాద్ షాజహాన్, డానియల్, మాథ్యూవ్, దిల్ రూపా అస్వద్ అల్ ఖమర్, వైశాఖ్ పావనన్ త‌దిత‌రులు

Lover’s Day Moive Review

విడుదల తేది :

2019-02-14

Cinema Story

ప్రియా వారియర్ (ప్రియా), రోషన్ (రోషన్), నూరిన్ షరీఫ్ (గాధ) డోన్ బాస్కో హయ్యెర్ సెకండరీ స్కూల్‌ స్టూడెంట్స్. తొలి చూపులోనే ప్రియా వారియర్‌పై మనసు పారేసుకున్న రోషన్‌.. కొంటె చూపులు, చిలిపి చేష్టలు, గాఢ చుంబనంతో ప్రియా ప్రేమను తొందరగానే పొందుకుంటాడు. గాధ ఈ ఇద్దరి ప్రేమకు సాయం చేస్తుంది. రోషన్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉంటుంది. అయితే రోషన్ స్నేహితుడు చేసిన ఆకతాయి పనివల్ల రోషన్ స్కూల్ నుండి సస్పెండ్ అవుతాడు.

రోషన్ సస్పెండ్ కావడంతో తన పరువు పోయినట్టు భావించిన ప్రియా అతనికి బ్రేకప్ చెప్తుంది. ఈ తరుణంలో ప్రియా తిరిగి రోషన్ దగ్గరకు రావాలంటే.. గాధ రోషన్‌ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాలనే మిత్రుడి సలహాతో రోషన్, గాధలు ప్రేమించుకున్నట్టు నటిస్తారు. అయితే ఆ నటనలో రోషన్, గాధలు నిజంగానే ప్రేమించుకుంటారు కాని ఒకరికి ఒకరు చెప్పుకోరు. వీరిద్దరి ప్రేమను తెలుసుకున్న ప్రియా వీరికి దూరం అవుతుంది.

ఇక గాధకు తన ప్రేమను తెలిపేందుకు ఆమెకు ఇష్టమైన ఓ ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ ఊహించని పరిణామంతో వీరి ప్రేమకథ విషాదాంతం అవుతుంది. ఇంతకీ రోషన్ తన ప్రేమను గాధకు చెప్పాడా? ప్రియా ఏం చేసింది? రోషన్‌, ప్రియా, గాథ‌ల ముక్కోణ‌పు ప్రేమ‌క‌థ‌లో గెలిచింది ఎవరు? ఈ ప్రేమ కథ విషాదం కావడానికి కారణం ఏంటి అన్నది తెరపై చూడాల్సిందే.

cinima-reviews
‘లవర్స్‌ డే’

విశ్లేషణ

ఇలాంటి కథలు మనం ఎప్పుడో  చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి అందాన్ని, ఆకర్షణతో పాటు బోలెడంత ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ అనే చెప్పాలి.

ఒక్క కన్నుగీటుతో యావత్ కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ అమ్మడు ఒక్కరోజులో సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా అమె పేరునే నడుస్తుందని అనడానికి కారణం కూడా కేవలం ఈ కన్నుగీటు మాత్రమే. దీనికి తోడు అమె తన చేతులనే ఆయుధంగా మార్చుకుని ముద్దు తుపాకీతో యువత హృదయాలను కూడా పేల్చివేయడం కూడా యువతను సినిమాకు రప్పించేలా చేస్తుంది.

ఇది చాలదన్నట్లు టీజర్ లో లిప్ లాక్ సీన్లు.. వాలెంటైన్స్ డే రోజున లవర్స్ డే సినిమాకు రండీ అంటూ వైరటీగా అహ్వానించిన ప్రియా వారియర్ ప్రేమికులను థియేటర్ల వైపు రప్పించడంలో మాత్రం సక్సెస్ అయ్యిందనే చెప్పారు. ఇక సినిమా వెళ్లి కూర్చున్న తరువాత కానీ ఇలాంటి సినిమాలు మనం ఎన్నో ఇంతకుముందుగానే చూశామన్న ఫీలింగ్ కలగక మానదు. మరో విధంగా చెప్పాలంటే వెండితెరపై షార్ట్ ఫిల్మం చూసినట్లుగా వుంది. కేవలం ఒక్క వర్గంవారినే ఈ చిత్రం అకట్టుకుంటుంది.

ప్రేమ ఆకర్షణ కాదని, నిజమైన ప్రేమను తెలుసుకుని హీరో అమెకు తన ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకోవడం.. దాంతోనే సినిమాకు దర్శకుడు ముగింపు పలకడం ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాలన్న భావన కోసమేనా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నంకాక తప్పవు. అంతా సరదాగా వెళ్తూన్న సమయంలో ముగింపు విషాదంగా వుండాలనే దర్శకుడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడా.? అన్న ప్రశ్నలకు వినబడుతున్నాయి.

అయితే నిజమైన ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుందని పాత నానుడికి భిన్నంగా త్యాగం కన్న విషాదాన్నే కోరుకుంటుందన్న విషయాన్ని దర్శకుడు స్పష్టం చేయాలనుకున్నాడా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

వింక్ గర్ల్ గా సినిమా ప్రమోషన్ నుంచే యావత్ దేశ కుర్రకారు మనస్సులలో తిష్టవేసిన ప్రియా ప్రకాష్ వారియర్ నటన బాగుంది. హీరో స్నేహితురాలిగా, ప్రియురాలిగా నటించిన నూరిన్ షరీఫ్ కూడా తన పాత్రకు జీవం పోసింది. ఇద్దరూ బాగా నటించారు. గాధ, ప్రియా పాత్రల్లో ఒదిగిపోయారు. క్లైమాక్స్ సీన్లో నూరిన్ షరీఫ్ ఎమోషన్స్ బాగా పండించింది. అయితే హీరో రోషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తన ముఖంలో దూర్ఫిణి వేసి వెతికినా అభినయం పాలు తక్కువే. ఒక్కటే ఎక్స్‌ప్రెషన్‌‌తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దీంతో వారి సీన్లు పెద్దగా పండలేదు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

స్కూల్ ప్రేమలు.. టీనేజ్ ఆలోచనలు.. ఆ వయసులో చేసే చిలిపి పనులు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న కంటెంట్ ను తీసుకుని దర్శకుడు ఒమర్ లులు కథను మలిచారు. ఈ చిత్రకథకు అనుగుణంగా సరిగ్గా సరితూగే నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ప్రియా వారియర్, రోషన్, నూరిన్ షరీఫ్‌లు ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయినా.. వారిని సరైన రీతిలో ఉపయోగించుకుకోలేదు దర్శకుడు.

చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకూ అసలు కథ ఎప్పుడు మొదలౌతుందనే ఎదురుచూపులే మిగిలాయి ప్రేక్షకుడికి. స్కూల్లో ప్రేమ, అట్రాక్షన్, రొమాన్స్ వీటిపై పెట్టిన శ్రద్ధ.. కథపై పెట్టలేదు. పోనీ ‘లవర్స్ డే’ టైటిల్ పేరునైనా నిలబెట్టేందుకు బలమైన సీన్లు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. స్కూల్ స్టూడెంట్ ఎప్పుడూ వేసుకునే కుళ్లు జోకులతోనే క్లైమాక్స్ వరకూ తీసుకువచ్చారు. స్కూల్ డేస్ గుర్తుకు తెచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా లేకపోవడం కోసమెరుపు.

షాన్ రహ్మాన్ అందించిన పాటలు సినిమాకి హెల్ప్ అయ్యాయి. శ్రీను సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు విజయన్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రధాన మైనస్.. గంటన్నర సినిమాని రెండున్నర గంటపాటు సాగదీశారు. డబ్బింగ్ అతుకుల బొంతలా ఉంది తప్పితే.. ఒక్క పాత్రకు కూడా సరిగ్గా కుదరలేదు. గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు..

స్కూల్లో టీనేజ్ విద్యార్థుల మధ్య ఏర్పడే కల్మషం లేని స్నేహం.. తన తోటి విద్యార్థినులపై కలిగే ఆకర్షణలను కలగలిపిన రొమాంటిక్ ఎంటర్ టైనర్.

చివరగా... టీనేజ్, యువతకు నచ్చే వినోదాత్మక చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh