Bharat Ane Nenu movie review ముఖ్యమంత్రిగా ప్రేక్షకులను మప్పించిన మహేష్

Teluguwishesh భరత్‌ అనే నేను భరత్‌ అనే నేను Bharat Anu Nenu is a Political drama in which Bharat (Mahesh) is a typical youngster who's yet to figure out what to do in life after graduation when circumstances force him to become the Chief Minister of Andhra Pradesh. New to the place and with no political knowledge, Bharat learns the ropes quickly and governs efficiently. Product #: 87537 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    భరత్‌ అనే నేను

  • బ్యానర్  :

    డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

  • దర్శకుడు  :

    కొర‌టాల శివ‌

  • నిర్మాత  :

    దాన‌య్య డి.వి.వి

  • సంగీతం  :

    దేవిశ్రీ ప్ర‌సాద్‌

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    ర‌వి.కె.చంద్ర‌న్‌, తిరునావుక్క‌ర‌సు

  • ఎడిటర్  :

    ఏ.శ్రీకర్ ప్రసాద్

  • నటినటులు  :

    మ‌హేశ్‌, కైరా అద్వాని, ప్ర‌కాశ్‌రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేశ్‌, సూర్య‌, పోసాని, జీవా, ర‌విశంక‌ర్‌, శ‌త్రు త‌దిత‌రులు

Bharat Ane Nenu Movie Review Mahesh Babu, Koratala Siva Deliver An Intense Political Drama

విడుదల తేది :

2018-04-20

Cinema Story

భరత్ రామ్‌(మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాఘవరాజు (శరత్‌ కుమార్‌) తనయుడు. లండన్‌ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుతుంటాడు. తన తండ్రి హఠాన్మరణంతో లండన్‌ నుంచి ఇంటికి వస్తాడు. ముఖ్య‌మంత్రి మ‌ర‌ణాంత‌రం ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కాల‌నే దానిపై సంశ‌యం ఏర్ప‌డుతుంది. పార్టీలో వర్గాలుగా విడిపోయి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మొద‌లవుతాయి. అప్పుడు నానాజీ అలియాస్ వ‌ర‌ద‌రాజులు(ప్రకాశ్ రాజ్‌) భ‌ర‌త్ ని ముఖ్య‌మంత్రిని చేస్తాడు. పార్టీ వాళ్లు అంతా కలిసి భరత్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. భరత్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలేంటి? తనకి ఎదురైన రాజకీయ కుట్రలను ఎలా ఎదుర్కొన్నాడు? వసుమతి (కైరా అడ్వాణీ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు భరత్‌ తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేదే కథ!

cinima-reviews
భరత్‌ అనే నేను

విశ్లేషణ

భరత్ అను నేను చిత్రం పూర్తిగా పొలిటికల్‌ డ్రామా. దానికి మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్టు కమర్షియల్‌ సన్నివేశాలు రాసుకున్నాడు దర్శకుడు. ఎవ‌రి ఆలోచ‌న‌ల‌నూ స్వీక‌రించ‌కుండా, ఉన్న‌ప‌ళాన సీఎం అయిన వ్య‌క్తి స‌మాజాన్ని బాగు చేసిన తీరు ఈ చిత్రంలో చూపించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌లు లేకుండా ఉంటే బావుణ్ణు, పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ‌మే మంచి విద్య‌ను ఇస్తే బావుణ్ణు, చ‌క్క‌టి వైద్యం అందితే బావుణ్ణు, ప్ర‌తి చిన్న‌దానికీ ఎవ‌రినో ఎదురుచూడ‌కుండా మ‌నంత‌ట మ‌న‌మే అన్నీ స‌మ‌కూర్చుకునేలా ఉంటే బావుణ్ణు అనేది స‌గ‌టు వ్య‌క్తుల్లో ఉండే అభిప్రాయ‌మే. ఆ విష‌యాన్నే ఈ చిత్రంలోనూ చూపించారు కొర‌టాల శివ‌.

భరత్‌ ముఖ్యమంత్రి అయ్యాక కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. అటు క్లాస్ గానూ ఇటు మాస్ గాను అన్ని వర్గాల వారికి ప్రాథాన్యతనిస్తూ సినిమాను రూపోందించారు దర్శకుడు శివ. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. వసుమతితో ప్రేమ కథ కావాల్సినంత వినోదాన్ని పంచింది. భరత్‌ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అలా అక్కడక్కడా వినోదాన్ని తనదైన శైలిలో మేళవించాడు దర్శకుడు. ‘భరత్‌ అనే నేను’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తూ వాడుకోవడం బాగుంది. విశ్రాంతి దగ్గరా పెద్ద మలుపులు ఏవీ లేవు.

నాయ‌కులు లేని సమాజాన్ని రూపొందించ‌డ‌మే ఉత్త‌మ నాయ‌కుడి ల‌క్ష‌ణం అనే అంశాన్ని, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాల‌నే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ ఇది. ద్వితీయార్ధం పూర్తిగా మాస్‌ ఆడియన్స్ ను నచ్చేలా తీర్చిదిద్దాడు. ‘రాచకోత’ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. అక్కడి నుంచి కథ వేగమే మారిపోయింది. పాటలను, పోరాట దృశ్యాల్ని, మాస్‌ ఎలిమెంట్స్ ని రాజకీయాల్ని, చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ ద్వితీయార్ధం సాగిపోతుంది. ప్రెస్ మీట్‌ ఎపిసోడ్ మొత్తం క్లాప్స్ కొట్టిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న భావాలను ఈ సినిమా తాలుకూ ఆత్మని మహేష్ మాటల్లో చెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ సన్నివేశంలో సంభాషణలు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను అద్దం పడతాయి. మీడియాను సైతం కార్నర్ చేస్తూ రాసుకొన్న డైలాగ్లు ఆలోచింపజేస్తాయి.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌-కొరటాల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఆ సినిమా తర్వాత మహేష్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా రాలేదు. ‘భరత్‌ అనే నేను’ ఆ అంచనాలను అందుకుందా? మహేష్ కెరీర్‌లో మరో ‘శ్రీమంతుడు’ అయిందా? ముఖ్యమంత్రిగా మహేష్‌ ఏ మేరకు అలరించారు? అభిమానులకు ఇచ్చిన హామీని ‘భరత్‌..’ నెరవేర్చాడా? కొన్ని కార‌ణాల వ‌ల్ల భ‌ర‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. ఆ కార‌ణాలేంటి? అస‌లు భ‌ర‌త్ తండ్రి మ‌ర‌ణం వెనుకున్న ర‌హ‌స్య‌మేంటి? అనే విష‌యాలు తెలుస‌కోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల విషయానికోస్తే..

మహేష్‌ అత్యుత్తమ నటన జాబితాలో భరత్ అను నేను సినిమా కూడా చేరిపోయింది. ఆయన స్టైలింగ్, లుక్స్ అన్నీ అభిమానులకు బాగా నచ్చుతాయి. సంభాషణలు పలికే విధానంలో మహేష్ కొత్తగా అనిపిస్తాడు. అక్కడక్కడా ఆయన తండ్రి ‘సూపర్‌స్టార్‌’ కృష్ణని గుర్తుకు తెస్తాడు. ఇక ఎమోషనల్ సన్నివేశాలు, ఎంటర్ టైన్ మెంట్‌ పంచేటప్పుడు మరోసారి తనదైన మార్కు వేసి చెలరేగిపోయాడు. హీరోయిన్ కైరా అడ్వాణీకి కూడా తన తొలి తెలుగు చిత్రంలో కథానాయకుడు మహేష్ పక్కన చాలా చక్కగా ఒదిగిపోయింది. బ్రహ్మాజీ ఉన్నది కాసేపైనా నవ్వులు పండించాడు. ప్రకాష్‌రాజ్‌ మరోసారి తనకు అలవాటైన పాత్రలో అల్లుకుపోయాడు. అటు పోసాని, ఇటు జీవా ఇలా ఎవరికి వారు తమదైన నటనను ప్రదర్శించి చిత్రాన్నికి హైలైట్ గా నిలిచారు. కథకు అవసరమైన మేరకు అనుభవంతులైన నటీనటులందరూ తమ స్తాయికి తగట్టుగా నటించారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా బాగుంద అని చెప్పడం కన్నా అత్యున్నత స్థాయిలో వుంది అని చెప్పడం బెటర్. చిత్రంలోని మూడు యాక్షన్ ఎపిసోడ్లను తీర్చిదిద్దిన విధానం బాగుంది. మరీ హింస, రక్తపాతం జోలికి వెళ్లకుండా క్లాస్‌ ప్రేక్షకులకు కూడా నచ్చేలా తెరకెక్కించాడు. రవి కె.చంద్రన్‌ కెమెరా పనితనం, శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌, సెల్వరాజన్‌ ఆర్ట్‌ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఖరీదైన చిత్రం ఇదే కావచ్చు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘భరత్‌ అనే నేను’, ‘వచ్చాడయ్యో సామి’ పాటలను సరైన టైమింగ్లో వాడుకున్నాడు దర్శకుడు. రెండూ హీరోయిజాన్ని అత్యున్నత స్థాయిలో చూపించే పాటలే. ‘వసుమతి’ పాటలో సాహిత్యం అర్థవంతంగా ఉంటుంది.

తీర్పు:

పోలిటికల్ డ్రామాకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడింది.. ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుండా.. అలాఅని హింస, రక్తపాతం కూడా లేకుండా చక్కగా రూపోందించాడు దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా మహేష్ అందరినీ అకట్టుకుంటాడు. తాను చేయదలుచుకున్న మంచిని చేస్తాడు. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితాలు వేరని సందేశాన్ని ఇచ్చే తీరుకూడా ప్రేక్షకులకు నచ్చతుంది. కామెడీ సీన్స్, పాటలు, సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇందులో ఆకట్టుకునే అంశాలు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుడు ఎంతలా అదరిస్తారో వేచి చూడాలి.

చివరగా.. మహేష్ కెరీర్ లో మరో శ్రీమంతుడిగా నిలిచే చిత్రం..

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh