Awe Movie Review and Rating | అ! రివ్యూ.. ఊహకు అందని చిత్రం

Teluguwishesh అ! అ! Awe Telugu Movie Review and Rating. Complete story and Synopsis. Nani and Prashanti Jointly Produced under Wall Poster Cinema Banner. Awe Directed by Prasanth Varma. Product #: 86893 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  అ!

 • బ్యానర్  :

  వాల్ పోస్టర్ సినిమా

 • దర్శకుడు  :

  ప్రశాంత్ వర్మ

 • నిర్మాత  :

  ప్రశాంతి తిపిర్నేని

 • సంగీతం  :

  మార్క్.ఎ.రాబిన్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  కార్తీక్ ఘట్టమనేని

 • నటినటులు  :

  కాజల్ అగర్వాల్ - నిత్యా మీనన్ - రెజీనా కసాండ్రా - అవసరాల శ్రీనివాస్ - ఈషా రెబ్బా - ప్రియదర్శి - మురళీ శర్మ తదితరులు

Awe Movie Review

విడుదల తేది :

2018-02-16

Cinema Story

వంటవాడిగా గొప్ప పేరు సంపాదించాలనుకున్న ఓ యువకుడు.. ఓ డ్రగ్ మాఫియాకు చెందిన యువతి, టైమ్ ట్రావెలర్ కావాలని మెషీన్ ను కనిపెట్టే ఓ సైంటిస్ట్, పెళ్లి చేసుకోవాలనుకునే ఓ జంట(ఇదే కాస్త విచిత్రం)... ఇలా కొన్ని క్యారెక్టర్లు తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఓ చోట చేరుతాయి. అక్కడి నుంచి కథ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది. ముగింపు ఎలా ఉంటుంది. అనుకున్న లక్ష్యాలను వారు సాధిస్తారా? అన్నదే కథ.

cinima-reviews
అ!

హీరో నాని కొన్నేళ్ల క్రితమే నిర్మాతగా గతంలో డీ ఫర్ దోపిడీ చిత్రంలో భాగస్వామిగా మారాడు. అయితే ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇప్పుడు హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్న తరుణంలో మరోసారి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అదే అ!. స్టార్ కాస్టింగ్.. అందుకు తగ్గట్లే ప్రమోషన్లు. మరి ఈ చిత్రం ఫలితం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ...
పలువురి జీవితాలకు చెందిన కథలను ఓ చోట చేర్చి చెప్పటం గతంలో చందమామ కథలు, మనమంతా ఇలాంటి చిత్రాల్లో చూశాం. కానీ, అ చిత్రం ఆ రకానికి చెందింది కాదు. కేవలం ఫస్టాఫ్ లో ఇంట్రడక్షన్ పార్ట్ వరకు సరిపెట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సెకండాఫ్ ను ఎవరూ ఊహించని రీతిలో మలిచాడు. లైంగిక వేధింపులు.. స్వలింగ సంపర్కుల పరిస్థితి.. అహం అన్న పాయింట్ల గురించి ప్రధానంగా చర్చిస్తూ... ఇతర అంశాలను కూడా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. ఇక ద్వితీయార్థంలో చిక్కుముడితో కూడిన కథతో ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురి చేశాడు. అందుకే ప్రమోషన్ లలో నాని స్టోరీని రివీల్ చెయ్యకండని రిక్వెస్ట్ చేశాడేమో!

ఎంటర్ టైన్ మెంట్ విషయంలో పూర్తి బాధ్యతలను నాని, రవితేజల పాత్రలు చేప, చెట్టులకు వదిలేసిన దర్శకుడు సినిమా డల్ అయినప్పుడల్లా ఆ పాత్రల డైలాగుల హుషారు పుట్టించాడు. అయితే లీడ్ క్యారెక్టర్ లు మాత్రం ఆ విషయంలో విఫలం అయ్యాయనే చెప్పొచ్చు. కొన్ని క్యారెక్టర్ల తాలూకు నేపథ్యాలు మాత్రం కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన అ!. కొత్త దనం కోరుకునే ప్రేక్షకులకు కూడా మరీ ఇంత కొత్తదనం ఆనుతుందా? అన్నదే అనుమానంగా ఉండగా... రెగ్యులర్ ఫార్మట్ చిత్రాలకు అలవాటు పడే వారికి మాత్రం కాస్త కష్టమే. క్లైమాక్స్ ను అర్థం చేసుకోలేకపోతే మాత్రం అసలిదేం సినిమా? అన్న అనుమానాలు కలిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

నటీనటుల విషయానికొస్తే... ఈ చిత్రంలో దాదాపు అందరూ తమ పాత్రల పరిధి మేర నటించినప్పటికీ నిత్యామీనన్, ప్రియదర్శి, రెజీనాకు ఎక్కువ మార్కులు పడతాయి. కాజల్ సినిమాకు మెయిన్ అయినప్పటికీ ఫర్వాలేదనిపించింది. మిగతా వారిలో దేవదర్శిని బాగా చేసింది. అయితే మురళీశర్మ మెజీషియన్ పాత్ర సీన్లు కాస్త విసుగుపుట్టిస్తాయి. అవసరాల ఎపిసోడ్ అర్థం అయ్యేలా ఉంటే బాగుండేది(బహుశా తక్కువ నిడివితో అది కుదరలేదేమో!). ఇక చెట్టు, చేప పాత్రలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... మార్క్ రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్ ఇలా.. అన్ని విభాగాలు సినిమాకు బలంగా నిలిచాయి. నిర్మాణ విలువల విషయంలో నాని ఎక్కడా రాజీపడలేదు.

తీర్పు...
తెలుగులో ఇంతకు ముందెప్పుడు రాని పాయింట్ ను కథగా మలిచి దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరు.. దానికి నిర్మాతలుగా నాని-ప్రశాంతి అందించిన తోడ్పాటులు అభినందనీయం. కొత్త ఆలోచనలు.. దానిని మరింత కొత్తగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు. కానీ, పరిణితితో కూడిన ఈ హర్డ్ కోర్ పాయింట్ ఎంత మంది జనాలకు రీచ్ అవుతుందన్నది కాస్త అనుమానమే.

చివగా... అ! ప్రేక్షకుల ఊహకు అస్సలు అందనిది