Raja The Great Movie Review and Rating | రాజా ది గ్రేట్ మూవీ రివ్యూ.. మాస్ రాజా ఈజ్ బ్యాక్

Teluguwishesh రాజా ది గ్రేట్ రాజా ది గ్రేట్ Raja The Great Movie Review and Rating. Raviteja's Raja The Great Movie Story and Synopsis.. Performances. Product #: 85130 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  రాజా ది గ్రేట్

 • బ్యానర్  :

  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

 • దర్శకుడు  :

  అనిల్ రావిపూడి

 • నిర్మాత  :

  దిల్ రాజు

 • సంగీతం  :

  సాయి కార్తీక్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  మోహన కృష్ణ

 • ఎడిటర్  :

  తమ్మి రాజు

 • నటినటులు  :

  రవితేజ, మోహ్రీన్ కౌర్, రాధిక, ప్రకాశ్ రాజ్, సంపత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

Raja The Great Review

విడుదల తేది :

2017-10-18

Cinema Story

పుట్టుకతోనే అంధుడైన రాజా(రవితేజ)ను కానిస్టేబుల్ అనంత లక్ష్మీ (రాధిక) గొప్పవాడిగా చూడాలని కలలు కంటుంది. అందుకే అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇచ్చి ది గ్రేట్ అని పిలుచుకుంటుంది. ఆపై ఫ్రెండ్(శ్రీనివాస్ రెడ్డి) సహకారంతో రాజా లైఫ్ సాఫీగా ముందుకు సాగుతుంటాడు. ఇదిలా ఉంటే సిన్సియర్ పోలీసాధికారి(ప్రకాశ్ రాజ్) ఓ రౌడీ గ్యాంగ్ తో వార్ మూలంగా.. ప్రాణాలు కోల్పోతాడు. ఈ క్రమంలో ఆయన  కూతురు అనంత లక్ష్మి అలియాస్ లక్కీ(మెహ్రీన్) కు అనుకోని సమస్య వచ్చి పడుతుంది. ఆమె ఆపదలో ఉండటంతో కాపాడేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంటుంది.

అయితే రాజా పోలీసాఫీసర్ అయితే చూడాలని కలలు కనే అనంత లక్ష్మీ(రాధిక) మాత్రం అందుకు తన కొడుకే కరెక్టని అధికారులను ఒప్పించి.. చివరకు అతన్ని పంపిస్తుంది. మరి అక్కడ రాజా ఆ అమ్మాయిని ఎలా కాపాడుతాడు. అందుకు ఎలాంటి సాహసాలు చేస్తాడు? ఇంతకీ లక్కీని చంపాలనుకున్న ఆ వ్యక్తి ఎవరు? కబడ్డీతో రాజా ఏం సాధించాలనుకుంటాడు? ఇదే కథ.

cinima-reviews
రాజా ది గ్రేట్

వరుస హిట్లతో ఊపు మీద ఉన్న రవితేజకు కిక్ 2 పెద్ద డిజాస్టర్ నే అందించింది. ఆపై వచ్చిన బెంగాల్ టైగర్ కూడా అనుకున్నంత స్థాయిలో వర్కవుట్ కాలేకపోయింది. దీంతో సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో మన ముందుకు వచ్చాడు. పటాస్, సుప్రీం వంటి ఫాస్ట్ ట్రాక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్టును డీల్ చేశాడు. అయితే హీరో సినిమా మొత్తం బ్లైండ్ అనే కాన్సెప్ట్ తో రావటంతో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా మారింది. ఇవాళే ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం.

విశ్లేషణ :

సినిమా కథంతా చాలా చాలా మాములుదే. కానీ, ఇక్కడ ప్రత్యేకత మాత్రం హీరో అంధుడు కావటం మాత్రమే. అయితేనేం తనకుండే ఇంటెలిజెన్స్ తో మ్యానేజ్ చేయటం. 90లో అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో ఇలాంటి సినిమానే ఒకటి వచ్చింది కూడా. అయితేనేం ఆ చిత్ర రిఫరెన్స్ తీసుకున్నాడో లేదో తెలీదుగానీ.. ఇక్కడ మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అంశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ ను చక్కగా మలిచాడు.

కొడుకు కోసం ఓ తల్లి పడే ఆరాటం.. ఫ్రెండ్ తో కలిసి హీరో సాగించే జర్నీ, హీరోయిన్ ట్రాక్ ఇవన్నీ చాలా చాలా మాములుగానే కనిపిస్తాయి. అయితే హీరో వైకల్యం ఒక్కటే రాజా ది గ్రేట్ కు అదనపు ఆకర్షణ. అయితేనేం మాములు హీరోలకు మించిన ఫైట్లు, డాన్సులు ఇక్కడ మాస్ రాజా ప్రదర్శించాడు. ఇంటర్వెల్ తో వచ్చే ట్విస్ట్ తో సెకండాఫ్ కోసం ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తాడు.

అయితే కీలకమైన సెకండాఫ్ లో దర్శకుడు ప్రత్యేకంగా చేసిందేం లేదు. మాములు కథే అయినా ఓవైపు రవితేజ ఎనర్జిటిక్ ఫెర్ ఫార్మెన్స్.. క్లైమాక్స్ లో రెండు ఫైట్లు... ముగింపు కూడా చాలా మాములుగా కానిచ్చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లో చాలా స్వేచ్ఛను దర్శకుడు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎటోచ్చి ఎంటర్ టైన్ మెంట్ అన్నదే సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అయితే పటాస్, సుప్రీంలో చూపించిన కామెడీ డోస్ ను రాజాతో అనిల్ ఇవ్వలేకపోయాడు. గున్నా గున్నా మామిడి సాంగ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ సాంగ్ లో సంపూర్ణేశ్ బాబు మరికొందరు కమెడియన్లు రావటం హుషారెత్తిస్తుంది.

కాస్టింగ్ ఫెర్ ఫార్మెన్స్.. ముందుగా ఈ సినిమాను ఒప్పుకున్నందుకు రవితేజకు హ్యాట్సాఫ్ చెప్పాలి. కంప్లీట్ బ్లైండ్ క్యారెక్టర్ చేయటం ద్వారా నిజంగానే గ్రేట్ అనిపించుకున్నాడు. అయితే సినిమాలో ఎక్కడా తన మార్క్ ను మాత్రం అస్సలు మిస్సవ్వలేదు. అదే ఎనర్జీ.. అదే కామెడీ టైమింగ్. ఇక హీరోయిన్ మెహ్రీన్ క్యూట్ ఫెర్ ఫార్మెన్స్ అందించింది. లుక్స్ తోపాటు ఇంపార్టెంట్ రోల్ కూడా ఆమెకు ఇచ్చాడు అనిల్. శ్రీనివాసరెడ్డి పాత్రను మరోసారి హైలెట్ చేశాడు దర్శకుడు. రాధిక కమ్ బ్యాక్ అనే అనుకోవాలి. సంపత్, ప్రకాశ్ రాజ్, మిగతా వాళ్లు ఓకే. రాశీ ఖన్నా గెస్ట్ రోల్ ఫర్వాలేదు.

టెక్నీకల్ అంశాల విషయానికొస్తే.. కార్తీక్ అందించిన పాటలు సో.. సో... గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ తో మాత్రం అలరించినా థమన్ ఛాయలు కనిపించాయి. విజువల్ గా ఫ్రెష్ నెస్ కనిపించింది. కామెడీ టైమింగ్ కు తగ్గట్లు మాటలు సరిపోయాయి. దిల్ రాజు నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.తీర్పు :

కథలో కొత్తదనం ఏం లేకపోయినా... కేవలం బ్లైండ్ రవితేజ ఫెర్ ఫార్మెన్స్ చిత్రాన్ని నిలబెట్టగలిగింది. సేఫ్ జోన్ కథతోనే అనిల్ ఆకట్టుకున్నాడు.


చివరగా.. రాజా ది గ్రేట్... మాస్ రాజా మెరుపుల కోసం