Raju Gari Gadhi 2 Movie Review and Rating | రాజుగారి గది 2 మూవీ రివ్యూ

Teluguwishesh రాజుగారి గది 2 రాజుగారి గది 2 Raju Gari Gadhi 2 Movie Review and Rating. Nagarjuna Starrer Horro Comedy Directed by Ohmkar. Story and Synopsis of Raju Gari Gadhi 2. Product #: 85043 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  రాజుగారి గది 2

 • బ్యానర్  :

  పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్

 • దర్శకుడు  :

  ఓంకార్

 • నిర్మాత  :

  పొట్లూరి వర ప్రసాద్

 • సంగీతం  :

  ఎస్ ఎస్ థమన్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  ఆర్ దివాకరన్

 • నటినటులు  :

  అక్కినేని నాగార్జున, సీరత్ కపూర్, సమంత, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు

Raju Gari Gadhi 2 Review

విడుదల తేది :

2017-10-13

Cinema Story

వైజాగ్ తీరంలో ఉండే రాజుగారి బంగ్లాను కొని ముగ్గురు యువకులు అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని భావిస్తారు. అక్కడే ఉన్న ఓ అమ్మాయికి లైన్ వేస్తూ.. జాలీగా గడుపుతుంటారు.  అంతా సవ్యంగా సాగిపోతున్న క్రమంలో హఠాత్తుగా ఓ దెయ్యం వారికి చుక్కలు చూపించటం ప్రారంభిస్తుంది. దీంతో ఓ చర్చి పాధర్ సాయంతో రుద్ర(నాగ్) అనే మెంటలిస్ట్ సాయం కోరతారు. అక్కడికొచ్చిన రుద్ర ఆ దెయ్యం పని ఎలా పడతాడు? దాని వెనుక ఉన్న కథేంటి? చివరకు ఏం జరిగింది? అన్నదే కథ.

cinima-reviews
రాజుగారి గది 2

జీనియస్ తో డైరెక్టర్ గా మారిన యాంకర్ ఓంకార్ తొలి చిత్రంతో సక్సెస్ కాలేకపోయినా రాజుగారి గది అంటూ ఇండస్ట్రీలో హిట్టే సాధించాడు. దీంతో కథపై నమ్మకంతో అక్కినేని నాగార్జున తర్వాతి చిత్రంలో నటించేందుకు సిద్ధం కావటంతో టాలీవుడ్ లో ఒక్కసారిగా అందరి కళ్లు ఆ ప్రాజెక్టు మీద పడ్డాయి. దీనికి తోడు సమంత కూడా నటించటం.. అది కూడా దెయ్యం రోల్ కావటంతో ఒక్కసారిగా ఇది స్టార్ ప్రాజెక్టుగా మారిపోయింది. మరి వీరంతా కలిసి చేసిన రాజుగారి గది-2 ప్రయత్నం ఏమేర సక్సెస్ అయ్యింది? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ :

ఒక పాడుబడ్డ బంగ్లా.. అందులో ఓ దెయ్యం... అది కొని సమస్యల్లో చిక్కుకునే కొందరు... ఆ దెయ్యానికో రివెంజ్ స్టోరీ. మధ్యమధ్యలో కామెడీ బిట్లు ఇది మాములుగా ఈ మధ్య వస్తున్న హర్రర్ జోనర్ చిత్రాల్లో కనిపించే కథ. రాజుగారి గది-2 కూడా ఆల్ మోస్ట్ అంతే. కాకపోతే ఇక్కడ కామెడీ ప్లేస్ లో ఎమోషనల్ వచ్చి చేరింది. ఓ బలైమన అంశాన్ని తీసుకుని హర్ట్ టచింగ్ కాన్సెప్ట్ కలరింగ్ అద్దటం.. పైగా లీడ్ రోల్స్ దానికి ప్రాణం పోయటం రాజుగారి పార్ట్ 2కి ఉన్న విశేషం. అయితే గత చిత్రంతో పోలిస్తే ఓంకార్ ఈసారి కామెడీ విషయంలో చాలా నిర్లక్ష్యం చూపాడేమో అనిపించకమానదు.

ముగ్గురు యువకుల మధ్య వచ్చే కామెడీ సీన్లు.. హీరోయిన్ సీరత్ అందాల ప్రదర్శన, ఆపై ఆమెతో డేటింగ్ కోసం కిషోర్-ప్రవీణ్ పోటీపడటం ఇలా సో సోగా ఫస్టాఫ్ సాగిపోతుంది. అయితే ఎప్పుడైతే దెయ్యం సీన్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి ఆసక్తి రెకెత్తగా రుద్ర క్యారెక్టర్ ఎంట్రీతో సీనిమా పీక్స్ లోకి వెళ్లిపోతుంది. సెకండాఫ్ లో బలమైన కథనే ఓంకార్ నడిపించాడు. ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఆ ఎపిసోడ్ ఖచ్ఛితంగా నచ్చి తీరుతుంది. అయితే ఇఫ్పటిదాకా ఇలాంటి జోనర్ చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు ఇది కొత్త పాయింటే అయినా కామెడీ లేని మైనస్ ఎంతమేర అలరిస్తుందన్నది డౌటే.


నటీనటుల ప్రదర్శన... ముగ్గురు యువకులుగా అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు అలరించారు. అశ్విన్ ను కొన్ని సీన్లలో హీరోగా ఎలివేట్ గా చేసేందుకు ఓంకార్ ట్రై చేసినట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ మార్క్ కామెడీ మిస్సయ్యింది. ప్రవీణ్ నుంచి కూడా తక్కువ నటనే కనిపించింది. ఇక హీరోయిన్ సీరత్ కపూర్ కేవలం గ్లామర్ డాల్ గా ఇంపాక్ట్ లేని పాత్రలో నటించింది.

సినిమా బాధ్యతలు మొత్తం నాగ్ భుజాస్కందాల మీదే నడిపాడు. మెంటలిస్ట్ పాత్రను అవపోసన పట్టేసి స్కీన్ మీద జీవించేశాడు. అయితే ఈ క్రమంలో ఒక్కో చోట ఆ నటన కాస్త చికాకు పుట్టిస్తుంది. కానీ, ఓవరాల్ గా నాగ్ తప్ప ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరేమో అన్నంతగా నటించాడు. ఇక నాగ్ తర్వాత సమంతదే ప్రధాన భూమిక. అమృత పాత్రలో చిలిపి సీరియస్ నెస్ కలగలిపిన పాత్రలో సామ్ అలరించింది. దెయ్యం పాత్రలో అయితే ఆమె నటన మెప్పిస్తుంది. క్లైమాక్స్ లో నాగ్-సామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కంటతడి పెట్టిస్తాయి. మిగతా పాత్రల్లో నరేష్, నందు, అభినయ పాత్రలు ఫర్వాలేదు.

 

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... ఎస్ ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఫర్ ఫెక్ట్ మ్యూజిక్ ను అందించాడు. హర్రర్ కంటే ఎమోషన్ సీన్లలోనే అతని పని తనం కనిపిస్తుంది. దివాకరన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. వీఎప్ఎక్స్ ఆకట్టుకుంటుంది. చిత్ర నిడివి తక్కువే అయినా ఎడిటింగ్ ఇంకాస్త చేయాల్సిందనిపిస్తుంది. అబ్బూరి రవి మాటలు క్లైమాక్స్ లో మెప్పిస్తాయి. పీవీపీ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు..

రాజుగారి గది తో కామెడీ హిట్ కొట్టిన ఓంకార్.. రాజుగారి గది 2 తో కూడా మంచి చిత్రాన్నే అందించాడు. అయితే కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్ లాంటి కమెడియన్లు ఉన్నప్పటికీ... కామెడీ లేకపోవటం సినిమాకు మైనస్ అయ్యింది. అయినప్పటికీ కీలకమైన సెకండాఫ్ లో హృదయాన్ని తాకే కథాంశంతో ఓంకార్ చిత్రాన్ని తెరకెక్కించాడు. క్లీన్ మార్క్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఈ చిత్ర విజయం ఓ వర్గం ప్రజల ఆదరణపైనే ఆధారపడి ఉంది.

చివరగా... రాజుగారి గది 2.. నో కామెడీ.. కేవలం ఎమోషన్స్