Spyder | SPYder Movie Review and Rating

Teluguwishesh స్పైడర్ స్పైడర్ Spyder Movie Review and Rating. Mahesh Babu Starrer under Murugadoss Direction Spy Thriller Story and cast Performance Complete Details. Product #: 84829 2.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  స్పైడర్

 • బ్యానర్  :

  ఎన్వీఆర్ సినిమాస్ బ్యానర్

 • దర్శకుడు  :

  ఏఆర్ మురగదాస్

 • నిర్మాత  :

  ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్

 • సంగీతం  :

  హ్యారిస్ జైరాజ్

 • సినిమా రేటింగ్  :

  2.252.25  2.25

 • ఛాయాగ్రహణం  :

  సంతోష్ శివన్

 • ఎడిటర్  :

  శ్రీకర్ ప్రసాద్

 • నటినటులు  :

  మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, భరత్, ప్రియదర్శి తదితరులు

Mahesh Babu Spyder Movie Review

విడుదల తేది :

2017-09-27

Cinema Story

మంచి క్వాలిఫికేషన్ ఉండి కూడా శివ (మహేష్ బాబు) ఇంటలిజెన్స్ బ్యూరోలో ఫోన్ డేటా సర్వేలెన్స్ ఆఫీసర్ గానే పని చేస్తుంటాడు. ఫోన్ డేటాను అనలైజ్ చేసి కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడం అతని పని. ఇదిలా ఉండగా శివకు ఓ రోజు వచ్చిన ఫోన్ కాల్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. పైశాచికంగా హత్యలు చేస్తున్న భైరవుడు (ఎస్.జె.సూర్య) అనే సైకో కిల్లర్ ను ట్రాప్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. ఈ క్రమంలో భైరవుడి తమ్ముడిని కూడా చంపేస్తాడు. దీంతో ఆ సైకో కిల్లర్ శివను లక్ష్యంగా చేసుకుని మరింత చెలరేగిపోతాడు. అలాంటి సమయంలో శివ ఏం చేస్తాడు? ఎలా అతన్ని అంతమొందిస్తాడు అన్నదే కథ.

cinima-reviews
స్పైడర్

సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ లో కూడా మహేష్ కు క్రేజ్ ఎక్కువగానే ఉంది. అలాంటి స్టార్ హీరోతో గజిని ద్వారా నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన దర్శకుడు మురుగదాస్ సినిమా అనగానే ఎలాంటి ఆసక్తి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అందుకే స్పైడర్ కు మొదటి నుంచి మాములు హైప్ రాలేదు. ఆ అంచనాలతోనే నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది స్పైడర్. మరి ఇప్పుడు ఆ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ:

కథలో భాగంగా హీరోయిజంను ఎలివేట్ చేయటం మురగదాస్ సినిమాలలో సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ, స్పైడర్ వరకు వచ్చేసరికి అది పూర్తిగా విలన్ కథగా మారిపోయింది. ఫోకస్ మొత్తం విలన్ చుట్టూనే తిరుగుతూ సమ్ థింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. మహేష్ బాబు మన దగ్గర పెద్ద స్టార్ హీరో.. అయినప్పటికీ తమిళ్ మాత్రం స్పైడర్ తో డెబ్యూ. బహుశా ఈ సూత్రాన్నే ఫాలో అయి కథను ఇలా చుట్టాడేమో అనిపించక మానదు. దానికి తగ్గట్లు స్క్రీన్ ప్లే కూడా అలాగే సాగుతూ కనిపిస్తుంది.

తొలి ప్రథమార్థంను ఏదో ఎంటైర్ టైనింగ్ గా గడిపేసిన ప్రేక్షకుడు విలన్ సూర్య ఎంట్రీతో ఒక్కసారిగా ఎగ్జయిట్ అవుతారు. కథలో రసవత్తరమైన మలుపు చోటు చేసుకున్న సమయంలో ఆపై హీరో, విలన్ మధ్య వార్ ఇంకెంత బాగుంటుందో అనుకునే వారికి అక్కడే దెబ్బడిపోయింది. దీనికి తోడు హీరోయిజంను పూర్తిగా సైడ్ ట్రాక్ చేసేసి ఏదో మాములు ఎలిమెంట్ కథలా డీల్ చేయటం కూడా ఒకింత నిరాశ కలిగిస్తుంది. ఇక మాములుగా మురగదాస్ సినిమాలు ఇప్పటిదాకా చూసుకుంటే హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కాస్త స్పెషల్ గానే కనిపిస్తుంది. కానీ, స్పైడర్ కి వచ్చేసరికి మొత్తం కథే ప్రధానంగా సాగటంతో ఆ అంశం సైడ్ కి వెళ్లిపోయింది.

టీవీ సీరియల్ మహిళల కాన్సెప్ట్ విషయంలో ఇది పక్కా తమిళ సినిమానేమో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అలాగని సినిమాకు ప్రధాన బలం కూడా కథే. ఒకానోక టైంలో చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే స్పైడర్.. చివరికొచ్చేసరికి ట్రాక్ తప్పి ఓ మామూలు సినిమాలా ముగుస్తుంది. ఓవరాల్ ఇది మహేష్ లాంటి స్టార్ హీరో కాకుండా వేరే వారితో తీయాల్సిన చిత్రమా? అన్న సందేహాలను రేకెత్తిస్తుంది.

 

 

నటీనటుల విషయానికొస్తే.. మహేష్ బాబు ఎప్పటిలాగే తన సిన్సియర్ నటనతో అలరించాడు. కథ విషయంలో చాలా వరకు కాంప్రమైజ్ అయి చేసుకుపోయాడేమో అనిపించకమానదు. స్టైలిష్ విషయంలో కొత్తగా కనిపించాడు. అయితే మహేష్ ఫ్యాన్స్ ను నిరాశపరిచే రేంజ్ లో పాత్రను రూపొందించటమే మైనస్ అయ్యింది. హీరోయిన్ రకుల్ జస్ట్ సాంగ్స్ అండ్ కొన్ని సీన్లకు పరిమితం. విలన్ ఎస్.జె.సూర్య మాత్రం మరిచిపోలేని రోల్ లో అదరగొట్టేశాడు. సైకో లక్షణాల్ని అద్భుతంగా పలికించటంతో మిగతా పాత్రలేవీ అంతగా ఆకర్షించవు. మిగతా పాత్రలు మాములుగానే అనిపిస్తాయి.


టెక్నికల్ టీం సంగీతం విషయంలో స్పైడర్ దారుణంగా నిరాశ పరుస్తుంది. టైటిల్ సాంగ్, సిసిలియా మినహా హారిస్ జైరాజ్ పాటలు ఏమంత క్యాచీగా లేవు. రాంగ్ ప్లేస్మెంట్ కూడా దెబ్బ తీసింది. కానీ, సినిమాకు ఒక ఫిల్లర్ గా నేపథ్య సంగీతం నిలిచింది. థీమ్ మ్యూజిక్ తోపాటు విలన్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్లో బీజీఎం ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకు మరో అట్రాక్షన్ సంతోష్ శివన్ ఛాయాగ్రహణం. సినిమాకు ఇదే పెద్ద ఆకర్షణ. రోలర్ కాస్టర్ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రత్యేకత చూడొచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో పీటర్ హెయిన్ చాలా కష్టపడ్డట్లు అనిపిస్తుంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ అంత ఎగ్జైట్ చేయవు. అవి ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు :

స్టార్ డైరక్టర్ మురుగదాస్ అంచనాలకు తగ్గ ఔట్ పుట్ ఇవ్వలేకపోయారు. ప్రథమార్ధం, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు మెప్పించినా.. తర్వాత ఆ కథను అంతే ఇంట్రెస్టింగ్ గా నడిపించలేకపోయాడు. మహేష్ పాత్ర విషయంలోనే కేర్ తీసుకోలేదేమో అనిపిస్తుంది. మాములుగా మెసేజ్ ఓరియంటల్ చిత్రాలను అందించిన దర్శకుడు ఈసారి మాత్రం ఓ సీరియల్ కిల్లర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. అయితే ఎంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాల్సిన ఈ చిత్రం జస్ట్ యావరేజ్ చిత్రంగా చివరకు మిగిలిపోయింది.

 

చివరగా... స్పైడర్ నేపథ్యం కొత్తదే కానీ... ఎక్కటం కష్టం!