Paisa Vasool Telugu Movie Review and Rating

Teluguwishesh పైసా వసూల్ పైసా వసూల్ Balakrishna's Paisa Vasool Movie Review and Rating. Paisa Vasool Movie Story, Cast Performance and Synopsis. Product #: 84461 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  పైసా వసూల్

 • బ్యానర్  :

  భవ్య క్రియేషన్స్

 • దర్శకుడు  :

  పూరీ జగన్నాథ్

 • నిర్మాత  :

  ఆనంద్ ప్రసాద్

 • సంగీతం  :

  అనూప్ రూబెన్స్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  ముకేష్

 • నటినటులు  :

  నందమూరి బాలకృష్ణ, శ్రియ, ముస్కాన్, కైరా దత్, విక్రమ్ జీత్ మాలిక్, ఆలీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ, శ్రీకాంత్ అయ్యంగార్, పవిత్ర లోకేష్ తదితరులు

Paisa Vasool Telugu Movie Review
Cinema Story

విదేశాల్లో ఉంటూనే ఇక్కడ ఇండియాను గడగడలాడిస్తుంటాడు మాఫియా డాన్ బాబ్ మార్లే(విక్రమ్ జిత్). అతన్ని పట్టుకోవటానికి వెళ్లిన అధికారులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాడు. దీంతో రా అధికారులు అతని కోసం తేడా సింగ్(బాలకృష్ణ)ను పంపిస్తారు. డబ్బు తీసుకుని ఎంతటి గొడవలకైనా కాలు దువ్వే తేడా సింగ్ పోర్చుగల్ కు వెళ్లి మరీ మిషన్ లో పాల్గొంటాడు. అసలు తేడా సింగ్ ఎవరు? మార్లేను పట్టుకోడానికి అతనే ఎందుకు వెళ్తాడు? వ్యక్తిగత పగ ఏమైనా ఉందా? అన్నదే కథ..

cinima-reviews
పైసా వసూల్

శాతకర్ణి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తర్వాత రైతు డ్రాప్ కావటంతో ఎలాంటి సినిమాను బాలకృష్ణ తీస్తాడా? అన్న డౌట్లు అందరి మదిలో కలిగాయి. ఊహించని ట్విస్ట్ ఇస్తూ పూరీ జగన్నాథ్ తో చిత్రాన్ని ప్రారంభించి అంతే జెట్ స్పీడ్ తో కంప్లీట్ కూడా చేసేశాడు. అదే పైసా వసూల్. స్టంపర్ అండ్ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ...

ఓ మాఫియా డాన్ విలన్ ఉంటాడు. అతను ఎక్కడో ఫారిన్లో ఉండి అరాచకాలకు పాల్పడుతుంటాడు. అతడి ఆట కట్టించేందుకు ఆఫీసర్ ముసుగులో ఉన్న హీరో బయలుదేరుతాడు. విలన్ బ్యాచ్ లో చేరి ఒక్కోక్కరిని ఏరేస్తుంటాడు. చివరకు మెయిన్ విలన్ ఆట కట్టిస్తాడు. ఇది పూరీ డైరక్షన్ లో పదేళ్ల క్రితం మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి లైన్. కానీ, ఫర్ ఏ ఛేంజ్ ఇక్కడ హీరో బాలయ్య అంతే.

సినిమా కథలో పస లేకపోయినా కేవలం బాలయ్య అభిమానులను పరిగణలోకి తీసుకునే పైసా వసూల్ ను తీశాడు పూరీ. సాధారణంగానే హీరోలను కొత్త మేకోవర్ తో చూపించే పూరీ ఇక్కడా అదే పని చేశాడు. బాడీ లాంగ్వేజ్ దగ్గరి నుంచి లుక్కు దాకా టోటల్ బాలయ్యను మార్చిపడేశాడు. దానికి తోడు నటసింహం నోటి నుంచి వచ్చే డైలాగులు పిచ్చ పిచ్చగా అలరిస్తాయి. అయితే హీరోయిజం మీదే సినిమాను నడిపించాలనుకున్న ప్రయత్నం ఎంతో సేపు సాగదు కదా. అందుకే సెకండాఫ్ లో కథలోకి ఎంటర్ అయిపోయాడు.

అక్కడ గానీ అర్థం అవదు పూరీ మిగతా సినిమాల్లోలాగే ఈ సినిమాలోనూ కథే లేదని.. ఫస్టాఫ్ మొత్తం బాలయ్య పంచ్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలతో ఊపు తెచ్చే పైసా వసూల్... సెకండాఫ్ లో మాత్రం చాలా సాదాసీదాగా సాగిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో నిరాశ పరుస్తుంది. పైగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్ గా లేకపోవటం మరో మైనస్ గా తయారయ్యింది. రా ఆఫీసర్ ఇంటర్వ్యూ ప్రశ్నల సన్నివేశం మరీ కామెడీగా ఉంటుంది. ఓవరాల్ గా తనదైన కథ, శైలితోనే సినిమాను తెరకెక్కించినప్పటికీ బాలయ్య అదనపు ఆకర్షణగా ఉండటం సినిమాకు హైలెట్ అయ్యింది.

నటీనటుల విషయానికొస్తే... ఇది కేవలం బాలయ్య సినిమా అనే సంకేతాలు ఇంటర్వెల్, క్లైమాక్స్ లలో పరోక్షంగా చెప్పాడు దర్శకుడు. అన్నట్లుగా ఇది బాలయ్య వన్ మెన్ షో. సినిమా కోసం ఎంత మేకోవర్ చేశాడంటే.. ఈ వయసులోనూ కుర్ర హీరో మాదిరి చిందులేయటం, ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆ యాటిట్యూడ్ షాకింగ్ కు గురిచేయక మానదు. శ్రియ పాత్రకు ప్రాధాన్యం ఉంది కానీ.. ఆమె పాత్ర కొత్తగా లేదు. ముస్కాన్ అందంగా కనిపించింది. అంతగా ప్రాధాన్యం లేని పాత్ర అది. ఐటెం సాంగ్ తోపాటు కొన్ని సీన్లలో కైరా దత్ ఓకే. విలన్ పాత్రలో విక్రమ్ జీత్ డాన్ రోల్ లో అలరించాడు. ముఖ్యంగా బాలయ్య ప్రవర్తన చూసి షాక్ అయ్యే సన్నివేశంలో ఆకట్టుకున్నాడు. ఆలీ, థర్టీ ఇయర్స్ పృథ్వీ సినిమాలో ఉన్న సంగతి థియేటర్ నుంచి బయటికొచ్చాక గుర్తే ఉండదు. మంత్రి పాత్రలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. అనూప్ పాటలు ఓకే అనిపిస్తాయి. సిచ్యుయేషనల్ గా సాంగ్స్ రావటంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మావా ఏక్ పెగ్ లా పాట, అందులో బాలయ్య ఎనర్జీ లెవల్ పీక్స్.. ఆకట్టుకుంటుంది. కెమెరామెన్ పూరీ టేకింగ్ కు తగ్గట్లుగానే పని చేశాడు. పూరీ డైలాగులు అనటం కంటే బాలయ్య నోటి నుంచి అవి వస్తుంటే విజిల్స్ వేయిస్తాయి. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.


ఫ్లస్ పాయింట్లు:
బాలయ్య నటన,
డైలాగులు,
యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్లు:
స్టోరీ,
వీక్ క్లైమాక్స్

తీర్పు: 

సినిమా చూస్తున్నంత సేపు పూరీ పాత సినిమాలు పోకిరి, ఇద్దరమ్మాయిలతో, ఏక్ నిరంజన్.. ఇలా కొన్ని చిత్రాలు కళ్ల ముందు తిరుగుతాయి. అయితే ఆ పాత్రలోకి బాలయ్య దూరిపోవటమే ఇక్కడ కొత్త అంశం. పాత సీసా నుంచి బాలయ్య అనే డ్రింక్ తో కొత్త ‘కిక్కు’ ఇచ్చేందుకు ట్రై చేశాడు అంతే.


చివరగా.. పైసా వసూల్.. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ ఆఫ్ NBK