వివేకం రివ్యూ.. లుక్కు రిచ్ బట్ స్టోరీ నిల్ | Vivekam Movie Review and Rating

Teluguwishesh వివేకం వివేకం Ajith Kumar Vivekam aka Vivegam Movie Review and Rating. Complete Story and Caste Performance of Spy Thriller. Product #: 84336 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  వివేకం

 • బ్యానర్  :

  సత్య జ్యోతి ఫిల్మ్స్

 • దర్శకుడు  :

  శివ

 • నిర్మాత  :

  సెంథిల్, అర్జున్ త్యాగరాజన్

 • సంగీతం  :

  అనిరుధ్ రవిచంద్రన్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  వెట్రి

 • ఎడిటర్  :

  రుబెన్

 • నటినటులు  :

  అజిత్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబేరాయ్, అక్షర హసన్

Vivekam Movie Review

విడుదల తేది :

2017-08-24

Cinema Story

అజయ్ కుమార్ (అజిత్) కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ కి హెడ్. అతని ఆధ్వర్యంలో ఆ ఇంటలిజెన్స్ టీం ఓ మారణ హోమం నుంచి దేశాన్ని బయటపడేస్తుంది. అదే సమయంలో నటాషా(అక్షర హసన్) అనే తెలివైన హ్యాకర్ ని పట్టుకోవడం కోసం అజయ్ ఎంతో కష్టపడతాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు, టీం సభ్యుడు ఆర్యన్(వివేక్ ఒబేరాయ్) ఈ కుట్రకు కారణమని తెలుస్తోంది.  అక్కడి నుంచి అజయ్ పై  ద్రోహిగా ముద్ర పడటంతోపాటు, గర్భవతి అయిన అతని భార్య(కాజల్) కూడా పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. 

ఓవైపు తనపై ఆరోపణలు నిజం కావని నిరూపించాలి,అణు ఆయుధానికి తీవ్ర వాదుల ప్రయత్నాన్ని ఆపాలి, ఇంకోవైపు భార్యను కాపాడుకోవాలి? ఇలాంటి టైంలో అజయ్ ఏం చేశాడు? మరోవైపు  ప్రాణాలు సైతం కాపాడిన అజయ్ ను స్నేహితుడు ఎందుకు మోసం చేయాల్సి వస్తుంది? చివరకు అజయ్ ఈ సవాళ్లను ఎలా అధిగమించాడు? అన్నదే వివేకం కథ.

cinima-reviews
వివేకం

విశ్లేషణ:

వివేకం ట్రైలర్ ను గనుక గమనిస్తే ఓ టాప్ క్లాస్ యాక్షన్ థ్రిల్లర్ కి అద్దం పట్టేలా తీర్చిదిద్దడానికి దర్శకుడు శివ యత్నించాడు. అయితే ఈ క్రమంలో కథను మాత్రం పూర్తిగా వదిలేశాడు. ఓ సాధారణ రివెంజ్ డ్రామాకు స్టైలిష్ కలరింగ్ ఇచ్చి స్పై కథగా వివేకంను తయారు చేశాడు. అలాగని తమిళ జనాలకు కావాల్సిన ఊర మాస్ ఎలిమెంట్స్ ను మాత్రం ఎక్కడా మిస్ కాలేదు. బ్యాక్ డ్రాప్ ఫారిన్ లోకేషన్లు అయినప్పటికీ ఓ కోలీవుడ్ కమర్షియల్ సినిమాలోకనిపించే సెంటిమెంట్ సహా అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.

మరోవైపు వివేకం పేరుతో వాడిన ఇంటలిజెన్స్ కొన్ని చొట్ల అతిగా అనిపించక మానదు. ఫ్యూరీ అనే హాలీవుడ్ సినిమాలోని చాలా వరకు సన్నివేశాలను ఎత్తి యాజ్ ఇట్ ఈజ్ గా దించేశాడు. చాలా వరకు లోకేషన్లు అద్భుతంగా చూపించి, అక్కడ టేకింగ్ మాత్రం మైనస్ గా మార్చి పడేశాడు. అది తగ్గి ఉంటే సినిమా ఇంకో స్థాయికి వెళ్ళేది. ఇంకోపక్క తలా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని మాస్ పల్స్ తో స్టోరీ, స్క్రీన్ ప్లే నడిపించాడు. ఫస్టాఫ్ లో రిచ్ విజువల్స్, సెకండాఫ్ లో రివెంజ్ డ్రామా, విలన్ వివేక్ ఒబెరాయ్ తో జరిగే డ్రామా అంతా సాదాసీదాగానే ఉంటుంది. కానీ, అజిత్ డైలాగులకు మాత్రం విజిల్స్ పడతాయి.


నటీనటుల విషయానికొస్తే.. ఇక హీరో అజిత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాడీ లాంగ్వేజ్, బాడీ కోసం తాను పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్ లోను కనపడుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో అజిత్ ను ఎందుకు ఇష్టపడతారో వివేకం చూస్తే అర్థమౌతుంది. కాజల్ ది లిమిట్ రోల్, అయినా బాగా చేసిది. తమిళ్ లో డెబ్యూ చేసిన కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ హ్యాకర్ రోల్ లో అలరించింది. వివేక్ ఒబేరాయ్ విలన్ గా ఫర్ ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అయితే హీరోతో వచ్చే క్లైమాక్స్ ఫైట్ లో తేలిపోయాడు.


టెక్నికల్ అంశాల విషయానికొస్తే... అనిరుధ్ పాటలు అంతగా రికార్డవ్వవు. బ్యాగ్రౌండ్ స్కోర్ లో నాయిస్ ఎక్కువైన, హాలీవుడ్ మూవీ తరహాలో బాగానే అందించగలిగాడు. వెట్రి అందించిన ఛాయాగ్రహణం అద్భుతమనే చెప్పాలి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ను అందించాడు. రుబెన్ ఎడిటింగ్ కాస్త కోత పడాల్సిందే. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్లను రెండు గంటల్లోపు చూపించి ఉంటే బావుండేది. టెక్నికల్, నిర్మాణ విలువల విషయంలో కూడా వివేగం అందర్నీ మెప్పిస్తుంది.

ఫ్లస్ పాయింట్లు:
అజిత్ నటన
యాక్షన్ సన్నివేశాలు
రిచ్ విజువల్స్

 

మైనస్ పాయింట్లు:

వీక్ కథ,
డైరక్షన్

తీర్పు:

శివ కథ వరకు పాతదే అనుకున్నప్పటికీ స్టోరీ లైన్ ను మాత్రం తన స్టైల్ ఊరమాస్ లోనే నడిపించాడు. అదే టైంలో కొన్ని చోట్ల గందరగోళానికి గురిచేసినప్పటికీ తలా ఫ్యాన్స్ కు మాత్రం ట్రీట్ అనే చెప్పాలి. అంతర్జాతీయ స్థాయి సినిమా చూస్తున్నంత ఫీలింగ్ తెప్పిస్తోంది సినిమా వివేకం.


చివరగా.. వివేకం... వేగం ఉంది కానీ అదుపు తప్పింది