ఆనందో బ్రహ్మ రివ్యూ.. వెరైటీ నవ్వులు | Anando Brahma Movie Review and Rating

Teluguwishesh ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ Anando Brahma Telugu Movie Review and Rating. Story and Synopsis This Comedy Horror Flick. Product #: 84253 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ఆనందో బ్రహ్మ

 • బ్యానర్  :

  70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్

 • దర్శకుడు  :

  మహి కె.రాఘవ్

 • నిర్మాత  :

  విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

 • సంగీతం  :

  కృష్ణకుమార్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  అనీష్ తరుణ్ కుమార్

 • నటినటులు  :

  తాప్సీ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, తనికెళ్ల భరణి తదితరులు

Anando Brahma Movie Review

విడుదల తేది :

2017-08-18

Cinema Story

తన తండ్రి నుంచి సంక్రమించిన పెద్ద ఇంటిని అమ్మకానికి పెడతాడు ఓ ఎన్నారై(రాజీవ్ కనకాల). అయితే మధ్యవర్తి(రాజా రవీంద్ర) మాత్రం అందులో దెయ్యాలున్నాయని కలరింగ్ ఇస్తూ ఎవరనీ ముందుకు రానీయకుండా చేయాలన్న ఫ్లాన్ వేస్తాడు. ఆ క్రమంలో నిజంగానే దెయ్యాలు వస్తాయి. దీంతో అందులో దెయ్యాలు లేవు అని నిరూపించాల్సిన అవసరం యజమానికి పడుతుంది. అందుకు ఓ ముగ్గురిని నాలుగు రోజులు ఆ ఇంట్లో ఉండాలంటూ కండిషన్ పెట్టి డబ్బు ఎర వేస్తాడు. ఆర్థికంగా కష్టాలున్న సిద్ధు (శ్రీనివాసరెడ్డి), మరో ముగ్గురు అందుకు ముందుకొస్తారు. మరి దెయ్యాలు వాళ్లే ఎలా ఆడుకున్నారు? చివరకు దెయ్యాలు రివర్స్ అయ్యాయా? మధ్యలో కథ ఎలాంటి మలుపు తిరిగింది. చివరకు ఏమైంది? అన్నదే కథ.

cinima-reviews
ఆనందో బ్రహ్మ

కామెడీ రోల్స్, హీరో పక్క క్యారెక్టర్లతో పాపులర్ అయిన శ్రీనివాసరెడ్డి గత కొంత కాలంగా హీరో వేషాలు వేస్తూ వస్తున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్ము రా అంటూ మంచి సినిమాల్లోనే నటించాడు. ఇక తెలుగులో గ్లామర్ పాత్రలు చేసి బాలీవుడ్ కు చెక్కేసింది తాప్సీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇక్కడికి వచ్చింది. ఈ రేర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే ఆనందో బ్రహ్మ. గతంలో పాఠశాల అనే ఓ చిత్రం తీసిన మహి కె.రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భయానికి నవ్వంటే భయం అంటూ హార్రర్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ:

హర్రర్ జోనర్ సినిమాలు తెలుగులో కొత్తేం కాదు. ఈ ‘ఆనందో బ్రహ్మ’ కూడా దాదాపుగా ఇదే లైన్లో సాగుతుంది. కాకపోతే మనుషుల్ని చూసే దయ్యాలు కంగారు పడతాయి. ఆ ఒక్క పాయింట్ తో నడిచే సుమారు అరగంట కథే ‘ఆనందో బ్రహ్మ’లో కొత్తగా అనిపించే విషయం. దయ్యాల్ని మనుషుల్లా.. మనుషుల్ని దయ్యాల్లా చూపిస్తూ మొదలైన కథ తర్వాత ప్రధాన పాత్రల ఇంట్రడక్షన్ తో కాస్త ఫర్వాలేదనిపిస్తోది. ఇంటర్వెల్ ముందు దాకా కాస్త బోర్ కొట్టించిన కథ. ఇంట్లోకి ఎంటర్ అవ్వటం దగ్గరి నుంచి అసలు వ్వవహారం మొదలవుతుంది.

ఐతే ప్రధాన పాత్రలు దయ్యాల కొంపలోకి తీసుకెళ్లాక కథనం రక్తి కడుతుంది. ద్వితీయార్ధంలో ముఖ్యంగా షకలక శంకర్, వెన్నెల కిషోర్ పాత్రల చుట్టూ అల్లుకున్న కామెడీ అదిరిపోతుంది. కొన్ని చోట్ల లాజిక్ అన్నది పూర్తిగా పక్కన పెట్టేసినప్పటికీ కామెడీ బాగా పండటంతో ప్రేక్షకులకు అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రి క్లైమాక్స్ నుంచి సో..సో...గా సాగే కథ రివెంజ్ డ్రామాతో ముగుస్తుంది. పాటల్లాంటివేమీ లేకపోవడం.. 2 గంటల రన్ టైం కావటం కలిసొచ్చే అంశాలు. కథలో పాత సినిమాల సీన్లను చాలా వాటిని గుర్తుకు తేవడం మైనస్.

నటీనటుల విషయానికొస్తే... చాన్నాళ్ల తర్వాత తెలుగులో కనిపించిన తాప్సీ పాత్రకు తగ్గట్లుగా సింపుల్ గా చేసుకుపోయింది. ఐతే ఆమె కంటే కూడా మిగతా వాళ్ల నటనే సినిమాకు కీలకంగా మారింది. అయినప్పటికీ ఇలాంటి పాత్ర ఒప్పుకున్నందుకు తాప్సీని అభినందించాలి. ఇక శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ అన్న బిల్డప్ లేకుండా మిగతా వారితో చక్కగా నటించాడు. మిగతా వాళ్లలో వెన్నెల కిషోర్ రేచీకటి పాత్ర హైలెట్. కానీ, ఎక్కువ నవ్వులు పడింది మాత్రం షకలక శంకర్ నుంచే. సినిమా పిచ్చి ఉన్న కడుపుబ్బా నవ్వించాడు. తాగుబోతు రమేష్ కూడా తన ట్రేడ్ మార్క్ పాత్రలో నవ్వించాడు. చాలా కాలం తర్వాత మెరిసిన రాజీవ్ కనకాల, విజయ్ చందర్ లు కీలకపాత్రలో కనిపించారు.

సాంకేతికవర్గం విషయానికొస్తే... కృష్ణకుమార్ నేపథ్య సంగీతం.. అనీష్ తరుణ్ కుమార్ ఛాయాగ్రహణం సినిమాకు ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. దర్శకుడి శైలికి తగ్గట్లుగా రెండూ బాగా కుదిరాయి. తక్కువ లొకేషన్లలో.. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.


ఫ్లస్ పాయింట్లు:
లీడ్ రోల్స్
సెకండాఫ్
కాన్సెప్ట్
డైరక్షన్

 

మైనస్ పాయింట్లు:
స్లో ఫస్టాఫ్

తీర్పు :

దర్శకుడు మహి కె.రాఘవ్ మంచి స్టోరీతో పైగా ఢిఫరెంట్ స్టైల్ నేరేషన్ తో మన ముందుకు ఆనందో బ్రహ్మాను తెచ్చాడు. కాన్సెప్ట్ ఢిపరెంట్ అయినప్పటికీ అది రెవెంజ్ మూస ధోరణిలోనే సాగటం కాస్త నిరాశపరుస్తుంది. అయితే ద్వితీయార్ధంపై మాత్రం ఓ నలభై నిమిషాలు మంచి పట్టు చూపించాడు. కొన్ని నవ్వులను మాత్రమే పంచి మిగతా కథను రెగ్యులర్ రివెంజ్ డ్రామాతోనే నడిపాడు. అయినప్పటికీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమాను రూపొందించగలిగాడు.

చివరగా... ఆనందో బ్రహ్మా జస్ట్ హాఫ్ నవ్వుల కోసం...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.