Nene Raju Nene Mantri Review | Nene Raju Nene Mantri Telugu Movie Review

Teluguwishesh నేనే రాజు నేనే మంత్రి నేనే రాజు నేనే మంత్రి Nene Raju Nene Mantri Telugu Movie Review. Find all about Nene Raju Nene Mantri review and rating along with story highlights in concise. Product #: 84155 2.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  నేనే రాజు నేనే మంత్రి

 • బ్యానర్  :

  సురేష్ ప్రోడక్షన్ హౌజ్

 • దర్శకుడు  :

  తేజ

 • నిర్మాత  :

  సురేష్ బాబు

 • సంగీతం  :

  అనూప్ రూబెన్స్

 • సినిమా రేటింగ్  :

  2.252.25  2.25

 • ఛాయాగ్రహణం  :

  వెంకట్ సీ దిలీప్

 • ఎడిటర్  :

  కోటగిరి వెంకటేశ్వర రావు

 • నటినటులు  :

  దగ్గుబాటి రానా, కాజల్, కేథరిన్ థ్రెస్సా, తనికెళ్ల భరణి, అశుతోష్ రాణా, పోసాని తదితరులు

Nene Raju Nene Mantri Movie Review

విడుదల తేది :

2017-08-11

Cinema Story

జోగేంద్ర(రానా) అనంతపురంలో  ఓ వడ్డీవ్యాపారి. అతనికి భార్య రాధ(కాజల్) మాత్రమే ప్రపంచం. గర్భవతి అయిన రాధ ఆ ఊరి సర్పంచ్ కారణంగా  బిడ్డను కడుపులోనే కోల్పోతుంది. దాంతో పగ పెంచుకున్న జోగి ఆ ఊరికి సర్పంచ్ అవుతాడు. ఆపై ఎమ్మెల్యే అవుతాడు. చివరకు ఏకంగా సీఎం సీటుపైనే కన్నేస్తాడు. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. చివరకు విజయం సాధిస్తాడా? అసలు అతడి ప్రస్థానం ఎలా ముగుస్తుంది అన్నదే కథ. 

cinima-reviews
నేనే రాజు నేనే మంత్రి

బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించేసుకున్న చాలా కాలం తర్వాత ఘాజీ తో ఈ ఏడాది తొలి హిట్ కొట్టేశాడు. అదే సమయంలో హిట్ అనే పదానికి దశాబ్దంన్నరకు పైగానే దూరమయ్యాడు దర్శకుడు తేజ. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ రావటం ఆసక్తిరేక్కిత్తించింది. మరి నేనే రాజు నేనే మంత్రి రిజల్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

విశ్లేషణ:

కథ చెప్పినప్పుడే ఇందులో లాజిక్ లు వెతకాల్సిన పని లేదన్న విషయం అర్థమైపోయి ఉంటుంది. భార్య మీద ప్రేమ నుంచి రాజకీయాల వైపు మళ్లే హీరో.. చివరకు ఆ అత్యాశకు ఎలా బలైపోయాడన్న కథాంశంను అద్భుతంగా అయితే మాములుగా తేజ సినిమాల్లో సీన్లు లాజిక్ లెస్ గా ఉంటాయి. వాటితో పోలిస్తే నేనే రాజు కాస్త బెటర్. స్టోరీ పరంగానే కాదు.. అక్కడక్కడా కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. అయితే ఇలాంటి డ్రామాలను సీరియస్ గా చూపించినప్పటికీ, చాలా వరకు రియలిస్టిక్ గా చూపించాలనే పాయింట్ ను తేజ మిస్సయ్యాడు.

ఫస్టాఫ్ వరకు హీరో హీరోయిన్ల మధ్య ట్రాక్ తో నడిపించిన దర్శకుడు, సెకండాఫ్ లో పూర్తిగా గాడితప్పి, క్లైమాక్స్ కు వచ్చేసరికి ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులను చూపించే అటెంప్ట్ చేసినప్పటికీ కథలో బిగువ లేకపోవటంతో ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ఉన్నంతలో సినిమాలో ఆకట్టుకుంది ఏదైనా ఉందా? అంటే రానా యాక్టింగ్ మాత్రమే. కానీ, అది కూడా అంత ఎంటర్ టైనింగ్ మలచలేకపోయాడు దర్శకుడు.

నటీనటుల విషయానికొస్తే.. రానా సీరియస్ పొలిటీషియన్ రోల్ లో తన ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాలతోపాటు కాస్త కామెడీ టైమింగ్ ను ప్రదర్శించేందుకు ట్రై చేశాడు. అయితే కథలో బలం లేకపోవటంతో తాను చేయాల్సింది మాత్రమే చేయగలిగాడు. ఇక కాజల్ ప్రాధాన్యం ఉన్న పాత్రను చక్కగా పోషించింది. కేథరిన్, పోసాని, నవదీప్, ప్రభాస్ శీను ఫర్వాలేదు. అశుశోష్ రాణా వీక్ విలన్ రోల్ లో ఆకట్టుకోలేకపోయాడు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... అనూప్ టైటిల్ సాంగ్ తో మెస్మరైజ్ చేయగా, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే ఉంది. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. పోలిటికల్ కాన్సెప్ట్ మూవీ కావటంతో లక్ష్మీ భూపాల్ పంచింగ్ డైలాగులు ఎక్కాయి. రన్ టైం 2 గంటల 40 నిమిషాలు కావటం సినిమాకు మరో మైనస్. తేజ తన శైలికి భిన్నమైన సినిమా చేసినా పకడ్బందీగా తెరకెక్కించలేకపోయాడు. సురేష్ ప్రోడక్షన్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
రానా,
డైలాగులు

 


మైనస్ పాయింట్లు:
కథా బలం లేకపోవటం
చివరి 20 నిమిషాలు

తీర్పు:
దర్శకుడు తేజ మరింత లోతుగా అధ్యయనం చేసి తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేది. భార్యపై ప్రేమ అనే లక్ష్యాన్ని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసే హీరో ఓ టార్గెట్ అంటూ లేకుండా చేసే పనులు చిరాకు కూడా పుట్టిస్తాయి. గత చిత్రాలతో పోలిస్తే బాగానే ఉన్నప్పటికీ ఈ చిత్రం అనుకున్నంత అవుట్ పుట్ కాదనేది ఒప్పుకోవాల్సిన నిజం.


చివరగా.. నేనే రాజు నేనే మంత్రి... రియలిస్టిక్ పూర్ పొలిటికల్ డ్రామా

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.