గౌతమ్ నంద రివ్యూ.. రిచ్ బట్ భరించలేం | Gautam Nanda Movie Review, Rating, Story, Cast & Crew

Teluguwishesh గౌతమ్ నంద గౌతమ్ నంద Find all about Gautam Nanda review and rating along with story highlights in concise. Check Sampath Nandi and Gopi Chand Stylish Action drama Review here. Product #: 83901 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గౌతమ్ నంద

  • బ్యానర్  :

    శ్రీబాలాజీ సినీ మీడియా

  • దర్శకుడు  :

    సంపత్ నంది

  • నిర్మాత  :

    జే భగవన్, జే పుల్లారావు

  • సంగీతం  :

    ఎస్ ఎస్ థమన్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    సౌందర్ రాజన్

  • ఎడిటర్  :

    గౌతం రాజు

  • నటినటులు  :

    గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సా, తనికెళ్ల భరణి, ముకేష్ రుషి, సచిన్ కేద్కర్, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి తదితరులు

Gautam Nanda Telugu Movie Review

విడుదల తేది :

2017-07-28

Cinema Story

కథ..

మల్టీ మిలీనియర్ విష్ణు ప్రసాద్(సచిన్ కేద్కర్) కొడుకు గౌతమ్(గోపీచంద్). లగ్జరీ లైఫ్ లో మునిగి తేలుతూ ఉన్న అతని జీవితాన్ని ముగ్ధ(కేథరిన్) ఓ వ్యక్తి(తనికెళ్ల భరణి) పరిచయం టోటల్ గా మార్చేస్తుంది. అక్కడి నుంచి తానెవరో తెలుసుకునేందుకు ఇండియాకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో అచ్చం తనలాగే ఉండే నందు(గోపీచంద్) ను కలిసి నెల రోజులు తమ తమ క్యారెక్టర్లు మార్చుకుని జీవించేలా ఒప్పందం చేసుకుంటాడు. మరోవైపు తన ఐడెంటిటీ కనుగొనే ప్రయత్నంలో గౌతమ్ పై హత్యాయత్నం జరుగుతుంది. తనను చంపాలనుకున్న వాళ్లెవరో తెలిసి గౌతమ్ షాక్ తింటాడు. ఇంతకీ అది ఎవరు? వారిని పట్టుకున్నాడా? గౌతమ్ గతం ఏంటి? మిడిల్ క్లాస్ నందుకి గౌతమ్ లింకు ఏంటి? చివరకు ఎలాంటి ట్విస్ట్ లతో ముగుస్తుంది అన్నదే గౌతమ్ నంద కథ.

cinima-reviews
గౌతమ్ నంద

వరుస ఫ్లాపులతో ఢీలా పడి ఉన్న మ్యాచో మ్యాన్ గోపీచంద్ హిట్ కోసం వరుస హిట్లతో ఉన్న దర్శకుడు సంపత్ నందితో జత కట్టాడు. స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా గౌతమ్ నంద తెరకెక్కింది. ఈవాళే సినిమా మన ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది? బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలిచిందా? రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ..

రాముడు భీముడు నుంచి ఇప్పటి గౌతమ్ నంద వరకు కాన్సెప్ట్ లు ఒక్కటే. కానీ, వాటిని ట్రెండ్ కు తగ్గట్లు చేయటంలోనే అసలు మ్యాటర్ ఉంటుంది. దర్శకుడు సంపత్ నంది స్టైలిష్ విషయంలో తీసుకున్న కేరింగ్, టేకింగ్ లో మాత్రం చూపించలేకపోయాడు. ఫస్టాఫ్ మొత్తం ఫారిన్ లోకేషన్ లలో చాలా రిచ్ గా, ఎంటర్ టైనింగ్ గా సాగిపోతుంటుంది. ఇండియాకు వచ్చాక కూడా ఓ మోస్తరుగానే నడుస్తుంటుంది. కానీ, సెకండాఫ్ మధ్యలోకి వచ్చేసరికి కథ పూర్తిగా గాడితప్పిపోయింది.

మన ప్రేక్షకులు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలకు బాగా కనెక్ట్ అవుతారన్న ఫార్ములాను అనుసరించి సంపత్ ఆ విషయంలో అతి శ్రద్ధే పెట్టాడు. గౌతమ్ కి, నందు ఫ్యామిలీతో వచ్చే సీన్లు అంతగా పండలేదు. సరికదా ఈ ఓవర్ సెంటిమెంటే సినిమాకు అవే డ్రాప్ బ్యాక్ పాయింట్లు అయ్యాయి. ఇక సినిమాలో ఓ చిన్న సీన్ గురించి చెప్పుకుందాం. ఇద్దరు హీరోల్లో తమ కొడుకు ఎవరో తెలుసుకునేందుకు గౌతమ్ పేరెంట్స్ ను తమ పెంపుడు కుక్కను వదలుతారు. ఇది సెంటిమెంట్ పీక్స్ లో ఉన్న టైంలో వచ్చే సీన్. ఇలాంటి చమ్మక్కు సీన్లు క్లైమాక్స్ దాకా కొనసాగుతూనే ఉంటాయి.

తానెవరో తెలుసుకోవటానికి ప్రయత్నించే హీరో ఆ క్రమంలో పడే సంఘర్షణను వదిలేసి హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ లు ఊహించేసుకోవటం రీజనబుల్ గా అనిపించదు. లగ్జరీ లైఫ్ కి టెంప్ట్ అయ్యి నందు, గౌతమ్ ను చంపేందుకు యత్నించటం కూడా అంతగా వర్కవుట్ కాలేదు. దర్శకుడు కమర్షియల్ మసాలాను దట్టంగా పెట్టినప్పటికీ, చివరి 40 నిమిషాల సినిమా మాత్రం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. మంచి ట్విస్ట్ లు ఇచ్చిన దర్శకుడు వాటిని సరిగ్గా డీల్ చేసి ఉంటే మాత్రం గౌతమ్ నంద సెన్సేషన్ అయ్యి ఉండేదేమో. చివరకు క్లైమాక్స్ కూడా దబ్బిడి దిబ్బిడిగా ముగించినప్పటికీ, హ్యాపీ ఎండింగ్ నే వేసి కాస్త ఊరటనిచ్చాడు.


నటీనటుల విషయానికొస్తే... గౌతమ్ నంద లో బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ నే ఇచ్చాడు గోపీచంద్. గౌతమ్, నంద గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాగానే ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా గౌతమ్ ఆకట్టుకుంటాడు. యాక్షన్ సన్నివేశాలు గోపీకి కొట్టిన పిండి కావటంతో మరోసారి చెలరేగిపోయాడు. ఎమోషనల్ సీన్లలో బాగానే చేసినప్పటికీ, మిగతా నటీనటుల అసహజత్వంతో అతని నటన వేస్ట్ అయిపోయింది. హీరోయిన్లలో హన్సిక జస్ట్ అలా ఉండిపోయింది. తనను ఏడిపించినప్పుడల్లా హీరో వచ్చి ఫైట్ చేయటం, ఓ పాట రావటం కామెడీగా అనిపిస్తుంది. కథను మలుపు తిప్పే రోల్ లో కేథరిన్ మరోసారి లీడ్ హీరోయిన్ అన్నట్లే చేసింది. అల్ట్రా గ్లామర్ పరంగానే కాదు.. యాక్టింగ్ స్కోప్ పరంగా ఆమెకే ఎక్కువ మార్కులు పడ్డాయి కూడా. విలన్ గా ముకేష్ రుషి వేస్ట్ అయ్యాడు. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి.. మిగతా వాళ్లు ఫర్వాలేదు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... థమన్ మరోసారి దుమ్ము రేపాడు. తన స్టైల్ బ్యాగ్రౌండ్ తో ఆకట్టుకున్నాడు. రెండు పాటలు ఆడియో, వీడియో బావుంటాయి. మిగతా పాటలు ఓకే. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమా రన్ టైం 156 నిమిషాలు కాగా అందులో ఎడిటర్ గౌతం రాజు మరింత కోత పెట్టాల్సింది. డైలాగులు సాదాసీదాగా ఉన్నాయి. ప్రోడక్షన్ వాల్యూస్ చాలా చాలా రిచ్ గా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:

గోపీచంద్ నటన

రిచ్ టేకింగ్, విజువల్స్

కేథరిన్ గ్లామర్ షో

ట్విస్టులు

 

 

మైనస్ పాయింట్లు:

పేలవమైన స్టోరీ

ఓవర్ సెంటిమెంట్

 

విశ్లేషణ..

వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న దర్శకుడు సంపత్ నంది గౌతమ్ నందతో మరోసారి మెస్మరైజ్ చేసే యత్నంలో బోల్తా పడ్డాడు. ఒక పూర్ కథను సగం సినిమా వరకు ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో, తర్వాత సెంటిమెంట్ పేరుతో అంత టార్చర్ ను చూపించేశాడు.


చివరగా.. గౌతమ్ నంద.. చాలా రిచ్ కానీ భరించటం కష్టం

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.