Andhagadu Movie Review and Rating

Teluguwishesh అందగాడు అందగాడు Andhagadu 2017 Movie Review and Rating. Along with story highlights in Concise here of Rajtarun's Flick. Product #: 82861 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  అంధగాడు

 • బ్యానర్  :

  ఏకే ఎంటర్ టైన్ మెంట్స్

 • దర్శకుడు  :

  వెలిగొండ శ్రీనివాస్

 • నిర్మాత  :

  అజయ్ సుంకర

 • సంగీతం  :

  శేఖర్ చంద్ర

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  రాజశేఖర్

 • నటినటులు  :

  రాజ్ తరుణ్, హెబ్బా పటేల్, రాజేంద్ర ప్రసాద్, రాజా రవీంద్ర, అశిశ్ విద్యార్థి, తదితరులు

Andhagadu Movie Review

విడుదల తేది :

2017-06-02

Cinema Story

గౌతమ్‌ (రాజ్‌ తరుణ్‌)కి కళ్లు కనిపించవు. పుట్టుకతోనే అంధుడు. ఓ అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడవుతాడు. రేడియో జాకీగా స్థిరపడతాడు. నేత్ర (హెబ్బా పటేల్‌) అనే ఓ డాక్టర్‌తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. నేత్ర ఎక్కడ దూరం అవుతుందో అనే భయంతో... తనకు చూపు ఉన్నట్టు నటిస్తాడు. కానీ... నేత్రకు నిజం తెలిసిపోతుంది. స్వతహాగా తానో నేత్ర వైద్యురాలు కావడంతో గౌతమ్‌కి కళ్లొచ్చే ఏర్పాటు చేస్తుంది. కళ్లొచ్చాక అంతా హ్యాపీనే అనుకొంటుంటే.. అప్పటి నుంచే కొత్త సమస్యలు మొదలవుతాయి. కులకర్ణి (రాజేంద్ర ప్రసాద్‌) అనే ఓ ఆత్మ.. గౌతమ్‌ని వెంబడిస్తుంది. నిజానికి కులకర్ణి కళ్లనే.. గౌతమ్‌కి అమర్చారు. అందుకే.. ఆ ఆత్మ కేవలం గౌతమ్‌కి మాత్రమే కనిపిస్తుంటుంది. రెండు హత్యలు చేసి, తన ఆత్మకు శాంతి చేకూర్చాలని కులకర్ణి ఆత్మ.. గౌతమ్‌ని వేడుకొంటుంది. మరి గౌతమ్‌ అందుకు ఒప్పుకొన్నాడా? అసలు కులకర్ణి ఎవరు? తన పగ ఎవరిపైన? ఈ ప్రశ్నలకు సమాధానం వెండితెరపైనే లభిస్తుంది.

cinima-reviews
అందగాడు

అంగ్ల చిత్రం ది యూసువల్ సస్పెక్ట్స్ తరహాలో కధతో.. 1990లో తెలుగు ప్రేక్షకుల అదరణతో హిట్ కోట్టిన కోకిల చిత్ర కథనే కాసింత కొత్త పద్దతిలో దర్శకత్వ ప్రతిభకు పట్టం కట్టేలా రూపోందిన చిత్రమే అంథగాడు. కథలో ట్విస్టులు పెట్టి మరీ నూతన చిత్రీకరణతో.. రూపొందించాడు దర్శకుడు. కొత్త కథ కాకాపోయినా.. కథనంలో కొత్తధనం.. దానికి వినోదాన్ని మేళపించి హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు వెంగొండ శ్రీనివాస్ ఎలాంటి మాయా చేసినా.. అందులో దర్శకులు మార్కు ఫార్ములాను ఫాలో అవుతూ వినోదానికి ప్రాముఖ్యతనిచ్చే హీరో రాజ్ తరుణ్

దీంతో హారర్ కామెడీ చిత్రాల జెన్నీలో రివెంజ్ స్టోరీలకు మళ్లీ ప్రాణం పోసినట్లు వున్నాడు దర్శకుడు. తనకు పగ తీర్చుకునే అవకాశం లేని ఆత్మ.. తన ప్రత్యర్థులపై ఎలా పగ తీర్చుకుందనేదే స్టోరీ థీమ్. ఇలాంటి కథలు అనేకం వచ్చినా.. ఈ పాయింట్‌ని దర్శకుడు డీల్‌ చేసిన విధానం, కథనాన్ని నడిపించిన తీరు.. అందులోని మలుపులు తప్పకుండా రక్తి కట్టించి ఇదో కొత్త తరహా సినిమా అనే భావన కలిగిస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంత సాదాసీదాగా సాగినా.. రెండో హాఫ్ మాత్రం మలుపులతో రక్తి కట్టించింది. విశ్రాంతి వరకు రాజ్ తరుణ్ హెబ్బాల ప్రేమాయణం, వినోదం చుట్టూ తిరిగిన కథ.. రెండో హాఫ్ లో ఉత్కంఠ, సస్సెన్స్లతో హడలెత్తించినా.. ప్రేక్షకుడు మాత్రం సినిమా థియేటర్ నుంచి నవ్వూతు బయటకోస్తాడంటే.. వినోదానికి దర్శకుడు ఇచ్చిన ప్రాధాన్యత కూడా అర్థం చేసుకోవచ్చు.

 రాజ్‌ తరుణే. ‘అంధ’గాడిగా చాలా బాగా ఇమిడిపోయాడు. కళ్లులేనప్పుడు, కళ్లొచ్చిన తర్వాత.. తన బాడీ లాంగ్వేజ్‌ ను మార్చడం.. మాట తీరును వ్యవహారశైలిని పూర్తిగా మార్చేశాడు. ఇందుకోసం బాగానే అధ్యయనం చేశాడు. హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ గాళ్ల్ గా కనిపించింది. రెండో భాగంలో వచ్చే రాజేంద్ర ప్రసాద్‌ గురించి, ఆయన నటన గురించి తెలియని సగటు సినీ ప్రేక్షకుడు లేడు.. ఇక షాయాజీ, రాజా రవీంద్ర తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా చూస్తే పాటలు.. ప్లేబ్యాక్ మ్యూజిక్ ఓకే అనిపించగా, కెమెరా వర్క్‌ ఆకట్టుకొంటుంది. మాటలు అక్కడక్కడ బాగా పేలాయి. కామెడీ సీన్లు ఎంత బాగా రాసుకొన్నాడో, థ్రిల్‌ కలిగించే సీన్లు అంత బాగా డీల్‌ చేశాడు దర్శకుడు. తొలి ప్రయత్నమే అయినా తనదైన ముద్రవేశాడు.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.