మూవీ రివ్యూ: ఈ గుంటూరోడు చాలా మాములోడే... | Gunturodu Movie Review.

Teluguwishesh గుంటూరోడు గుంటూరోడు Gunturodu Telugu Movie Review. Product #: 81266 2.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  గుంటూరోడు

 • బ్యానర్  :

  క్లాప్స్ అండ్ విజిల్ ఎంటర్ టైనర్

 • దర్శకుడు  :

  ఎస్ కే సత్య

 • నిర్మాత  :

  శ్రీ వరుణ్ అట్లూరి

 • సంగీతం  :

  డీజే వసంత్

 • సినిమా రేటింగ్  :

  2.52.5  2.5

 • ఛాయాగ్రహణం  :

  సిద్ధార్థ్ రామస్వామి

 • ఎడిటర్  :

  కార్తీక్ శ్రీనివాస్

 • నటినటులు  :

  మంచు మనోజ్, ప్రగ్న్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, సత్య తదితరులు

Gunturodu Movie Review

విడుదల తేది :

2017-03-03

Cinema Story

కథ:

చదువు పూర్తి కావటంతో దోస్తులతో బలాదూర్ గా తిరిగే కన్నా(మంచు మనోజ్)ను దారిలో పెట్టేందుకు తండ్రి సూర్య నారాయణ రావు(రాజేంద్ర ప్రసాద్) పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలోనే ప్రగ్నా(ప్రగ్నా జైస్వాల్) ను చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో కన్నా కొన్ని చిక్కులు ఎదుర్కుంటున్నాడు.

ఇంతలో ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఉన్న శేషు అనే ఓ పవర్ ఫుల్ క్రిమినల్ లాయర్ తో కన్నాకు గొడవలు మొదలవుతాయి. అంతలోనే అనుకోని ట్విస్ట్ కన్నా జీవితాన్ని మలుపు తిప్పుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటీ? ప్రగ్నాకి శేషుతో ఉన్న సంబంధం ఏంటి? కన్నా తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అన్నదే కథ.

cinima-reviews
గుంటూరోడు

కెరీర్ తొలినాళ్లలో వరుస సక్సెస్ లు చవిచూసిన మంచు మనోజ్ ఆ తర్వాత ప్రయోగాల పేరిట చేతులు కాల్చుకుంటూనే వస్తున్నాడు. అయితే ఈ మధ్య అతని చిత్రాల్లో ఆ ఎలిమెంట్ కూడా లేకుండా కేవలం ఒకే ఫార్మట్ తో సినిమాలు తీస్తున్నాడంటూ క్రిటిక్స్ విమర్శలు కురిపిస్తున్నాడు. మాస్ కంటెంట్ అయినప్పటికీ సరిగ్గా హ్యాండిల్ చేసే దర్శకుడు ఉంటే సక్సెస్ సాధించవచ్చని కొన్ని సినిమాలు రుజువు చేశాయి. దీంతో ఆ ఫార్ములాతోనే సత్య అనే దర్శకుడితో కలిసి గుంటూరోడు గా మన ముందుకు వచ్చాడు. మరి సీరియల్ ఫెయిల్యూర్స్ తో ఉన్న మనోజ్ కి ఇది సక్సెస్ ఇచ్చిందా? చూద్దాం.

 

విశ్లేషణ:

అవుట్ డేటెడ్ స్టోరీలను రీమిక్స్ చేసి దానికి కాస్త ఎంటర్ టైన్ అనే మసాలాను అద్ది వస్తున్న కథలకు టాలీవుడ్ లో కొదవేం లేదు. అఫ్ కోర్స్ గుంటూరోడు కూడా అలాంటి ప్రయత్నమే. అయితే దానిని ప్రజెంట్ చేసే యత్నంలోనే దర్శకుడు సత్య ఘోరంగా తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ మొత్తం రోటీన్ స్టోరీతో నడిపించే యత్నం చేసిన దర్శకుడు సెకంఢాఫ్ వచ్చే సరికి కాస్త రేసీ స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా తీసి అలరించే యత్నం చేశాడు. అయితే మెయిన్ స్టోరీలో సింక్ కానీ ఎన్నో ఎలిమెంట్స్ సినిమాను ఘోరంగా దెబ్బతీశాయి. పైగా కమెడియన్లు నవ్వించే యత్నం చేయకపోవటం మరో మైనస్ గా మారింది.

తనకు బాగా అలవాటైన జోనర్ కావటంతో మనోజ్ బాగానే చేశాడు. అయితే బాడీ లాంగ్వేజ్ విషయంలో ఎలా ఉన్నప్పటికీ, బాడీ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఫైట్లు, డాన్సులు అదరగొట్టాడు.  ప్రగ్న్యా జైస్వాల్ ఫర్వాలేదనిపించింది. పాటల్లో గ్లామర్ డోస్ చూపించినప్పటికీ అది అంతగా హెల్ప్ కాలేకపోయింది. రాజేంద్ర ప్రసాద్, సంపత్ రాజ్ లో జస్ట్ ఓకే అనిపించారు. కోట, రావు రమేష్ పాత్రలు వేస్ట్ చేశారు. మిగతా పాత్రలు ఓకే. చిరంజీవి వాయిస్‌ ఓవర్ స్పెషల్ గానే ఉన్నప్పటికీ అదంతా హెల్ప్ కాలేకపోయింది.

టెక్నికల్ విషయానికొస్తే... డీజే వసంత్ అందించిన స్వరాలు సో సో గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సిద్ధార్థ రామస్వామి కెమెరా పనితనం లోకేషన్లు అందంగా చూపించటంలో పనికొచ్చింది. మిగతా టెక్నీషియన్లు తమ శక్తి మేర టాలెంట్ ను చూపించారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
నటీనటుల ఫెర్ ఫార్మెన్స్
ప్రీ ఇంటర్వెల్ సీన్

 

మైనస్ పాయింట్లు:
కథ
ఎంటర్ టైనింగ్ మిస్సవ్వటం
ఆకట్టుకోని పాటలు

తీర్పు:
సగటు కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ కథా కథనాల్లో కొత్తదనం ఏమీ లేకుండా తెరకెక్కించాడు దర్శకుడు సత్య. పాటలు, పోరాటాలు, లవ్‌ట్రాక్‌, హీరో-విలన్‌ మధ్య శత్రుత్వం వంటి అంశాలతో ఒక్క ఫార్ములా ప్రకారం సినిమా సాగిపోతుందే తప్ప ఎక్కడా ఎంగేజింగ్ గా ఉండదు. ఎంటర్ టైన్ సంగతి పక్కన పెడితే పోనీ ఎమోషనల్ సీన్లు పండాయా? అంటే అది కూడా కుదరలేదు. ఇలాంటి కథల్లో భావోద్వేగాలతో పాటు కామెడీ, ఉత్కంఠను రేకెత్తించే అంశాల్ని చూపించేందుకు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కానీ దర్శకుడు ఆ విషయాలపై దృష్టి పెట్టలేదు

చివరగా.. గుంటూరోడు.. రొటీన్ రొడ్డు కొట్టుడే...

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.