నరుడా డోనరుడా రివ్యూ | Naruda Donaruda movie review

Teluguwishesh నరుడా డోనరుడా నరుడా డోనరుడా Sumanth's Naruda Donaruda movie review. Product #: 78778 2.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  నరుడా డోనరుడా

 • బ్యానర్  :

  అన్నపూర్ణ స్టూడియోస్

 • దర్శకుడు  :

  మల్లిక్ రామ్

 • నిర్మాత  :

  సుప్రియా వై, జాన్ సుధీర్ పోదట్టా

 • సంగీతం  :

  శ్రీచరణ్ పాకాల

 • సినిమా రేటింగ్  :

  2.252.25  2.25

 • ఛాయాగ్రహణం  :

  షానెయిల్ డియో

 • నటినటులు  :

  సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ల భరణి తదితరులు

Naruda Donaruda Movie Review

విడుదల తేది :

2016-11-04

Cinema Story

ఓ సంతాన సాఫల్య కేంద్రం నడుపుతూ జీవనం కొనసాగిస్తుంటాడు డాక్టర్ ఆంజనేయులు(తనికెళ్ల భరణి). అయితే ఉన్న స్పెర్మ్ డోనర్ హ్యాండివ్వటంతో ఫెషెంట్లు లేక సతమతమవుతుంటాడు. ఇదిలా ఉండగా ఓల్డ్ సిటీలో ఖాళీగా పని పాట లేకుండా తిరిగే యువకుడు విక్రమ్(విక్కీ) గురించి ఆంజనేయులికి ఎవరో చెబుతారు. విక్కీ తండ్రి చిన్నప్పడే కార్గిల్ వార్ లో చనిపోతాడు. తల్లి బేబీ(శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లలర్ నడుపుతూ కొడుకును పోషిస్తుంటుంది. 

 

ముందు ఒప్పుకోపోయినప్పటికీ, డబ్బు మీద ఆశతో వీర్య దానానికి విక్కీ రెడీ అయిపోతాడు. ఆపై ఆంజనేయులు ఆస్పత్రి మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతుంది. ఈ క్రమంలో తన జీవితంలోకి ప్రవేశించిన ఆషిమా(పల్లవి సుభాష్) ప్రేమలో పడతాడు విక్కీ. అల్రెడీ విడాకులు తీసుకుందని తెలిసినప్పటికీ పెళ్లి చేసుకుంటాడు. ఇదిలా ఉండగా ఓరోజు విక్కీ యాపారం ఏంటో అషిమాకు తెలిసి అతన్ని వదిలి వెళ్లిపోతుంది. మరి విడిపోయిన ఆ ఇద్దరిని ఆంజనేయులు ఎలా గడుపుతాడు అన్నదే కథ. 

cinima-reviews
నరుడా డోనరుడా

అక్కినేని నటవారసుడు పదిహేడేళ్ల కెరీర్ లో కేవలం నాలుగంటే నాలుగే హిట్లు అందుకున్నాడు సుమంత్. దీంతో కాస్త గ్యాప్ ఇచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు. హిందీలో అవార్డు విన్నింగ్ సెన్సేషన్ విక్కీడోనర్ ను సొంత బ్యానర్ లో నరుడా.. డోనరుడా గా తీసుకోచ్చాడు. వీర్య దానం అనే బోల్డ్ కాన్సెప్ట్ నేపథ్యంగా తెరకెక్కిన చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

విశ్లేషణ:

సాధారణంగా రీమేక్ అనగానే పెదవి విరిచే ప్రేక్షకుడికి బాలీవుడ్ లో బోల్డ్ అటెంప్ట్ గా వచ్చిన విక్కీ డోనర్ అనగానే నరుడా డోనరుడా పై అంచనాలు కలిగాయి. పైగా కొత్త దర్శకుడు కావటంతో ఎంతో కొంత టాలెంట్ చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ, ఈ విషయంలో మల్లిక్ పూర్తిగా విఫలమయ్యాడు. తీసుకున్న సబ్జెక్టు మంచిదే అయినప్పటికీ, దానిని తెరకెక్కించటంలో తడబడ్డాడు. ముఖ్యంగా సినిమాకు ఆయువు పట్టులాంటి కామెడీ విషయంలోనే చాలా నిర్లక్ష్యం చేశాడు. సెకండాఫ్ లో ఎమోషన్ సన్నివేశాలను అద్భుతంగా క్యారీ చేసినప్పటికీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చే అడల్ట్ కామెడీ అంతగా ఆకట్టుకోదు. బాలీవుడ్ కు సూటయిన ఈ సబ్జెక్టును తెలుగులో సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. సీన్ టూ సీన్ మక్కీకి మక్కీ కాపీ కొట్టాడు. దీంతో ఆయా సన్నివేశాలను జీర్ణించుకోవటం కాస్త కష్టంగా అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే... సుమంత్ నటనలో పరిణితి చూపించాడు. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్లలో ఈజీగా నటించాడు. లుక్స్ పరంగా కూడా చాలా డీసెంట్ గా ఉన్నాడు. ఇలాంటి కథలో నటించేందుకు ముందుకు రావటం నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. సుమంత్ తర్వాత సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాడు తనికెళ్ల భరణి. సినిమా ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ దాకా ఆయనదే షో అని చెప్పుకోవాలి. అయితే కొన్నిసార్లు ఆయన నోటి నుంచి డైలాగులు ఇబ్బందిగా అనిపించటం, అక్కడక్కడా ఓవర్ కామెడీ డోస్ ప్రదర్శించటం ఇబ్బందిగా అనిపిస్తాయి. హీరోయిన్ పల్లవి సుభాష్ నటన ఫర్వాలేదు. కమెడియన్ శ్రీలక్ష్మి చాలా గ్యాప్ తర్వాత కాస్త హుందా అయిన పాత్రలో ఆకట్టుకుంది. మిగతా వారంతా ఓకే.

టెక్నికల్ పరంగా... ఈ సినిమాకు సంగీతం పెద్దగా అస్సెట్ కాలేకపోయింది. శ్రీ చరణ్ జస్ట్ ఫర్వావాలేదు అనిపించాడు. సినిమాటోగ్రఫి ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ కూడా ఓకే. అన్నపూర్ణ క్రియేషన్స్ కావటంతో నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
సుమంత్, తనికెళ్ల భరణి నటన,
సెకండాఫ్

మైనస్ పాయింట్లు
కథా, కథనం.
కాస్త ఎబ్బెట్టుగా ఉండే కామెడీ

తీర్పు:
ఓవరాల్ గా సుమంత్ మంచి కాన్సెప్ట్ నే ఎన్నుకున్నాడు. కానీ, దర్శకుడు మల్లిక్ మాత్రం అదే కామెడీ టచ్ తో హిందీలో ఉన్నట్లే యాజ్ ఇట్ ఈజ్ గా తీసిపడేశాడు. సెట్స్, సీన్స్ తోసహా అన్ని అలాగే ఉంటాయి. అయితే మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఈ సబ్జెక్ట్ కి ఆదరణ ఎంత మేర ఉంటుందో వేచి చూడాలి.

చివరగా.... నరుడా డోనరుడా... ఎక్కాలంటే చాలా విశాల హృద‌యం కావాలి.  

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.