సంతోషంగా ఉండే స్నేహితులు విజయ్ రాజారాం(మురళి శర్మ), ఆనంద్ ప్రసాద్(ఆనంద్) ల మధ్య చిచ్చుపెడతాడు శాంతారామ్. బిజినెస్ లో తనను మోసం చేశాడని భ్రమపడ్డ విజయ్, ఆనంద్ ను దూరం చేసుకుంటాడు. కట్ చేస్తే ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఆ పరిస్థితి అలాగే ఉంటుంది.
ఇంతలో మిల్లు అమ్మకం కోసం సంతకం అవసరం కావటంతో ఇష్టం లేకపోయినా తన చెల్లెలి కొడుకు కార్తీక్ (సుశాంత్) ను ఇంటికి రప్పిస్తాడు విజయ్. తన అమ్మ అంటే అసహ్యాం పెంచుకున్న మావయ్య ఇంట్లోని సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తూ వారికి దగ్గరవుతుంటాడు కార్తీక్. కానీ, ఇంతలో కార్తీక్ అసలు తన మేనల్లుడు కాదనే విషయం తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు? విజయ్ ఇంటికి ఎందుకు వస్తాడు? ఆయన కష్టాలను ఎందుకు దూరం చేస్తాడు? అపార్థాలతో దూరమైన విజయ్, ఆనంద్ లు ఎలా ఒకటవుతారు? ఇలా సాగే కథ....
కెరీర్ లో డీసెంట్ హిట్ కొట్టేందుకు రెండేళ్లపైగానే గ్యాప్ తీసుకున్నాడు అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ సుశాంత్. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ నాగ సుశాంత్ దర్శకత్వంలో ఆటాడుకుందాం రా అంటూ మన ముందుకు వచ్చేశాడు. ఈ రోజే రిలీజైన ఈ చిత్రంతో సుశాంత్ హిట్ అందుకున్నాడా? రివ్యూ చూద్దాం.
విశ్లేషణ:
కథను బట్టి తర్వాత ఏం జరగబోతుందో ఎవరైనా ఊహించి చెప్పేయగలరు. అలాంటి స్టోరీని ఇంకా దారుణంగా డీల్ చేశాడు దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి. కథ, కథనాలతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు అల్లుకుంటూ పోయాడు. బకారాలను వాడుకుని తానంటే అసహ్యించుకునే వాళ్ల ఇంట్లో హీరో తిష్ట వేసే సినిమాలు బోలెడ్డన్నీ వచ్చాయి. ఆ కోవలోని సినిమా అయినా మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ లేకుండా సాగిపోతుంది.
జస్ట్ చిల్ కుర్రాడి క్యారెక్టర్ లో సుశాంత్ బాగానే నటించాడు. డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో కమర్షియల్ హీరోలా తాను చేయగలనని నిరూపించాడు. అయితే నటనలో మాత్రం మరింత పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. ఇక హీరోయిన్ సోనమ్ భజ్వా గ్లామర్ డోస్ ను కుమ్మరించింది. నటనలో బిలో యావరేజ్ మార్కులు వేయించుకుంది. సినిమాలో మేజర్ ఎస్సెట్ ఏంటంటే... నాగ చైతన్య, అఖిల్ ల కొమియోలు. సినిమాలో అవి వచ్చినప్పుడు ప్రేక్షకుడు కాస్త హ్యాపీగా ఫీలవుతాడు. ఇక టైమ్ మెషీన్ నేపథ్యంలో వచ్చే కొన్ని కామెడీ సీన్లు. పృథ్వీ, ఝాన్సీ, పోసాని కితకితలు ఫర్వాలేదనిపిస్తాయి. కానీ, అసలు కథే డల్ గా ఉండటంతో అది పెద్దగా పండినట్లు కనిపించదు. బ్రహ్మానందం పాత్ర టోటల్ గా సిలల్ీగా అనిపిస్తుంది. మిగతా పాత్రలు ఫరిధి మేరలోనే నటించాయి.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే... అనూప్ నీరసమైన ట్యూన్స్, అదే స్థాయిలో బ్యాగ్రౌండ్ ఇచ్చాడు. టైం మెషీన్ కోసం వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అస్సలు బాగోలేవు. ఉన్నంతలో ధాశరథి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపించింది. ప్రొడక్షన్ విలువలు ఓకే.
ఫ్లస్ పాయింట్లు:
ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు
టైమ్ మిషన్ ఎపిసోడ్
నాగ చైతన్య, అఖిల్ తళుక్కున్న మెరవటం
మైనస్ పాయింట్లు:
కథ, కథనం
మ్యూజిక్
తీర్పు:
గత చిత్రాలతో పోలిస్తే నాగేశ్వర్ రెడ్డి అందించిన వీకెస్ట్ కథ, కథనం ఇదే. సగటు ప్రేక్షకుడు కూడా సంతృప్తి పడలేని స్థాయిలో సినిమా అందించాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడా నవ్వించినా అది ఎందుకు పనికిరాలేదు. పోనీ ఎమోషనల్ గా అయినా చూపించాడా అంటే అదీ లేదు.
చివరగా... రోటీన్ కామెడీతో బలవంతంగా నవ్వించేందుకు చేసిన ప్రయత్నం ఆటాడుకుందాం రా.