మనమంతా రివ్యూ | Manamantha review

Teluguwishesh మనమంతా మనమంతా Manamantha telugu movie review. Product #: 76854 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    మనమంతా

  • బ్యానర్  :

    వారాహి చలన చిత్రం

  • దర్శకుడు  :

    చంద్ర‌శేఖ‌ర్ యేలేటి

  • నిర్మాత  :

    సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి

  • సంగీతం  :

    మహేష్ శంకర్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    రాహుల్ శ్రీ వాస్తవ్

  • ఎడిటర్  :

    జీవీ చంద్రశేఖర్

  • నటినటులు  :

    మోహన్ లాల్, గౌతమీ, విశ్వంత్, రైనా రావు, అనిషా ఆంబ్రోస్, గొల్లపూడి మారుతి రావు, ఊర్వశి, తారకరత్న తదితరులు

Manamantha Movie Review

విడుదల తేది :

2016-08-05

Cinema Story

కథ

సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తూ.. మేనేజర్ గా ప్రమోషన్ ఆశిస్తున్న మిడిల్ క్లాస్ వ్యక్తి సాయిరాం (మోహన్ లాల్).  సగటు మధ్యతరగతి కుటుంబానికే చెంది గంపెడు ఆశలు ఉన్నా ఉస్సురూమంటూ జీవితం గడిపే ఇల్లాలు గాయత్రి (గౌతమి). సాఫీగా సాగిపోయే లైఫ్ ను ఓ అమ్మాయి ప్రేమకోసం అగమ్య గోచరంగా మార్చుకునే యువకుడు అభిరామ్ (విశ్వాంత్), ఏ కల్మషం లేకుండా తనతోపాటు తన చుట్టూ ఉన్న వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే అమ్మాయి మహిత (బేబీ రైనా రావు) ఈ నలుగురి చుట్టూ తిరిగేదే మనమంతా. అనుకోకుండా ఒక ట్విస్ట్ తో వాళ్ల లైఫ్ లో చిక్కులు మొదలౌతాయి. మరి వాటిని వాళ్లు ఎలా పరిష్కరించుకుంటారు అన్నదే కథ. 

cinima-reviews
మనమంతా

ఐతే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఓ సినిమా, అనుకోకుండా ఒకరోజు మంచి సస్పెన్స్ డ్రామా, ఆపై ఒక్కడున్నాడు అదో వెరైటీ కథ, సాహసం ఆ మూడింటికి అస్సలు సంబంధం లేని సినిమా. మరి తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకునేలోపు కంప్లీట్ యాక్టర్, మళయాళ స్టార్ హీరోనే ఏకంగా తెలుగులోకి రప్పించాడు చంద్రశేఖర్ యేలేటి. మోహన్ లాల్ తోపాటు చాలా గ్యాప్ తర్వాత గౌతమి కూడా ఇందులో నటించింది. మరి అంచనాలు పెరిగిపోవా? అదే మనమంత. హ్యాపీగా బతికే నాలుగు జీవితాల్లోకి అనుకోని రూపంలో కష్టాలు వస్తే ఏమౌతుంది అన్న కథాంశమని ట్రైలర్ లో అల్రెడీ చూపించేశాడు. మరి అసలు కథ అదేనా? అదే అయితే ఎలా ఉంది. తెలుసుకోవాలంటే రివ్యూ చూడాల్సిందే.

విశ్లేషణ
కమర్షియల్ హంగులు లేకుండా విభిన్న కథనాలను అందిస్తాడనే పేరు ఉన్న యేలేటి సినిమాల పట్ల ప్రేక్షకులకు మంచి గురి ఉంది. ఆయన సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అనే అంచనాలతో వచ్చే ప్రేక్షకుడిని అస్సలు డిస్సపాయింట్ చేయడు. మనమంతా విషయంలో కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. మనిషి జీవితంలో మనషుల తత్వాలు నాలుగు పాత్రలతో చెప్పటం ఈ కథ ప్రత్యేకత. అయితే ఎటోచ్చి నారేషన్ నిదానంగా నడవటం బోర్ కొట్టించే అంశం. గత సినిమాల తరహాలో స్క్రీన్ ప్లే లో అంత వేగం చూపించలేకపోయాడు. దానికి కారణం సున్నితమైన కథ అని అనుకోవచ్చు. ఈ విషయంలో యేలేటి నుంచి ఎలిమెంట్స్ ఆశించే అభిమానులు కాస్త నిరాశ చెందక తప్పదు.

మోహన్ లాల్, బేబీ రైనా ఈ రెండు పాత్రలకే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యేది. నటనలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మోహన్ లాల్ సాయిరాం పాత్రలో ఒదిగిపోయాడు. ప్రారంభంలో డబ్బింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ రాను రాను అలవాటు అయిపోతుంది. మిడిల్ క్లాస్ మ్యాన్ జీవితంలో పడే కష్టాలు తన హావ భావాలతో అద్భుతంగా పలికించాడు. ఇక తర్వాత బేబీరైనా గురించి ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా మోహన్ లాల్ తర్వాత మార్కులు పడేది రైనాకే. ముఖ్యంగా ఎమోషన్ సీన్లలో చిత్రంలోని మిగతా నటీనటులను సైతం డామినేట్ చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇక గాయత్రిగా గౌతమి నటన బాగుంది. మిడిల్ క్లాస్ మహిళగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అయితే ఆమె నుంచి ఇంకా ఎక్కువే ఆశించొచ్చు అనిపిస్తోంది. వీరి తర్వాత గౌతమి స్నేహితురాలి పాత్రలో ఊర్వశి అలరించింది. ఆమె కనిపించినప్పుడల్లా నవ్వులు పూస్తాయి. లవర్ గా విశ్వంత్ తన పాత్రకు న్యాయం చేశాడు. అనీషా ఆంబ్రోస్ అతితో చంపింది. గొల్లపూడి మారుతిరావు, వెన్నెలకిశోర్, హర్షవర్ధన్, నాజర్ లిమిట్ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నికల్ గా ఈ సినిమాకు మెయిన్ బలం డైలాగులు. సున్నితమైన కథాంశం చెప్పినప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఊహించుకోలేం. కాబట్టి ఆ స్థానంలో సినిమాను నిలబెట్టేది మాటలే. రచయితగా యేలేటి అందించిన కథ, దానికి రవిచంద్ర తేజ అందించిన మాటలు చక్కగా కుదిరాయి. ‘బ్రతకడం నేర్చుకున్నా అనుకున్నా.. మనిషిలా బ్రతకడం మరిచిపోయా’’ అంటూ వచ్చే డైలాగ్ ఒక్క మోహన్ లాల్ పాత్రకే కాకుండా, సమాజంలో మనిషి ఎలా బ్రతుకుతున్నాడో చెప్పేశాడు. మిగతా టెక్నీషియన్స్ కూడా సినిమాకు అండగా నిలిచారు. బోరింగ్ లవ్ స్టోరీ, వాటిలో వచ్చే రెండు పాటలూ సో సోగా ఉంటాయి. కానీ, సినిమాకు సంబంధించి రెండు థీమ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మహేష్ శంకర్ మంచి మార్కులు కొట్టేశాడు. రాహుల్ శ్రీవాత్సవ్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా ఉంది. కనువిందు చేస్తుంది. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికి లేదు.

ఫ్లస్ పాయింట్లు

కథ

మోహన్ లాల్, బేబీ రైనా

క్లైమాక్స్

గుర్తుండిపోయే ‘ఆశల..’ సాంగ్ 

.

 

మైనస్ పాయింట్లు

కమర్షియల్ అంశాలు లేకపోవటం, 

బోరింగ్ లవ్ ట్రాక్,

స్లో నారేషన్

తీర్పు

 

వేర్వేరు కథలతో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ వాటిలో కాస్త కన్ప్యూజన్ ఎక్కడో దగ్గర మనకు కనిపించేది. కానీ, మనమంతాలో అలాంటిది ఎక్కడా లేకుండా నీట్ గా కథ ముందుకు సాగుతుంది. కథ, దానికి తగ్గట్టు ప్రేక్షకుడు ఊహించని క్లైమాక్స్ తో కట్టిపడేశాడు. ఎంతలా అంటే అందులో లీనం అయి మనల్ని మనం ఊహించుకునేంతలా. అయితే చిన్న క‌మర్షియల్ ఎలిమెంట్ కూడా లేకపోవటం ఈ చిత్రానికి పెద్ద మైనస్ అయినా కథలను నమ్ముకుని సినిమాలకు వెళ్లే ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరచదు.

చివరగా... మనమంతా మనందరి కథ.

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.