Sumanth Ashwin Right Right Movie Review

Teluguwishesh రైట్ రైట్ రైట్ రైట్ Get The Complete Details of Right Right Movie Review. Starring Sumanth Ashwin, Prabhakar and Pooja Jhaveri in the lead roles. directed by Manu. Produced by Vamsi Krishna Reddy. For More Details Visit Teluguwishesh.com Product #: 75433 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రైట్ రైట్

  • బ్యానర్  :

    శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్

  • దర్శకుడు  :

    మను

  • నిర్మాత  :

    జె.వంశీకృష్ణ

  • సంగీతం  :

    జె.బి.

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    శేఖర్.వి.జోసెఫ్

  • ఎడిటర్  :

    ఎస్.బి.ఉద్దవ్

  • నటినటులు  :

    సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి, నాజర్ తదితరులు.

Sumanth Ashwin Right Right Movie Review

విడుదల తేది :

2016-06-10

Cinema Story

తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ జాబ్ లోకి చేరుతాడు రవి(సుమంత్ అశ్విన్). గవిటి రూట్ లో రవికి డ్యూటీ ఇస్తారు. ఆ రూట్ లో ఒక్క ట్రిప్ మాత్రమే బస్ వుంటుంది. ఇక ఈ గవిటి బస్సు డ్రైవర్ శేషు(ప్రభాకర్). ఆ గ్రామానికి వెళ్లేది ఈ ఒక్క బస్సే కావడంతో ఈ డ్రైవర్ మరియు కండక్టర్ లు ఆ ఊరు ప్రజలకు బాగా దగ్గరవుతారు. ఇదే బస్ లో రెగ్యులర్ వచ్చే కళ్యాణి(పూజా జవేరి)తో రవి ప్రేమలో పడతాడు. కళ్యాణి గవిటి సర్పంచ్ విశ్వనాథ్ గారి అమ్మాయి.

వీరి జీవితం ఇలా కొనసాగుతూ వుండగా ఓరోజు రాత్రి రవి బస్ కింద ఓ వ్యక్తి పడి గాయపడతాడు. ఏమైన జరిగితే కేసు తమ మీదకొస్తుందన్న భయంతో ఆ గాయపడిన వ్యక్తిని అదే రూట్ లో వస్తున్న జీపు డ్రైవర్ కు అప్పగించి, హాస్పిటల్లో చేర్చమని చెప్పి, రవి-శేషులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ గాయపడిన వ్యక్తి ఊరి బయట లోయలో శవమై కనిపిస్తాడు. అతను విశ్వానథ్ గారి అబ్బాయి దేవా అని తెలుస్తుంది. ఈ నేరం అనుకోకుండా రవి మీద పడుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు? రవి మీదకు నేరం ఎలా వచ్చింది? చివరకు ఈ సమస్యలన్నింటి నుంచి రవి ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథాంశం.

cinima-reviews
రైట్ రైట్

‘కేరింత’ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం ‘రైట్ రైట్’. కాలకేయ ప్రభాకర్, సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు మను దర్శకత్వం వహించాడు. ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
సుమంత్ అశ్విన్ తొలిసారిగా చాలా బరువైన పాత్రలో నటించాడు. తన పాత్ర మేరకు పర్వాలేదనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో సుమంత్ అశ్విన్ యాక్టింగ్ బాగుంది. ఇక డ్రైవర్ గా ప్రభాకర్ తన పాత్రకు న్యాయం చేసాడు. చాలా సెటిల్డ్ క్యారెక్టర్ అయినప్పటికీ.. తనదైన శైలిలో మెప్పించాడు. ఇక పూజా జావేరి పాత్ర నిడివి తక్కువైన బాగా నటించింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సరదా సరదాగా సాగుతుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్ తో కొనసాగగా... ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో లవ్, ఎంటర్ టైన్మెంట్ కాకుండా థ్రిల్లింగ్ కాన్సెప్టుతో కొనసాగుతుంది. మొత్తానికి పర్వాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:
‘రైట్ రైట్’ సినిమా మలయాళం రీమేక్. సినిమా అంతా కూడా కాస్త కేరళ వాసన కొడుతుంది. తెలుగు నేటివిటి తక్కువయ్యింది. ఇక సుమంత్ అశ్విన్, ప్రభాకర్ ల పాత్రలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమా ప్రారంభమైన క్షణం చాలా స్లోగా సాగుతుంది. స్లో నెరేషన్ తో చూసే ప్రేక్షకులు చాలా బోర్ ఫీలవుతారు. అక్కడక్కడ కాస్త లవ్ ట్రాక్ వున్నప్పటికీ సినిమాలో వేగం లేదు. ఇక సెకండ్ హాఫ్ లవ్, కామెడీ ట్రాక్ తగ్గిపోయి.. పూర్తిగా ఎమోషనల్ జోనర్ లోకి వెళుతుంది. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ లేకుండా సాగుతూ వుంటుంది. సెకండ్ హాఫ్ కూడా స్లో నెరేషన్ వుండటంతో ఆడియన్స్ కు బాబోయ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. పైగా సినిమాలో చెప్పుకోదగ్గ పెద్దగా ట్విస్టులేమి లేవు. మాస్ ఆడియన్స్ నచ్చే అంశాలు ఒక్కటి కూడా లేవు.

సాంకేతికవర్గం పనితీరు:
శేఖర్ వి.జోసెఫ్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరి అందాలను చాలా చక్కగా, అందంగా చూపించాడు. విజువల్స్ పరంగా చాలా బాగుంది. జె.బి. సంగీతం పర్వాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. దర్శకుడిగా మను పర్వాలేదనిపించాడు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. దాదాపు 15 నిమిషాలు ఎడిటింగ్ చేసిన... సినిమాలో వేగం పెరిగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘రైట్ రైట్’: వేగంలేని ఆర్డినర్ బస్.