Suriya 24 Movie Telugu Review

Teluguwishesh 24 24 Get The Complete Details of Suriya 24 Telugu Movie Review. Starring Suriya, Samantha, Nithya Menen, Ajay, Saranya Ponvannan, Girish Karnad, Sathyan. directed by Vikram K Kumar, Music by A.R. Rahman, Producer Suriya. For More Details Visit Teluguwishesh.com Product #: 74441 3.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    24

  • బ్యానర్  :

    గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్

  • దర్శకుడు  :

    విక్రం కె కుమార్

  • నిర్మాత  :

    సూర్య

  • సంగీతం  :

    ఎ.ఆర్.రెహమాన్

  • సినిమా రేటింగ్  :

    3.753.753.75  3.75

  • ఛాయాగ్రహణం  :

    కె.తిరునాపుక్కరసు

  • ఎడిటర్  :

    ప్రవీణ్ పూడి

  • నటినటులు  :

    సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్ తదితరులు

Suriya 24 Movie Telugu Review

విడుదల తేది :

2016-05-06

Cinema Story
24

శివకుమార్, ఆత్రేయ కవల పిల్లలు(సూర్య). శివకుమార్ పెద్ద సైంటిస్ట్. టైంను కంట్రోల్ చేసే ఓ వాచ్ ను కనిపెడతాడు. దానికి 24 అనే పేరు పెడతాడు. టైంను కంట్రోల్ చేసే వాచ్ తో ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఆత్రేయ.. తన తమ్ముడు శివకుమార్ మరియు అతని భార్య ప్రియ(నిత్యామీనన్)లను చంపేస్తాడు. శివకుమార్ చనిపోయే సమయంలో తన కొడుకుని ట్రైన్లో ఓ యువతి చేతిలో పెట్టి ప్రాణాలు కోల్పోతారు. ప్రమాదానికి గురై ఆత్రేయ కోమాలోకి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే 26 ఏళ్ల తర్వాత శివకుమార్ కొడుకు పెద్దవాడవుతాడు. వాడే మణి(సూర్య). సత్య(సమంత)ను చూసి మణి ప్రేమలో పడతాడు. అనుకోకుండా మణికి 24 వాచ్ దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు 24 వాచ్ వల్ల మణికి ఎదురైన సమస్యలేంటి? 24 వాచ్ ఆత్రేయ సొంతం అయ్యిందా? చివరకు ఆత్రేయ ఏమవుతాడు? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద 24 సినిమా చూడాల్సిందే.

cinima-reviews
24

తమిళ స్టార్ హీరో సూర్య మూడు విభిన్న పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘24’. ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో భారీ బడ్జెట్ తో సూర్య నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో సూర్య సరసన నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా నేడు(మే 6) విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా వుందో, ఎలాంటి విజయం సాధించనుందో ఒకసారి చూద్దామా!

ప్లస్ పాయింట్స్:
‘24’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఇద్దరు ప్లస్ పాయింట్స్. ఒకరు హీరో సూర్య, మరొకరు దర్శకుడు విక్రమ్.కె.కుమార్. దర్శకుడి గురించి కింద సాంకేతికవర్గం విభాగంలో చర్చించుకుందాం. ముందుగా సూర్య గురించి మాట్లాడుకుంటే.... ఇప్పటివరకు సూర్య చేసిన సినిమాల్లో అన్నింటికంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ‘24’లో చేసాడని చెప్పుకోవచ్చు. మూడు విభిన్న పాత్రలలో అదరగొట్టేసాడు. ఒక్కో పాత్రలో విభిన్నత, వైవిధ్యం కనబరిచాడు. ముఖ్యంగా శివకుమార్ పాత్రలో సూర్య జీవించేసాడు. ఒక సైటింస్ట్ హవాభావాలు, ఆలోచించే విధానం చాలా చక్కగా కనబరిచాడు. ఇక విలన్ గా చాలా వెరైటీగా చేసాడు. ఇక మణి పాత్రలో మరోసారి అమ్మాయిల మనసు దోచుకున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘24’ సినిమాను సూర్య అన్ని తానై తన భుజాలపై నడిపించాడని చెప్పుకోవచ్చు.

నిత్యామీనన్ తన పాత్రలో జీవించేసింది. సూర్యతో నిత్యామీనన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సమంత క్యూట్ లుక్స్ బాగున్నాయి. గ్లామర్ పరంగా సమంత ఆకట్టుకుంది. ఇక అజయ్, శరణ్య తదితరులు వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు.

సినిమా ప్రారంభమైన క్షణం నుంచి ఒక ఉత్కంఠను క్రియేట్ చేసారు. సినిమా చూసే ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కూడా మైండ్ థింకింగ్ ప్రోసెస్ లో పెట్టి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రతి సీన్ అద్భుతం. ముఖ్యంగా సైంటిస్ట్ పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇక కమర్షియల్ సినిమాకు కావాలసిన అన్ని హంగులు ఇందులో వుండటం విశేషం. లవ్, రొమాన్స్, యాక్షన్, థ్రిల్లింగ్, ఫైట్స్, ఎమోషనల్, కామెడీ, మాస్... ఇలా అన్ని అంశాలతో ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్:
‘24’ సినిమాకు రన్ టైం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అలాగే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా నెమ్మదిగా కొనసాగుతుంది. అలాగే పూర్థిస్థాయి యాక్షన్, మాస్, కామెడీ అంశాలను కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమా కాస్త కొత్తగా అనిపించవచ్చు.

సాంకేతికవర్గం పనితీరు:
‘24’ సినిమాకు సాంకేతికవర్గం బాగా ప్లస్ అయ్యింది. మొదటగా దర్శకుడు విక్రమ్.కె.కుమార్. ‘మనం’ వంటి బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ తర్వాత ‘24’ వంటి ప్రయోగాత్మక సినిమా తీయడం పెద్ద ఛాలెంజ్. కానీ దర్శకుడు పర్ఫెక్ట్ స్టోరీలైన్ తో ‘24’ ను రూపొందించాడు. అద్భుతమైన స్ర్కీన్ ప్లే తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. సినిమాలోని క్యారెక్టర్లను చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినప్పటికీ మ్యాజిక్ చేసైన మెప్పించగలిగాడు. దర్శకుడిగా విక్రమ్.కె.కుమార్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు.

కె.తిరునాపుక్కరసు అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. సినిమాకు చాలా గ్రాండియర్ ను తెచ్చింది. విజువల్స్ పరంగా 24 సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ వర్క్ బాగుంది. విజువల్స్ ఎఫెక్ట్స్ సూపర్బ్. ఆర్ట్ వర్క్ బాగుంది.

ఇక హీరోగా అదరగొట్టిన సూర్య... ఈ సినిమాకు నిర్మాతగా మారి, తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. సినిమా అంతా కూడా చాలా గ్రాండియర్ లుక్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:
24: మైండ్ కు పనిచెప్పే సినిమా


- Sandy