సినిమా ప్రమోషన్లో ‘శౌర్య’ టీం చెప్పినట్లుగానే ‘జరిగిన ప్రతి సంఘటన వెనుక మూడు కథలుంటాయి.. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసినవాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగేది’ అనే కాన్సెప్ట్ చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది.
ఇక ‘శౌర్య’ కథలోకి వెళితే... శౌర్య(మంచు మనోజ్) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. అలాంటి శౌర్య జీవితంలో నేత్ర(రెజీన కసాండ్ర) ఎంట్రీ ఇస్తుంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ వీరి ప్రేమను పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడం జరుగుతుంది. సీన్ కట్ చేస్తే... శివరాత్రి సందర్భంగా ఆలయంలో జాగారం చేయడానికి శౌర్య-నేత్రలు వస్తారు. అక్కడ నేత్రపై దాడి జరుగుతుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నేత్రను హాస్పిటల్లో చేర్చుతారు. దీంతో శౌర్యను ముద్దాయిగా జైల్లో వేస్తారు. ఈ కేసును డీల్ చేయడానికి కృష్ణప్రసాద్(ప్రకాష్ రాజ్) రంగంలోకి దిగుతాడు. అక్కడే అసలు ట్విస్ట్ ఇస్తాడు శౌర్య. అసలు నేత్ర ఎవరు? నేత్ర మీద దాడి ఎందుకు జరిగింది? శౌర్యను ఎందుకు అరెస్ట్ చేసారు? శౌర్య ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? నేత్ర ప్రాణాలతో బయటపడ్డదా లేదా? వీరి ప్రేమకథలో వచ్చిన మలుపులు ఏంటి? చివరకు ఏం జరిగింది అనే అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘శౌర్య’ సినిమా చూడాల్సిందే.
దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన తాజా చిత్రం ‘శౌర్య’. బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై శివకుమార్ మల్కాపురం నిర్మించారు. ఈ చిత్రానికి వేదా.కె సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మనోజ్ చాలా సింపుల్, క్లాసీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ప్రారంభించారు. ఇక మనోజ్ రివీల్ చేసే ఇంటర్వెల్ ట్విస్ట్ అందరినీ థ్రిల్ చేసే విధంగా వుంది. దీంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో చివరి 30 నిమిషాలు హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి వచ్చిన ట్విస్టులన్నింటిని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వుంటారు. మనోజ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. అలాగే కోర్టు సీన్ మరియు అక్కడ చెప్పే పులికథ బాగుంది.
మైనస్ పాయింట్స్:
‘శౌర్య’ సినిమాలో మనోజ్ చాలా లావుగా కనిపిస్తాడు. ఆ పాత్రకోసం అంతగా లావు అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొదలైన కాసేపు తర్వాత చాలా స్లోగా సాగుతుంది. ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. కథ అస్సలు ముందుకెళ్లదు. మనోజ్-రెజీనాల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఫీల్ ను కలిగించదు. సెకండ్ హాఫ్ లో చివరి 30నిమిషాలు తప్ప.. మిగతా పార్ట్ అంతా కూడా బోర్ గా ఫీల్ అయ్యే విధంగా వుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు, మనోజ్ రెగ్యులర్ సినిమాలను ఇష్టపడే అభిమానులకు ‘శౌర్య’ చిత్రం కాస్త నచ్చకపోవచ్చు. మొత్తానికి ‘శౌర్య’ పర్వాలేదనిపించేలా వుంది.
సాంకేతికవర్గం పనితీరు:
ఇప్పటివరకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తొలిసారిగా ఓ థ్రిల్లర్ జోనర్ ద్వారా ‘శౌర్య’ను రూపొందించారు. స్టోరీ లైన్ బాగుంది కానీ స్ర్కీన్ ప్లే విషయంలో దెబ్బ తిన్నట్లుగా కనిపిస్తుంది. కథనం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. అలాగే నటీనటుల నుంచి సరైన పర్ఫార్మెన్స్, ఫీల్, ఎమోషన్స్ ను సరైన విధంగా చూపెట్టలేకపోయాడు. గోపిమోహన్ అందించిన రచనా సహాకారం బెటర్ గా అనిపించలేదు. మల్హర్ భట్ జోషి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. వేదా.కె. అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. డైలాగ్స్ జస్ట్ ఓకే. మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా:
‘శౌర్య’: పర్వాలేదనిపించే థ్రిల్లర్.