Krishnashtami Movie Review

Teluguwishesh కృష్ణాష్టమి కృష్ణాష్టమి Krishnashtami Telugu Movie Review Product #: 72528 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కృష్ణాష్టమి

  • బ్యానర్  :

    శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    వాసు వర్మ

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    దినేష్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    యువరాజ్

  • ఎడిటర్  :

    వర్మ

  • నటినటులు  :

    సునీల్, డింపుల్ బొపాడే, నిక్కీ గర్లానీ, అషుతోష్ రానా, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం, తులసి తదితరులు

Krishnashtami Movie Review

విడుదల తేది :

2016-02-19

Cinema Story

చిన్న‌త‌నం నుండి త‌న కుటుంబానికి దూరంగా యూ.ఎస్‌లో ఉంటాడు కృష్ణ‌వ‌ర ప్ర‌సాద్‌(సునీల్‌). అయితే త‌న కుటుంబ స‌భ్యులను క‌ల‌వాల‌నే ఆలోచ‌న‌తో ఇండియాకి రావాల‌నుకున్న కృష్ణ‌ప్ర‌సాద్‌ను రావొద్ద‌ని చెప్తారు కుటుంబ స‌భ్యులు. అయితే వారి మాట‌ను ప‌క్క‌న పెట్టి ఇండియాకు బ‌య‌లుదేరుతాడు ప్ర‌సాద్‌. ఈ జ‌ర్నీలో ప‌ల్ల‌వి( నిక్కి గిల్రాని)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఈ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఈ రొమాంటిక్ ఫీల్ నుండి బ‌య‌ట‌కి రాక‌ముందే ప్ర‌సాద్ వ‌చ్చే ఫ్లైట్ ఇండియాలో లాండ్ అయిపోతుంది.ఎర్‌పోర్ట్ నుండి బ‌య‌ట అడుగుపెట్టిన ప్ర‌సాద్‌పై ఎటాక్ జ‌రుగుతుంది. ఈ ఎటాక్‌లో ప్రాసాద్‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో అజ‌య్ కుమార్‌(అజ‌య్‌) కోమాలోకి వెళిపోతాడు. అస‌లు ప్ర‌సాద్ ఎవ‌రు.. ప్ర‌సాద్‌పై ఎందుకు ఎటాక్ జ‌రుగుతుంది. ప్ర‌సాద్ కుటుంబ స‌భ్యులు ప్ర‌సాద్‌ను రావొద్దు అన‌టానికి కార‌ణం ఏంటి. ప్ర‌సాద్‌పై ఎటాక్ జ‌రిగిన స‌మ‌యంలో అజ‌య్ ఎందుకు అడ్డుప‌డ్డాడు.. ఇటువంటివి తెలుసుకోవాలంటే సినిమాని చూడాల్సిందే..

cinima-reviews
కృష్ణాష్టమి

చిన్నప్పుడే అమ్మానాన్నను పోగొట్టుకున్న కృష్ణవర ప్రసాద్ ( సునీల్ )ను పెదనాన్న రామచంద్ర ప్రసాద్ ఫారిన్లో చదివిస్తుంటాడు. అక్కడే పెరిగి పెద్దవాడైన కృష్ణవర ప్రసాద్ వీడియో గేమ్ డిజైనర్గా ఉద్యోగం చేస్తుంటాడు. 18 ఏళ్లుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఎలాగైన ఇండియా రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ పెదనాన్న మాత్రం కృష్ణ ఇండియాకు రాకుండా అడ్డు పడుతుంటాడు. అంతేకాదు అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి కూడా కుదురుస్తాడు. దీంతో ఎలాగైనా ఇండియా రావాలనుకున్న కృష్ణ పెదనాన్నకు తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు.

కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరోప్లో దిగిన కృష్ణ, అక్కడ పల్లవి(నిక్కి గల్రానీ)ని తొలి చూపులోనే ప్రేమించి, తిరిగి ఫ్లైట్ ఎక్కేలోపు తనని కూడా ప్రేమలో పడేస్తాడు. ఇక కృష్ణ వరప్రసాద్ ఇండియాలో దిగాక అసలు కథ మొదలవుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కృష్ణకు పరిచయం అయిన డాక్టర్ అజయ్ కుమార్(అజయ్) ఎయిర్ పోర్ట్లో ఓ హత్య చూసి భయపడిపోతాడు. దాంతో అతనిని ఇంటికి చేర్చే బాధ్యత కృష్ణ తీసుకుంటాడు. కృష్ణ, అజయ్లు ఇంటికి వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్లో హత్య చేసిన వాళ్లే వీరి మీద మరోసారి దాడి చేస్తారు. ఈ దాడిలో అజయ్ గాయపడతాడు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబానికి తెలియజేయడానికి వెళ్లిన కృష్ణ, అక్కడి పరిస్థితుల కారణంగా నిజం చెప్పలేక తానే అజయ్గా ఉండిపోవాల్సి వస్తుంది.

ఇంతలో ఆ ఇంటి పెద్ద తన కూతురి(డింపుల్ చోపడే)ని అజయ్కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్గా తాను చెపుతున్న అబద్దానికి ముగింపు పలకాలనుకుంటాడు. ఉత్తరం రాసిపెట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో కొంతమంది మళ్లీ కృష్ణను చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు..? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి..? కృష్ణను అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు..? ఈ సమస్య లన్నింటికి కృష్ణ ఎలా ముగింపు పలికాడు అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:
కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సునీల్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, బిల్డప్ షాట్లతో మాస్ హీరో ఇమేజ్ కోసం బాగానే కష్టపడ్డాడు. చాలా వరకు బాగానే అనిపించినా సునీల్ ఇమేజ్ కారణంగా కొన్ని చోట్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు. తన మార్క్ కామెడీ, డ్యాన్స్లతో మాత్రం మరోసారి ఆకట్టుకున్నాడు. హీరోయిన్ లు గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నారు. ఎప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించే ముఖేష్ రుషి, పాజిటివ్ పాత్రలోనూ మెప్పించాడు. అషుతోష్ రాణా విలన్గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయింది. ఇక సినిమా కామెడీ బాగానే పండింది. సినిమాటోగ్రఫి కూడా బాగా ఉంది.

మైనస్ పాయింట్స్:
సునీల్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా అయినా కానీ రొటీన్ కథనే ఎంచుకున్నారు. ఇక సినిమాలొ పేరుకు ఇద్దరు హీరోయిన్లు ఉన్నా కానీ నటనలో మాత్రం బాగా బ్యాడ్ అనిపించారు.  ఫస్ట్ హాఫ్ లో పల్లవిజం కాన్సెప్ట్తో నిక్కి గల్రానీ నవ్వించే ప్రయత్నం చేసినా అది బాద్షా సినిమాలో కాజల్ పాత్రకు స్పూఫ్లా అనిపించింది.  సెల్పీ పిచ్చి ఉన్న క్యారెక్టర్లో కనిపించిన బ్రహ్మనందం మరోసారి నిరాశపరిచాడు. ఫస్ట్ హాఫ్ మరీ బోరింగ్ గా ఉండటంతో ఆడియన్ కు సినిమా మీద ఇంట్రస్ట్ రావడం లేదు. ఇక సినిమాలో పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.

సాంకేతిక నిపుణులు :
జోష్ సినిమాతో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా దర్శకుడు వాసు వర్మ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడు. అయితే రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. హీరో విలన్ ఇంట్లో ఉండి వాళ్లను మార్చటం అనే రొటీన్ కాన్సెప్ట్నే మరోసారి ఎంచుకున్న వాసువర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫస్ట్ హాఫ్  కాస్త సోలోగా నడించినా సెకండాఫ్లో మాత్రం వేగంగా కథ నడిపించాడు.
ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో(అల్లు అర్జున్) కోసం రాసుకున్న కథను కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం అంతగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. యూరప్ అందాలతో పాటు ఇండియాలోని లోకేషన్స్ను కూడా చాలా బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం పరవాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు.

చివరగా... కృష్ణాష్టమి: రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్