Lacchimdeviki O Lekkundi | Naveen chandra | Lacchimdeviki O Lekkundi Review | Lavanya tripati

Teluguwishesh లచ్చిందేవికి ఓ లెక్కుంది లచ్చిందేవికి ఓ లెక్కుంది Get The Complete Details of Lacchimdeviki O Lekkundi Telugu Movie Review. The Latest Telugu Movie Lacchimdeviki O Lekkundi featuring Naveen Chandra, Lavanya Tripathi Among Others.Directed by Jagadish and Produced by Sai Prasad. Music Composed by M. M. Keeravani. For More Details Visit Teluguwishesh.com Product #: 72108 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లచ్చిందేవికి ఓ లెక్కుంది

  • బ్యానర్  :

    మయూఖ క్రియేషన్స్

  • దర్శకుడు  :

    జగదీష్ తలశిల

  • నిర్మాత  :

    ప్రసాద్ కామినేని

  • సంగీతం  :

    యం.యం. కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    ఈశ్వర్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వర రావు

  • నటినటులు  :

    నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠీ తదితరులు

Lacchimdeviki O Lekkundi Movie Review

విడుదల తేది :

2016-01-29

Cinema Story

జనత బ్యాంకులో హెల్ప్ డెస్క్ లో నవీన్(నవీన్ చంద్ర), అదే బ్యాంకులో క్యాషియర్ గా దేవి(లావణ్య త్రిపాఠి)లు పనిచేస్తుంటారు. మొదట్లో వీరిద్దరికి అసలే పడదు. కానీ నవీన్ కు ఓసారి డబ్బు అవసరం పడుతుంది. ఏం చేయాలో తెలియని సమయంలో మహేష్(అజయ్) మరియు టీం వచ్చి జనతా బ్యాంకులో వున్న అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఫైల్ తెస్తే, దాని ద్వారా వచ్చే అమౌంట్ లో తనకు వాటా ఇస్తామని చెప్తారు. ఆ ఫైల్ కోసం దేవితో క్లోజ్ అవుతాడు నవీన్. ఆ తర్వాత ఆ ఫైల్ ను కొట్టేస్తాడు నవీన్. ప్లాన్ ప్రకారం ఆ అకౌంట్స్ ను బేస్ చేసుకొని డబ్బుకొట్టేయాలని అనుకొని చిక్కుల్లో పడతారు మహేష్, నవీన్. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. అసలు ఈ అన్ క్లైమ్డ్ అకౌంట్స్ ఏంటి? దాని వల్ల లాభమేంటి? నవీన్, మహేష్ లు ఎలా సమస్యలో పడ్డారు? వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వాటి నుంచి వీరు ఎలా బయటపడ్డారు? అనేదే ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా కథ.

cinima-reviews
లచ్చిందేవికి ఓ లెక్కుంది

‘అందాల రాక్షసి’ వంటి హిట్ చిత్రం తర్వాత నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. జగదీష్ తలశిల దర్శకత్వంలో మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ కామినేని నిర్మించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీతం అందించారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, హర్రర్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ప్లస్ పాయింట్స్:
నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది. కొన్ని కొన్ని సీన్లలో నవీన్ చంద్ర హవాభావాలు బాగున్నాయి. లావణ్య త్రిపాఠీ గ్లామర పరంగా బాగుంది. వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. అజయ్ పాత్ర డీసెంట్ గా వుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. సినిమాకు అనుకున్న కాన్సెప్ట్ బాగుంది. అకౌంట్స్ నుంచి డబ్బు కొట్టేసే కాన్సెప్ట్ కొత్తగా వుందని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని కొన్ని సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తానికి పర్వాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్:
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాలో చాలా మైనస్ పాయింట్లు వున్నాయి. నటీనటుల విషయంలో ఎవరూ కూడా వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేయలేకపోయారు. ఏదో పర్వాలేదనిపించేసారు. ఇక స్టోరీ లైన్ మొదట్లో పర్వాలేదనిపించినా.. తర్వాత మరీ బోర్ గా అనిపిస్తూ వుంటుంది. సినిమాలోని ఏ పాత్ర కూడా ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వదు. థ్రిల్లింగ్, ట్విస్ట్ లు అనిపించే సీన్లు కూడా అంతగా ఏం లేవు. ట్రైలర్లు, పోస్టర్లలో చూపించినంత హడావిడి.. సినిమాలో కనిపించలేదు. దీంతో ప్రేక్షకులు పూర్తిగా నిరాశకు గురవుతారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా... సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష అనే చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు:
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమాకు ఈశ్వర్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో పలు లొకేషన్లను అందంగా చూపించారు. యం.యం. కీరవాణి సంగీతం అందించిన పాటలు పర్వాలేదనిపించాయి. కానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్ కు బాగా సరిపోయింది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న జగదీష్ తలశిల దర్శకుడిగా నిరూపించుకోలేకపోయాడు. కథ, స్ర్కీన్ ప్లే అంశాలను సరైన విధంగా డీల్ చేయలేకపోయాడు. కొన్ని కొన్ని సీన్లలో కామెడీని పెట్టి సినిమాను లాగేయాలని ప్రయత్నించినట్లుగా అనిపిస్తోంది. మొత్తానికి జగదీష్ ఫెయిల్ అయ్యాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా:
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’: ఈ దేవి లెక్క తప్పింది.