Seethamma Andalu Ramayya Sitralu | Raj Tarun | Seethamma Andalu Ramayya Sitralu Review | Arthana

Teluguwishesh సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు Get The Complete Details of Seethamma Andalu Ramayya Sitralu Telugu Movie Review. The Latest Telugu Movie Seethamma Andalu Ramayya Sitralu starring Raj Tarun, Arthana. Music composed by Gopi Sunder,Directed by Srinivas Gavireddy and Produced by S.Shailendra Babu under the Banner of Sree Shailendra Productions. For More Details Visit Teluguwishesh.com Product #: 72107 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

  • బ్యానర్  :

    శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శ్రీనివాస్ గవిరెడ్డి

  • నిర్మాత  :

    ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి

  • సంగీతం  :

    గోపీసుందర్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    విశ్వ

  • ఎడిటర్  :

    కార్తీక్ శ్రీనివాస్

  • నటినటులు  :

    రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్ తదితరులు

Seethamma Andalu Ramayya Sitralu Movie Review

విడుదల తేది :

2016-01-29

Cinema Story

రామచంద్రాపురం అనే గ్రామంలో అల్లరిచిల్లరిగా తిరిగే కుర్రాడు శ్రీరామ్(రాజ్ తరుణ్). చిన్నప్పటి నుంచి అదే గ్రామంలో వుండే సీతామహాలక్ష్మీ(అర్తన)ను ప్రేమిస్తుంటాడు. తన ప్రేమను సీతకు చెప్పే విషయంలో ప్రతిసారీ ఫెయిల్ అవుతుంటాడు. సీత పైచదువుల కోసమని హైద్రాబాద్ వెళుతుంది. మళ్లీ కేవలం సెలవులకు మాత్రమే వచ్చే సీతకు తన ప్రేమ గురించి చెప్పడానికి శ్రీరామ్ తెగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదే క్రమంలో ఓసారి సెలవుల కోసం వచ్చిన సీత.. రామ్ కు దగ్గరవుతుంది. మొదట్లో ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత రామ్ ప్రేమను అర్థం చేసుకొని సీత కూడా ప్రేమించడం మొదలుపెడుతుంది. సీన్ కట్ చేస్తే.. ఈ విషయం సీత తండ్రికి తెలియడం.. తన కూతురిని చేసుకునేవాడు మంచి పేరున్న వాడవ్వాలని అనుకుంటాడు సీత తండ్రి. దీంతో శ్రీరామ్ ను అల్లుడిగా ఒప్పుకోకపోగా.. సీతకు వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు సీత తండ్రి. ఆ తర్వాత ఏం జరిగింది? సీత ప్రేమకోసం శ్రీరామ్ ఏం చేసాడు? శ్రీరామ్ కు ఎదురైన సమస్యలేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? సీతను ఎలా దక్కించుకున్నాడు అనే ఆసక్తికర అంశాలే మిగిలిన కథ.

cinima-reviews
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న రాజ్‌తరుణ్ నటించిన తాజా చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా రాజ్ తరుణ్ కు ఎలాంటి విజయం అందించనుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
శ్రీరామ్ పాత్రలో రాజ్ తరుణ్ మెప్పించాడు. తన గత చిత్రాల్లోలాగే తనదైన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం తానై నడిపించాడు. లవ్, ఎమోషన్ సీన్లలో చాలా చక్కగా నటించాడు. ఇక అర్తన చాలా క్యూట్ గా వుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సీత పాత్రకు వుండాల్సిన ఇనోసెన్స్ తో పాటు కాస్త గ్లామర్ ను కూడా జతచేసినట్లుగా అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నీవేశాలు బాగున్నాయి. హీరో ఫ్రెండ్స్ గా చేసిన షకలక శంకర్, నవీన్ తదితరులు బాగా నవ్వించారు. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన రాజా రవీంద్ర తన స్టైల్లో అదరగొట్టాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

ఇక సినిమా పరంగా చూసుకుంటే... డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా హీరోహీరోయిన్ల ప్రేమ కబుర్లు, ఎంటర్ టైన్మెంట్ తో సరదా సరదాగా సాగిపోతే.. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ తో కూడిన లవ్ బాగుంది.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. ఇలాంటి కథతో ఇప్పటికే జగపతిబాబు నటించిన ‘కబడ్డీ కబడ్డీ’ చిత్రం గుర్తొస్తూ వుంటుంది. అందులో తన ప్రేమకోసం కబడ్డీ మ్యాచ్ ఆడితే... ఇందులో క్రికెట్ ఆట ఆడతాడు రాజ్ తరుణ్. కాకపోతే అది కాస్త వయసు మళ్లిన ప్రేమకథా.. ఇది యూత్ లవ్ స్టోరీ అంతే తేడా. ఇక రాజ్ తరుణ్ రెగ్యులర్ డైలాగ్ డెలివరీ స్టైల్లో ఎలాంటి మార్పు లేదు. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినప్పటికీ... కనీసం కథనంలోనైనా బాగుంటే సినిమా ఓ రేంజులో వుండేది. కానీ స్ర్కీన్ ప్లే కూడా బాలేదు. ఇక రామ్-సీతల ప్రేమకథలో పెద్దగా ఎమోషన్స్ లేవు. సినిమా అంతా కూడా రామ్ మాత్రమే కీలకం. మిగతా పాత్రలను సరైన విధంగా డిజైన్ చేసుకోలేదు. సెకండ్ హాఫ్ మరీ బోర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక 15 నిమిషాల తర్వాత ఏం జరుగబోతుందో ప్రేక్షకులు ఈజీగా చెప్పేయగలరు. పైగా అర్థంపర్థంలేని కామెడీతో లాగించేయాలని చూసారు. అది కూడా వర్కౌట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు అనుకున్న స్టోరీ లైన్ బాగున్నప్పటికీ... ఆ కథను సరైన విధంగా డిజైన్ చేసుకోలేకపోయాడు. పైగా స్ర్కీన్ ప్లే విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపించలేనట్లుగా కనిపిస్తుంది. దర్శకుడిగా నిరాశపరిచాడనే చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫి బాగుంది. పల్లెటూరీ వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు. డైలాగ్స్ బాగున్నాయి. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని వుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’: ‘కబడ్డీ కబడ్డీ’కీ సీక్వెల్.