Kanche Movie Review | Varun Tej Kanche Review | Kanche Movie Review And Rating

Teluguwishesh కంచె కంచె Get information about Kanche Movie Review, Kanche Telugu Movie Review, Varun Tej Kanche Movie Review, Kanche Movie Review And Rating, Kanche Telugu Movie Talk, Puli Telugu Telugu Movie Trailer, Varun Tej Kanche Review, Kanche Telugu Movie Gallery and more only on TeluguWishesh.com Product #: 69443 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  కంచె

 • బ్యానర్  :

  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

 • దర్శకుడు  :

  క్రిష్ జాగర్లమూడి

 • నిర్మాత  :

  రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి

 • సంగీతం  :

  చిరంతాన్ భట్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  జ్ఞానశేఖర్

 • నటినటులు  :

  వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ తదితరులు

Kanche Movie Review

విడుదల తేది :

2015-10-22

Cinema Story

1936.. మంగలి ఫ్యామిలీలో పుట్టిన ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్),  – జమిందారి వంశంలో జన్మించిన ప్రిన్సెస్ రాచకొండ సీతాదేవి(ప్రాగి జైశ్వాల్) ఒకే ఊరికి చెందినవారు. వీరిద్దరూ మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ పరిచయం కాగా.. అది ప్రేమగా మారుతుంది. కానీ వీరి ప్రేమని రాచకొండ సంస్థానం అధినేత, సీతాదేవి అన్న ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్) అంగీకరించడు. దాంతో ఆ ఊర్లో కులాల మధ్య చిచ్చు మొదలవుతుంది. ఆ చిచ్చుని హరిబాబు ఎలా చల్లార్చాడు.? తన ప్రేమని దక్కించుకున్నాడా లేదా అన్నది మొదటి పార్ట్.

కట్ చేస్తే.. 1944 కథ. రాయల్ ఇండియన్ ఆర్మీ కల్నల్ ఈశ్వర్ ప్రసాద్, మేజర్ హరిబాబు ఇద్దరూ వరల్డ్ వార్‌లో ఇటలీ తరపున జర్మనీతో పోరాడటానికి యుద్ధంలోకి దిగుతారు. ఒక్కసారిగా జర్మనీ దళాలు వీరి స్థావరం మీద దాడి చేయగా.. అందరు సైనికులు చనిపోతారు. ఈ అటాక్ నుంచి వరుణ్ తేజ్, మరో నలుగురు తప్పించుకోగా.. ఆర్మీ చీఫ్ కెప్టెన్, కల్నల్ ఈశ్వర్ ప్రసాద్ ఇద్దరు జన్మన్ వారికి చిక్కుతారు. దాంతో వారిని బందిస్తారు. ఆ ఇద్దరిని వరుణ్, మరో నలుగురు వ్యక్తులు కలిసి ఎలా కాపాడారు? వారిని కాపాడే క్రమంలో హరిబాబు వ్యూహం ఏమిటి? అలాగే ఈ జర్నీలో ఆ టీం ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? చివరికి ఆ యుద్ద భూమి నుంచి ఎవరెవరు బయటపడ్డారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

cinima-reviews
కంచె

‘ముకుంద’ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంచె’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికేట్ ను దక్కించుకుంది. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగే ఒక ప్రేమ కథ ఈ కంచె.

కంచె చిత్రంలోని అన్ని పాటలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించగా, ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏమిటంటే.. హాలీవుడ్ సినిమాలా తలపించే ‘వరల్డ్ వార్ II’ పార్ట్ కథ. ఆ తర్వాత వచ్చే లవ్‌ట్రాక్ చాలా మంచి ఫీల్‌ని ఇస్తుంది. లవ్ స్టొరీ తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ఒక 10 నిమిషాలు సూపర్బ్. ఇక సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే వార్ సీన్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.

ఇక ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ నటన, అతని హావ భావాలు సింప్లీ సూపర్బ్. ధూపాటి హరిబాబుగా వరుణ్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే తన వాయిస్‌లో, డైలాగ్ డెలివరీలో చాలా మెచ్యూరిటీ చూపించాడు. ప్రగ్యా జైశ్వాల్ రియల్ ప్రిన్సెస్ అంటే ఇలానే ఉంటుందేమో అనేలా ఉంది. అలాగే తన పెర్ఫార్మన్స్, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నికేతన్ ధీర్ కూడా తన పాత్రలో నెగటివ్ షేడ్స్‌ని బాగా చూపించాడు. అవసరాల శ్రీనివాస్ ఒక భయస్తుడైన సైనికుడుగా ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. గొల్లపూడి మారుతీ రావు, సింగీతం శ్రీనివాసరావులతోపాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

కంచె సినిమాకి మైనస్ పాయింట్.. నేరేషన్. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచీ యావరేజ్ స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది. అర్ధభాగంలో మొదటి 30 నిమిషాల తర్వాత ఓ 20 నిమిషాలు కథ స్లోగా సాగుతుంది. అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. కథనం పరంగా అటు, ఇటు అని సింక్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది కానీ కథలో కొన్ని మిస్టేక్స్ చేసాడు డైరెక్టర్ క్రిష్. అదేమిటంటే ఇంటర్వల్‌కే కథని ఎలా ముగించే అవకాశం ఉంది అనే క్లూని ఆడియన్స్‌కి ఇచ్చేయడం.. దానికి తోడూ సెకండాఫ్ మొదటి నుంచి అదే విషయాన్ని రివీల్ చేస్తూ పోవడం అనేది ఆడియన్స్ కి కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. అలాగే క్రిష్ ఈ సినిమాలో కూడా చేసిన తప్పు ఏంటంటే.. వార్ సీన్స్‌లో హీరోలోని ఇంటెన్స్‌ని పీక్స్ లో చూపకపోవడం. దీనివల్ల ఓ రేంజ్ లో ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వాల్సిన సీన్స్ కాస్త తక్కువ రేంజ్‌లో కనెక్ట్ అవుతాయి.

సాంకేతిక విభాగం :

కంచెకి దాదాపు అన్ని విభాగాలు వెన్ను దన్నుగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ముందుగా 1936-44 ఫీల్ వచ్చేలా ఆర్ట్ డైరెక్టర్ సాహి డిజైన్ చేసిన సెట్స్ సింప్లీ సూపర్బ్. సినిమా చూస్తున్నప్పుడు ఆ సెట్స్ మనల్ని 1936 టైంకి తీసుకెళ్తాయి. ఆ సెట్స్ ని, అలాగే ప్రతి విజువల్ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ చాలా బాగా షూట్ చేసాడు. ముఖ్యంగా వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్‌ని షూట్ చేసిన విధానం హాలీవుడ్ సినిమా ఫీల్‌ని తెస్తుంది. ఈ విజువల్స్ కి చిరంతన్ భట్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా ఎమోషనల్,సీరియస్ సీన్స్ లో అతని మ్యూజిక్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. సూరజ్ – రామకృష్ణ కలిసి చేసిన ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా, స్పీడ్‌గా ఉండాల్సింది. వెంకట్ అండ్ డేవిడ్ కలిసి కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఇక సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ వావ్ అనేలా ఉండడమే కాకుండా ఆలోచించేలా చేస్తాయి.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన క్రిష్ గురించి చెప్పుకుంటే.. క్రిష్ రాసుకున్న కథ అందుకోసం ఎంచుకున్న నేపధ్యం బాగుంది. కథ మొదట్లో ఉన్నంత గ్రిప్పింగ్ కథ చివర్లో లేకపోవడం ఆయన చేసిన మిస్టేక్. క్లైమాక్స్‌ని ఇంకాస్త స్ట్రాంగ్‌గా రాసుకొని ఉండాల్సింది. కథనంలో కొన్ని ఎలిమెంట్స్‌ని సూపర్బ్ గా కనెక్ట్ చేసినా, అక్కడక్కడా కొన్ని బోరింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. డైరెక్టర్‌గా అందరి నుంచి అల్టిమేట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. అలాగే అనుకున్న బ్లాక్స్ ని చాలా బాగా తీసాడు కూడాన. అయితే.. కొన్ని సీన్స్ లో ఇంటెన్స్‌ని హై రేంజ్ లో చూపించకపోవడమే అతను చేసిన తప్పు. ఇక రాజీవ్ రెడ్డి – సాయి బాబుల నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
కంచె : వరల్డ్‌వార్‌లో అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.