The Full Telugu Review Of Shivam Movie | Actor Ram Movies | Rashi Khanna Movies

Teluguwishesh శివమ్ శివమ్ Shivam Movie Telugu Review Ram Rashi Khanna : The Full Telugu Review Of Shivam Movie In Which Ram And Rashi Khanna Starring. This Movie Directed By Srinivasa Reddy. Product #: 68727 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  శివమ్

 • బ్యానర్  :

  శ్రీ స్రవంతి మూవీస్

 • దర్శకుడు  :

  శ్రీనివాస్ రెడ్డి

 • నిర్మాత  :

  స్రవంతి రవికిషోర్

 • సంగీతం  :

  దేవిశ్రీప్రసాద్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  రసూల్ ఎల్లోర్

 • ఎడిటర్  :

  కిషోర్ తిరుమల

 • నటినటులు  :

  కిషోర్ తిరుమల

Shivam Movie Review

విడుదల తేది :

2015-10-02

Cinema Story

జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ప్రేమికులను కలపడానికి ఎంత రిస్క్ అయినా తీసుకునే కుర్రాడే శివ(రామ్). అత‌ను క‌లిపిన ప్రేమ జంట‌లు సినిమా పూర్త‌య్యే స‌రికి దాదాపు 116కి చేరిన‌ట్టుంటాయి. దేవదాసు-పార్వతి, లైలా-మజ్ఞుల కాలంలో తాను లేనని, ఒకవేళ ఆ సమయంలో వుండి వుంటే వాళ్లు కూడా ఖచ్చితంగా విడిపోయేవారే కాదని అనుకుంటు ఉండేవాడు. ఇలా వుండగా కర్నూల్ లో బాగా పేరు మోసిన రౌడీ షీటర్ భోజిరెడ్డి(వినీత్ కుమార్) కొడుకు అమిత్ ను చితకబాదుతాడు. అలా కొట్టి వెళ్లిపోతున్న సమయంలోనే అనుకోకుండా తొలిచూపులోనే తనూజ(రాశిఖన్నా)తో ప్రేమలో పడతాడు. ఇక తనూజను వెతుక్కుంటూ శివ కర్నూల్ వెళతాడు.

 

సీన్ కట్ చేస్తే.. తన కొడుకు కొట్టిన శివను ఎలాగైనా చంపాలని భోజిరెడ్డి మనుషులు తెగ వెతుకుతూ వుంటారు. మరోవైపు హైదరాబాద్ లో రౌడీయిజం, బిజినెస్ చేస్తుండే అభి(అభిమన్యుసింగ్) కూడా శివ కోసం వెతుకుతాడు. కానీ అభి మాత్రం శివను వదిలేసి తనూజను ఎత్తుకెళ్లిపోతాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు అమిత్ ను శివ ఎందుకు కొట్టాడు? అభికి శివకు వున్న గొడవ ఏంటి? తనూజను అభి ఎందుకు తీసుకెళ్లిపోయాడు? అసలు భోజిరెడ్డి నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనే ఆసక్తికర అంశాలు వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

cinima-reviews
శివమ్

రామ్, రాశిఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం ‘శివమ్’. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

దేవి ఈ సినిమాకు అద్భుతమైన పాటలను అందించారు. అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. హై వోల్టేజ్ లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న భారీ ఎత్తున్న విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

ప్లస్ పాయింట్స్:

ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. తనదైన శైలిలో రామ్ ఇరగదీసాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని యాక్షన్ సీన్లలో, పాటల్లో డాన్సులతో అదరగొట్టేసాడు. శివ పాత్రకు రామ్ తన ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. మరోసారి ‘శివమ్’ సినిమాతో రామ్ బాగా అలరించాడు. ఇక ఒంటి నిండా బలుపు, ఈగో వున్న పాత్రలో రాశిఖన్నా చాలా చక్కగా నటించింది. ఇందులో రాశిఖన్నా చాలా గ్లామరస్ గా కనిపించింది. ముఖ్యంగా ఈ అమ్మడి అందచందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. రామ్-రాశిఖన్నాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.

ఇక సెంటిమెంట్స్ ను ఫాలో అయ్యే కామెడీ విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ బాగానే నవ్వించాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పోసాని తదితరులు బాగానే నవ్వించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్, ఎంటర్ టైనర్ గా సాగిపోగా.. సెకండ్ హాఫ్ లో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కథ. ఇప్పటికే ఇలాంటి కథలతో చాలా సినిమాలచ్చాయి. గతంలో రామ్ కూడా ఇలాంటి కథలతోనే సినిమాలు చేసారు. కాబట్టి కథలో అంతగా కొత్తదనం కనిపించలేదు. స్టోరీ పాతదే అయినప్పటికీ కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొని, మరింత బాగా తీసుంటే సినిమా సూపర్బ్ గా వచ్చుండేది. ఇక సినిమా మొత్తం కూడా కామెడీ ఎంటర్ టైనింగ్ తో కొనసాగించాలని అనుకున్నట్లుగా అనవసరపు సంధర్భాల్లో కూడా కామెడీని ఇరికించి పెట్టినట్లుగా అనిపిస్తూ వుంటుంది.

అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. దీనివల్ల ప్రేక్షకులకు బోర్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకు రన్ టైం చాలా ఎక్కువ. దాదాపు 2 గంటల 48 నిమిషాల ఈ సినిమాలో దాదాపు 25 నిమిషాలు ఎడిట్ చేసిన కూడా సినిమా మరింత వేగం పెరిగే అవకాశం వుంది. ఇక పలు పాత్రలకు సరైన జస్టిఫికెషన్ లేదు. క్లారిటీ లేదు. ఈ మధ్య వస్తున్న కామెడీ విలన్ల వలే.. ఇందులో కూడా విలన్ ను కూడా అంత కామెడీ తరహాలోనే చూపించారు.

సాంకేతికవర్గ పనితీరు:

‘శివమ్’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి, మ్యూజిక్. ఈ రెండు అంశాలు కూడా సినిమాకు బాగా ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేంను కూడా చాలా అందంగా చూపించారు. ముఖ్యంగా నార్వే లొకేషన్స్, అలాగే పాటల లొకేషన్లను కూడా చాలా అద్భుతంగా చూపించారు. విజువల్స్ పరంగా ప్రతి ఫ్రేం సూపర్బ్. అలాగే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. పాటలను కూడా చాలా అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఇక కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలను డీల్ చేసిన శ్రీనివాస్ రెడ్డి పర్వాలేదనిపించాడు. కానీ కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. దర్శకుడిగా కూడా ఓకే ఓకే అనిపించేసాడు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. స్రవంతి రవికిషోర్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

చివరగా:

‘శివమ్’: అదే పాత లవ్ స్టోరీ