The Full Telugu Review Of Subramanyam For Sale Movie In Which Sai Dharam Tej And Regina Cassandra Played Lead Roles | Telugu Movie Reviews

Teluguwishesh సుబ్రమణ్యం ఫర్ సేల్ సుబ్రమణ్యం ఫర్ సేల్ Subramanyam For Sale Movie Telugu Review Sai Dharam Tej Regina Cassandra : The Full Telugu Review Of Subramanyam For Sale Movie In Which Sai Dharam Tej And Regina Cassandra Played Lead Roles. This Movie Directed By Harish Shankar. Product #: 68504 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    సుబ్రమణ్యం ఫర్ సేల్

  • బ్యానర్  :

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    హరీష్ శంకర్

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    మిక్కీ జే.మేయర్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    సి.రాంప్రసాద్

  • నటినటులు  :

    సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, రావు రమేష్ తదితరులు

Subramanyam For Sale Movie Telugu Review Sai Dharam Tej Regina Cassandra

విడుదల తేది :

2015-09-24

Cinema Story

సుబ్రమణ్యం(సాయిధరమ్ తేజ్).. ఎనర్జిటిక్ తెలుగు కుర్రాడు. ఇతగాడు డాలర్ వేటలో అమెరికాలో జీవనం సాగిస్తుంటాడు. అది కూడా వినూత్న పద్ధతిలో. నిజానికి డాలర్ కోసం ప్రతిఒక్కరు ఏదో పని చేసేందుకు ముందుకొస్తారు కానీ.. సుబ్రమణ్యం అందుకు భిన్నంగా తనని తానే అమ్ముకోవడం మొదలు పెడతాడు. అదెలాఅంటే.. నవ్వడం–నవ్వించడం, ఏడవడం–ఏడ్పించడం, కొట్టడం–కొట్టించుకోవడం.. ఇలా ఏ పని చేయడానికైనా సిద్దపడతాడు. డాలర్ తో జేబులు నింపుకుంటూ ఎంజాయ్ గా గడుపుతున్న సమయంలో.. సుబ్రమణ్యం లైఫ్ లోకి సీత(రెజీనా) ఎంటర్ అవుతుంది. కుటుంబాన్ని వదులుకొని వచ్చి ప్రేమించిన అబ్బాయి చేతిలో మోసపోయిన సీతకి సుబ్రమణ్యం షెల్టర్ తో పాటు తను పనిచేసే రెస్టారెంట్ లో జాబ్ ఇప్పిస్తాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.

అదే సమయంలో సీత తన చెల్లెలు గీత(తేజస్వి) పెళ్లి కోసం సొంతూరు కర్నూల్ వెళ్ళాల్సి వస్తుంది. తనతోపాటు సుబ్రమణ్యంని తీసుకెళుతుంది. అక్కడ బియ్యం బుజ్జి(రావు రమేష్), గోవింద్ గౌడ్(అజయ్)ఎంటర్ అవుతారు. వీరిద్దరికీ సుబ్రమణ్యంతోపాటు సంబంధం లేకపోయినా.. వారికి వీరిద్దరి టార్గెట్ మాత్రం అతడే. బియ్యం బుజ్జి సుబ్రమణ్యంని వేసేయ్యాలి అనుకుంటే, గోవింద్ గౌడ్ మాత్రం తన చెల్లెలు దుర్గ(ఆద శర్మ)ని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటూ చేజ్ చేస్తుంటాడు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది.? సీతకి ఉన్న సమస్య ఏమిటి.? అసలెందుకు సుబ్రమణ్యంని బియ్యం బుజ్జి చంపాలనుకున్నాడు.? గోవింద్ గౌడ్ ఎందుకు తన చెల్లిని సుబ్రమణ్యంకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు? చివరికి ఏమవుతుంది? అనే విషయాలు తెలియాలంటే.. వెండితెరపై సినిమా చూడాల్సిందే!

cinima-reviews
సుబ్రమణ్యం ఫర్ సేల్

‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీనా మరోసారి జంటగా నటించిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. కుటుంబ విలువలతోపాటు, కమర్షియల్ అంశాలను పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి తీసిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

టైటిల్ ఎంత డిఫరెంట్ గా వుందో.. అంతే ప్రత్యేకంగా సినిమాని తెరకెక్కించడమే ఈ సినిమాకి హైలైట్. ముఖ్యంగా డిఫరెంట్ గా హీరో పాత్రని సరికొత్తగా డిజైన్ చెయ్యడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. తనని తానూ అమ్ముకోవాలి అనే కాన్సెప్ట్ చూసే ఆడియన్స్ కి కొత్త ఫీల్ ఇస్తుంది. అలాగే.. హీరో పాత్రతోనే ఎక్కువ భాగం కామెడీని పండిస్తూ రావడం కూడా సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. గత రెండు సినిమాలతో పోల్చుకుంటే.. ఇందులో సాయి స్క్రీన్ ప్రెజెంటేషన్ (లుక్ అండ్ స్టైలింగ్) చాలా బాగుంది. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ బాగానే చేసుకున్నాడు. అలాగే కొన్ని రొమాంటిక్ సీన్స్ లో, డాన్సుల్లో ఇరగదీసాడు.

ఇక సీత పాత్రలో నటించిన రెజీనా.. తన అమాయకత్వంతో నవ్విస్తూనే, ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. వీటితోపాటు మునుపెన్నడూ కనిపించనంత గ్లామరస్ గా కనిపించింది. సాయి-రెజీనా రొమాంటిక్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ ట్రాక్ లో వారిద్దరి  కెమిస్ట్రీ, పెర్ఫార్మన్స్, ఎనర్జీ లెవల్స్ సింప్లీ సూపర్బ్. బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ లో కాసేపు సెకండాఫ్ లో కాసేపు బాగా నవ్వించాడు. ఇక రావు రమేష్, సుమన్, అజయ్, ఫిష్ వెంకట్, నరేష్, ఝాన్సీ, రణధీర్, తేజస్వి తదితరులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సినిమా విషయానికొస్తే.. సుబ్రమణ్యంని పాత్రని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, అతనికి జోడీగా సీతని కలపడం లాంటి విషయాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి. మధ్య మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ మాస్ ఆడియెన్స్ ని  రంజింపజేస్తాయి. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగుంది. ఇక సెకండాఫ్ లో ఓ అందమైన ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలని, అందులో ఉండే సరదాలను చూపిన విధానం మనసుకు హత్తుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అంతగా మైనస్ పాయింట్స్ లేవుగానీ.. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రజెంట్ చేసిన క్లైమాక్స్ అంతగా ఆశాజనకంగా వుండదు. పైగా.. ఈ సినిమా కథ కూడా పాతదే! దానిని బాగానే ప్రెజంట్ చేశాడు కానీ.. క్లైమాక్స్ ని మరీ ఊహాజనితంగా మార్చేశాడు. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాలకే కథకి ముగింపు ఏంటనేది అర్థమైపోతుంది.

దీంతో అక్కడకడ్క కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. కొన్ని సన్నివేవాలు సాగదీస్తున్నట్లు ఆడియెన్స్ ఫీల్ అవుతారు. సెకండాఫ్ ని ఇంకాస్త క్రేజీగా రాసుకొని ఉండాల్సింది. ఇకపోతే సినిమాలో హీరోయిజం, విలనిజం యాంగిల్ ని ఫస్ట్ హాఫ్ లో చాలా స్ట్రాంగ్ గా చూపించాడు, కాని సెకండాఫ్ లో రెండింటిని కామెడీ వైపు తీసుకొచ్చేయడం వలన విలనిజం అనేది పెద్దగా పండలేదు. సుమన్, రావు రమేష్, నాగబాబు లాంటి స్టార్ నటులను సరిగా వినియోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమా సి.రాంప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ అదుర్స్. యుఎస్ లోని లొకేషన్స్ ని చూపిన విధానం అదిరిపోయింది. ఆ విజువల్స్ కి మిక్కీ జే మేయర్ అందించిన నేపధ్య సంగీతం సూపర్బ్. సాఫ్ట్ సంగీతం అందించే మిక్కీ కూడా ఇలాంటి మాస్ మ్యూజిక్ కూడా ఇవ్వగలడా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో రీ రికార్డింగ్ అదరగొట్టాడు. ఇకపోతే అతడు అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగానే ఉంది. సెకండాఫ్ లో జాగ్రత్తలు తీసుకుని వుండుంటే బాగుండేది. అక్కడక్కడా లాగ్స్ ఉన్నాయి వాటిని కాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. రామకృష్ణ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఇంటి సెట్ సూపర్ గా ఉంది. వెంకట్, రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేలా బాగా కంపోజ్ చేసారు.

ఇక సినిమాకి కెప్టెన్ అయిన హరీష శంకర్ విషయానికి వస్తే.. కథ, మాటలు, దర్శకత్వం ఇలా అన్ని మేజర్ డిపార్ట్ మెంట్స్ ని డీల్ చేసాడు. కథ – కథలో పాత్రలు కొత్తవి, కానీ ఇన్నర్ గా నడిచే కథ పాతదే.. కథనం – ముగ్గురు కలిసి రాసిన ఈ కథనం ఫస్ట్ హాఫ్ పరంగా కేక అయితే సెకండాఫ్ పరంగా ఓకే. ఇక డైరెక్టర్ గా ప్రతిసారి ఓ సరికొత్త పాత్రతో అలరించే హరీష్ శకర్ ఈ సారి కూడా పాత్రలని సూపర్బ్ గా రాసుకున్నాడు. నటీనటుల పెర్ఫార్మన్స్ పరంగా ది బెస్ట్ రాబట్టుకున్నాడు. ఇలా ఇన్నిటిలో సూపర్బ్ వర్క్ చేసిన హరీష్ శంకర్ పాత కథ – కథనాలను ఎంచుకోవడం కారణంగా 80% హిట్ టాక్ తోనే సరిపెట్టుకున్నాడు. దిల్ రాజు నిర్మాణ విలువలు అమేజింగ్ అని చెప్పాలి. కథని నమ్మి ఓ గ్రాండ్ విజువల్ ట్రీట్ గా ఈ సినిమాని తీర్చిదిద్దారు.

చివరగా :
సుబ్రమణ్యం ఫర్ సేల్ : ఈ సుబ్రమణ్యం బాక్సాఫీస్ దగ్గర బాగానే సేల్ అవుతాడు.