The Full Telugu Review Of Dynamite Movie | Manchu Vishnu Dynamite Movie | Pranitha With Manchu Vishnu

Teluguwishesh డైనమైట్ డైనమైట్ Dynamite Telugu Movie Review Manchu Vishnu Pranitha Deva Katta : The Full Telugu Review Of Dynamite Movie In Which Manchu Vishnu and Pranitha Starring. This Movie Directed By DevaKatta. Product #: 67809 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  డైనమైట్

 • బ్యానర్  :

  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ

 • దర్శకుడు  :

  దేవకట్టా

 • నిర్మాత  :

  మంచు విష్ణు

 • సంగీతం  :

  అచ్చు

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  సతీష్ ముత్యాల

 • ఎడిటర్  :

  ఎస్.ఆర్.శేఖర్

 • నటినటులు  :

  మంచు విష్ణు, ప్రణీత, జెడి చక్రవర్తి త‌దిత‌రులు

Dynamite Telugu Movie Review Manchu Vishnu Pranitha Deva Katta

విడుదల తేది :

2015-09-04

Cinema Story

ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగే కుర్రాడు శివాజీ(మంచు విష్ణు). అనుకోకుండా ఓ పార్టీలో అనామిక(ప్రణీత)ను కలుస్తాడు. ఆ పార్టీ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి ఓరోజు ఊరంతా బాగా తిరిగేసి, చివరకు అనామిక ఫ్లాట్ కు చేరుకుంటారు. అయితే ఎవరో కొంతమంది అనామికను కిడ్నాప్ చేస్తారు. ఈ విషయాన్ని శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా పోలీసులలో ఒకరు ఆ కిడ్నాపర్లకు సహాయం చేస్తుంటాడు. కానీ చివరకు ఆ కిడ్నాపర్ల భారీ నుంచి అనామికను రక్షిస్తాడు.

అయితే అనామికను కిడ్నాప్ చేసి, చంపాలనే ప్రయత్నం వెనుక ఓ బలమైన కారణం వుంటుంది. ఆ కారణమే ముఖ్యమంత్రి జెడి చక్రవర్తి. అనామికను రక్షించే క్రమంలో శివాజీ కూడా ఇన్వాల్వ్ అవడంతో.. వీరిద్దరిని చంపడానికి ముఖ్యమంత్రి తెగ ప్రయత్నిస్తుంటాడు. అసలు అనామికను ఎందుకు కిడ్నాప్ చేసారు? అనామికను ఎందుకు చంపాలని అనుకుంటారు? ముఖ్యమంత్రికి, అనామికకు వున్న సంబంధం ఏంటీ? చివరకు ఏం జరిగింది? వీటన్నింటిని శివాజి, అనామికలు ఎలా ఎదుర్కొన్నారు? అనేది వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
డైనమైట్

మంచు విష్ణు, ప్రణీత జంటగా ప్రముఖ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు. అచ్చు సంగీతం అందించాడు.

ఇప్పటికే పాటలు, ట్రైలర్లు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘డైనమైట్’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న డైనమైట్ సినిమాని విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Cinema Review

ప్లస్ పాయింట్స్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ యాక్షన్ ఎపిసోడ్స్. ఇందులో భారీ యాక్షన్ స్టంట్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఇక విష్ణు తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు. లుక్స్ పరంగా చాలా కొత్తగా కనిపించాడు. ఇక ప్రణీత చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి పాత్రలో నటించింది. కేవలం గ్లామర్, పాటలకు మాత్రమే పరిమితం కాకుండా సినిమా మొత్తం కూడా హీరోతో పాటే ట్రావెల్ చేసే పాత్రలో నటించి మెప్పించింది. ప్రణీత గ్లామర్ పరంగా చాలా బాగుంది. తన పాత్రకు తగిన న్యాయం చేసింది.

ఇక విలన్ పాత్రలో నటించిన జెడి చక్రవర్తి అద్భుతంగా నటించాడు. తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా, విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలలో పర్వాలేదనిపించారు.ఈ సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం భారీ యాక్షన్, థ్రిలింగ్ సన్నివేశాలతో అదరగొట్టింది.

మైనస్ పాయింట్స్:
ఈ సినిమా మొదలు 10 నిమిషాలు కాస్త నెమ్మదిగా సాగుతుంటుంది. ఇక పాటలు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చే విధంగా అనిపిస్తు వుంటాయి. అలాగే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త బోరింగ్ గా అనిపిస్తూ వుంటుంది. అంతే కాకుండా సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఎంటర్ టైన్మెంట్, కామెడీ, లవ్ వంటి అంశాలు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా చాలా బోరింగ్ అనిపిస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
సతీష్ ముత్యాల అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్, అడ్వంచర్ సన్నివేశాలను అద్భుతంగా చూపించారు. అచ్చు సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఎడిటర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. ఇక దర్శకుడిగా దేవకట్టా మరోసారి విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. కానీ కథలో మరిన్ని మార్పులు చేసి, స్ర్కీన్ ప్లే పరంగా మరింత బాగా తెరకెక్కించి వుంటే బాగుండేది. నిర్మాతగా విష్ణు నిర్మించిన ఈ చిత్రం చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా స్టైలిష్ గా వున్నాయి.

చివరగా:
డైనమైట్: భారీ యాక్షన్, థ్రిల్లర్ చిత్రం