The Telugu Movie Review Of Best Actors | Telugu Movies | Tollywood

Teluguwishesh బెస్ట్ యాక్టర్స్‌ బెస్ట్ యాక్టర్స్‌ Best Actors Telugu Movie Review : The Telugu Movie Review Of Best Actors In Which Young Actors Playing Lead Roles. Product #: 67646 2 stars, based on 1 reviews
 • చిత్రం  :

  బెస్ట్ యాక్టర్స్‌

 • బ్యానర్  :

  మారుతి టీం వ‌ర్క్స్

 • దర్శకుడు  :

  అరుణ్ ప‌వ‌ర్

 • నిర్మాత  :

  కుమార్ అన్నంరెడ్డి

 • సంగీతం  :

  జేబి

 • సినిమా రేటింగ్  :

  22  2

 • ఛాయాగ్రహణం  :

  విశ్వ.డి.బి

 • ఎడిటర్  :

  ఉద్దవ్‌.ఎస్‌.బి

 • నటినటులు  :

  నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా క్రాంతి, షామిలి, భార్గవి తదితరులు

Best Actors Telugu Movie Review

విడుదల తేది :

2015-08-28

Cinema Story

చిన్నప్పటి నుంచి నందు(నందు), మధు(మధు), అభి(అభి), కృష్ణ(నవీద్)లు మంచి స్నేహితులు. నందు ఫ్యాషన్ డిజైనర్. ప్రేమ, పెళ్లి అనే వాటిని నమ్మకుండా అమ్మాయిలతో జల్సా చేస్తుంటాడు. మధు తన ఆఫీస్ లో కోరుకున్న ప్రమోషన్ కోసం, తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను చెప్పలేక బాధపడుతుంటాడు. ఇక మూడేళ్లుగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నో చెప్పడంతో బాధపడుతుంటాడు కృష్ణ. దర్శకుడిగా మారి ఇండస్ట్రీని మార్చేయ్యాలని చాలా అవకాశాల కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోతాడు అభి. ఇలా ఒక్కొక్కరు వారి వారి సమస్యలతో బాధపడుతుంటారు. కాస్త ఎంజాయ్ మెంట్ కోసం గోవా వెళ్తారు.

అక్కడ మీనాక్షి అయ్యర్(క్రతీ)తో కృష్ణకు పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక నందు, మధులకు జయసుధ(మధురిమ), జయప్రద(కేశ కంబటి)లు పరిచయం కావడం, రెండో రోజుకే వారి మధ్య అన్నీ అయిపోవడం జరిగిపోతాయి. సీన్ కట్ చేస్తే... తర్వాత రోజు నుంచి వారు కనపడరు. కానీ నందు, మధులకు కాల్ చేసి మాలో ఒకరికి ఎయిడ్స్ వుంది.. కాబట్టి.. మీ ఇద్దరిలో కూడా ఒకరికి ఎయిడ్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు. దీంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది.

ఇక అక్కడి నుంచి ఏం జరిగింది? అసలు జయప్రద, జయసుధలు ఎవరు? నందు, మధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? ఫైనల్ గా ఎవరికి ఎయిడ్స్ వుందని తేలింది? చివరకు ఏం జరిగింది? అనే అంశాలను వెండితెర మీద చూసి తెల్సుకోవాల్సిందే.

cinima-reviews
బెస్ట్ యాక్టర్స్‌

నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా క్రాంతి, షామిలి, భార్గవిలు ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘బెస్ట్ యాక్టర్స్‌’. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత‌గా వ్యవహరించిన ఈ చిత్రం ద్వారా అరుణ్ ప‌వ‌ర్ ద‌ర్శకునిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. జెబి సంగీతాన్ని అందించారు. ఇటీవ‌లే విడుద‌ల ఆడియో సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టంతో యూనిట్ స‌భ్యులు సంతోషంతో వున్నారు. ఇప్పడు రాఖిపౌర్ణమి సంద‌ర్బంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 28న విడుద‌ల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!


Cinema Review

ప్లస్ పాయింట్స్ :
ఇందులో నందు చాలా చక్కగా నటించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఇక అభి తన బాగా నటించాడు. పలు సన్నివేశాలలో బాగా నవ్వించాడు. డైలాగ్స్ బాగున్నాయి. షామిలీ తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. లుక్స్ పరంగా చాలా బాగుంది. కత్రీ పలు లవ్ సీన్లలలో బాగా చేసింది. గ్లామర్ పరంగా పిచ్చెక్కించిన మధురిమ, కేశ కంబటిలు చాలా హాట్ గా కనిపించారు. భారీగా అందాల ఆరబోత చేసారు. అంతే కాకుండా సినిమాలో కీలక పాత్రలలో నటించి మెప్పించారు.

ఇక చివర్లో తాగుబోతు రమేష్ చేసిన కామెడీ బాగుంది. అలాగే సప్తగిరి కామెడీ కూడా బాగా పేలింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. సినిమా అక్కడక్కడ కామెడీతో పర్వాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్ :
‘బెస్ట్ యాక్టర్స్’ ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినా కూడా కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. సినిమాలు అక్కడక్కడ కామెడీ సన్నివేశాలున్నాయి. పంచ్ డైలాగులు మరీ ఎక్కువయ్యాయి. కథలో మరికొన్ని సరైన థ్రిల్లింగ్ ట్విస్టులతో రాసుకొని వుంటే బాగుండేది. ఇక సినిమా మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సినిమా మొదలు 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలు మరియు ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగతాదంతా బోరింగ్ గా అనిపిస్తుంది. పైగా పలు పాత్రల మధ్య కెమిస్ట్రీ తగ్గింది. పంచ్ డైలాగ్స్ చాలా ఎక్కువయ్యాయి. కథ, స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.

సాంకేతికవర్గ పనితీరు:
సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి ఫ్రేం కూడా చాలా అందంగా చూపించారు. జెబి అందించిన పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ కూడా పర్వాలేదనిపించింది. డైలాగ్స్ బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల మరింత అతి అయినట్లుగా అనిపించింది. ఇక ఎడిటర్ ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. దర్శకుడు స్ర్కీన్ ప్లే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. రొటిన్ కథతోనే సాగదీసేసాడు. దర్శకుడిగా పర్వాలేదనిపించుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
బెస్ట్ యాక్టర్స్: అప్పుడప్పుడు నవ్వించే యాక్టర్స్