The Full Telugu Review Of Kick 2 Movie | Raviteja | Rakul Preet Singh | Surender Reddy | Kalyan Ram

Teluguwishesh కిక్2 కిక్2 Kick 2 Movie Telugu Review Raviteja Rakul Preet Singh Surender Reddy Kalyan Ram : The Full Telugu Review Of Kick 2 Movie In Which Raviteja Playing In Lead Role And Rakul Preet Singh Is Opposite To Him. This Movie Directed By Surender Reddy And Produced By Kalyan Ram On NTR Arts Banner. Product #: 67374 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    కిక్2

  • బ్యానర్  :

    నందమూరితారకరామారావు ఆర్ట్స్

  • దర్శకుడు  :

    సురేందర్ రెడ్డి

  • నిర్మాత  :

    నందమూరి కళ్యాణ్ రామ్

  • సంగీతం  :

    ఎస్.ఎస్.థమన్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    మనోజ్ పరమహంస

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, రవికిషన్ తదితరులు

Kick 2 Movie Telugu Review Raviteja Rakul Preet Singh Surender Reddy Kalyan Ram

విడుదల తేది :

2015-08-21

Cinema Story

గతంలో వచ్చిన ‘కిక్’ సినిమాకు కొనసాగింపుతో ‘కిక్2’ చిత్రం ప్రారంభం అవుతుంది. ‘కిక్’లోని కళ్యాణ్(రవితేజ), నైన(ఇలియానా)ల కొడుకు రాబిన్ హుడ్ కథ ఇది. కళ్యాణ్ పోలీస్ ఉద్యోగం మానేసి యుఎస్ లో సెటిల్ అవుతాడు. అమ్మ కడుపులో కంఫర్ట్ లేదని 7 నెలలకే రాబిన్ హుడ్ బయటకు వచ్చేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తన కంఫర్ట్ కోసం పక్కనోడికి చుక్కలు చూపిస్తాడు. తాను కంఫర్ట్ గా వుంటే పక్కన ఏం జరిగినా పట్టించుకోడు. ఇక సీన్ కట్ చేస్తే... రాబిన్ హుడ్ ఓ డాక్టర్. ఓ హాస్పిటల్ కట్టాలని అనుకుంటాడు. అందుకోసం ఇండియాలో తనకు వున్న ఆస్తులని అమ్మేసి డబ్బు తెచ్చుకోవాలని ఇండియాకు వస్తాడు. అలా వచ్చిన రాబిన్ కి చైత్ర(రకుల్ ప్రీత్ సింగ్) పరిచయం అవుతుంది. కొద్ది రోజులకే రాబిన్ హుడ్ తో చైత్ర ప్రేమలో పడుతుంది. కానీ రాబిన్ హుడ్ మాత్రం తనని ప్రేమించడు.

అయితే రాబిన్ కూడా చైత్రను ప్రేమిస్తున్నాడని తెలుసుకునే సమయంలో చైత్రను కొందరు కిడ్నాప్ చేస్తారు. సీన్ కట్ చేస్తే చైత్రను వెతుక్కుంటూ బీహర్ లోని విలాస్ పూర్ గ్రామానికి వెళ్తాడు రాబిన్ హుడ్. చైత్ర కోసం వెళ్లిన రాబిన్ లైఫ్ లోకి ఆ ప్రాంతానికి చెందిన విలన్లు రౌడీ సోలమాన్ సింగ్ ఠాకూర్(రవి కిషన్), అతని కొడుకు మున్న(కబీర్ సింగ్) ఇద్దరూ కూడా ఎంటర్ అవుతారు. వీరి వల్ల రాబిన్ హుడ్ కంఫర్ట్ మిస్సవుతాడు. ఇక అక్కడి నుంచి ఏం జరిగింది? రాబిన్ ఎందుకు కంఫర్ట్ మిస్సయ్యాడు? ఠాకూర్, మున్నలు ఏం చేసారు? చైత్రను ఎవరు కిడ్నాప్ చేసారు? రాబిన్ హుడ్ తన ఆస్తులను దక్కించుకున్నాడా? చైత్రకు రాబిన్ హుడ్ ప్రేమ దొరికిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘కిక్2’ చూడాల్సిందే.


‘పవర్’ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిక్2’. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

‘కిక్’ సినిమాలో కిక్కు కావాలి అంటూ నవ్వించిన రవితేజ... ఈ ‘కిక్2’లో కంఫర్ట్ కావాలంటూ ఎంటర్ టైన్ చేయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిక్2’ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ను అందించారు.



ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఈరోజు (ఆగష్టు 21) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసారు. మరి ఈ సినిమా ఎలా వుందో, ప్రేక్షకులను ఎలా అలరించనుందో ఒకసారి చూద్దామా!

cinima-reviews
కిక్2

ప్లస్ పాయింట్స్:
‘కిక్2’ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్ రవితేజ. గతంలో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంతగా ఎంటర్ టైన్ చేసిందో... ‘కిక్2’ అంతకంటే ఎక్కువ ఎంటర్ టైన్ తో తెరకెక్కింది. సినిమాలో భారీ యాక్షన్ సన్నీవేశాలే కాకుండా కడుపు చెక్కలయ్యే విధంగా కామెడీగా వుంది. మాస్ రాజా మహారాజ రవితేజ ‘కిక్2’లో అదరగొట్టాడు. ఎనర్జీ విషయంలో రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. యాక్షన్, కామెడీ, లవ్, రొమాంటిక్... ఇలా అన్నింటిలో రవితేజ తుప్పురేగ్గొట్టాడు. ముఖ్యంగా రవితేజ ఇందులో కాస్త స్లిమ్ గా కనిపించి మెప్పించాడు. లుక్స్ పరంగా ఇందులో చాలా స్టైలిష్ కనిపించాడు. అంతే కాకుండా రవితేజ చెప్పిన డైలాగ్స్ అదుర్స్. కిక్కు కాదు కంఫర్ట్ అంటూ ప్రేక్షకులకు పిచ్చెక్కించేసాడు. రాబిన్ హుడ్ పాత్రలో రవితేజ అదరగొట్టాడు. తన కంఫర్ట్ కోసం పక్కవాడికి చుక్కలు చూపించే క్యారెక్టర్ రాబిన్ హుడ్ ది.

ఇక రకూల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. రకూల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్ పరంగా, తన గ్లామర్, అందచందాలతో, హవాభావాలతో అదరగొట్టేసింది. కొన్ని కొన్ని సన్నివేశాలలో రకూల్ యాక్టింగ్ చాలా బాగుంది. రవితేజ, రకూల్ ల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక విలన్ ‘సోలమాన్ సింగ్ ఠాకూర్’ పాత్రలో నటించిన రవికిషన్ యాక్టింగ్ సూపర్బ్. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముఖ్యంగా తన హవాభావాలు చాలా బాగున్నాయి. ఇక కబీర్ సింగ్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీరి మధ్య వచ్చే పలు యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

పండిట్ రవితేజ పాత్రలో బ్రహ్మానందం తెగ నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో రవితేజ-బ్రహ్మానందంల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. వీరి కామెడీతో బాగా నవ్వించారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేసారు. ఇక ఐటెం సాంగులో నటించిన హాట్ బ్యూటీ నోర ఫతేహీ... తన అందాల ఆరబోతతో పిచ్చెక్కించేసింది.

ఇక ‘కిక్2’ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైన్మెంట్ తో పర్వాలేదనిపిస్తే... సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్, ఛాలెంజింగ్ ఎపిసోడ్స్ తో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి ‘కిక్2’ పర్వాలేదని చెప్పుకోవచ్చు.



మైనస్ పాయింట్స్:
‘కిక్2’ సెకండ్ హాఫ్ లో కాస్త ఎంటర్ టైన్మెంట్ తగ్గింది. అలాగే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కొన్ని కొన్ని పాత్రలను మరింత బాగా చూపించి వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో చాలా సమయం వరకు హీరో పాత్ర సైలెంట్ గా వుండిపోవడం, అలాగే కబీర్ సింగ్ పాత్రను మరింత బాగా రాసుకొని వుంటే బాగుండేది. కబీర్ సింగ్ పాత్రను మరింత పవర్ ఫుల్ గా తీస్తే బాగుండేది.

సాంకేతికవర్గం పనితీరు:
‘కిక్2’ చిత్ర సాంకేతికవర్గంలో ముందుగా సినిమాటోగ్రఫి నుంచి మొదలుపెడదాం. ఈ సినిమాకు మనోజ్ పరమహంస అద్భుతమైన సినిమాటోగ్రఫిని అందించారు. బీహర్ లోని పలు లొకేషన్లను చాలా అందంగా చూపించారు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా వున్నాయి. హీరోయిజం, విలనిజం అంశాలు కూడా చాలా చక్కగా చూపించారు. ఇక థమన్ సంగీతం చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. వక్కంతం వంశీ అందించిన కథ చాలా బాగుంది. కాకపోతే కథ రెగ్యులర్ ఫార్మెట్ తరహాలోనే వుందనే ఫీలింగ్ కలుగుతుంది. డైలాగ్స్ పరవాలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి మరో హిట్టును సొంతం చేసుకున్నాడని చెప్పుకొవచ్చు. కానీ కొన్ని కొన్ని ట్విస్టుల విషయంలో మరింత జాగ్రత్తగా తీసి వుంటే బాగుండేది. ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ఇక కళ్యాణ్ రామ్ నిర్మించిన నిర్మాణవిలువలు చాలా బాగున్నాయి. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు.

చివరగా:
కిక్2: రొటీన్ కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్